బింబిసార చిత్రంతో హిట్ కొట్టిన కళ్యాణ్ రామ్ కి అమిగోస్ రూపంలో ప్లాప్ పడింది. ఈసారి ఆయన స్పై యాక్షన్ డ్రామా ఎంచుకున్నారు. క్రైమ్, సస్పెన్స్, ఇన్వెస్టిగేటివ్ అంశాలతో డెవిల్ సినిమా తెరకెక్కింది. డెవిల్ విషయంలో కొన్ని వివాదాలు నడిచాయి. నవీన్ మేడారం దర్శకత్వంలో డెవిల్ ప్రారంభం అయ్యింది. తర్వాత ఆయన్ని తప్పించి, నిర్మాత అభిషేక్ నామా డైరెక్టర్ క్రెడిట్ తీసుకున్నారు. డెవిల్ సినిమా దర్శకుడిని నేనే అంటున్నాడు నవీన్ మేడారం.