Dollysha : తండ్రి లేడు.. ట్రాన్స్ జెండర్ గా మారిన తమ్ముడు.. ‘కాలింగ్ సహస్త్ర’ హీరోయిన్ లైఫ్ స్టోరీ.!

First Published | Dec 28, 2023, 9:35 PM IST

సుడిగాలి సుధీర్ ‘కాలింగ్ సహస్త్ర’ మూవీతో  డాలీషా (Dollysha)  తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. అయితే ఆమె లైఫ్ స్టోరీ కన్నీళ్లు తెప్పిస్తోంది. ఆమె ఫ్యామిలీ, తమ్ముడి సూసైడ్ విషయాలను ఆమె ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. 

వెండితెరపై మెరవాలని ఎంతో మంది యంగ్ టాలెంట్స్ ఇండస్ట్రీకి వస్తుంటారు. కొందరికి బ్యాక్ గ్రౌండ్ తోపాటు టాలెంట్ ఉంటే.. మరికొందరు మాత్రం కేవలం టాలెంట్ తోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. కొందరి తెరవెనుక కథలు కన్నీళ్లు కూడా తెప్పిస్తుంటాయి. అలాంటిదే ‘కాలింగ్ సహస్త్ర’ Calling Sahastra హీరోయిన్ డాలీషా కథ. 
 

ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన వివరాల ప్రకారం..  మధ్యప్రదేశ్ కు చెందిన డాలీషా మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి మోడలింగ్ రంగంలో అడుగుపెట్టింది. ఆమె సంపాదనతోనే కుటుంబం గడవాల్సిన పరిస్థితి. ఆమెకు తండ్రి కూడా చిన్నతనంలోనే దూరమయ్యారు. ఆమెకు ఓ తమ్ముడు కూడా ఉన్నాడు. 


కొంచెం పెద్దాయ్యాక ఇద్దరూ సంపాదించడం ప్రారంభించారు. డాలీసా మోడలింగ్ లో అడుగుపెట్టి.. హైదరాబాద్ కు చేరుకుంది. తన తమ్ముడు జాబ్ కోసమని ఢిల్లీకి వెళ్లారు. అంత మంచిగానే సాగుతుందనుకునే సమయంలో తమ్ముడు నుంచి ఊహించని కాల్ వచ్చింది. 

తనకు ట్రాన్స్ జెండర్ ఫీలింగ్స్ ఉన్నాయని.. ఆపరేషన్ చేయించుకుంటానని చెప్పారు. లేదని ఆమె వారించారు. కానీ ఆ కొద్దిరోజులకే ఆపరేషన్ కూడా చేయించుకున్నారు. ట్రాన్స్ జెండర్ గా మారిపోయారు. లెహర్ అనే పేరు కూడా పెట్టుకున్నారు. కానీ ఆ ఆపరేషన్ తో తన శరీరం వీక్ అయ్యిందని, వాళ్లు భరించే పెయిన్ చాలా దారుణంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. 

మూడు నెలల కిందనే తన తమ్ముడు చెల్లిగా మారిపోయిందని చెప్పింది. ఆ ఘటనతో అమ్మ కూడా దిగులుపడుతుందని చెప్పుకొచ్చింది. నేను కూడా అదే ఫీలింగ్ లో ఉండటం కరెక్ట్ కాదని, వర్క్ పై ఫోకస్ పెట్టానన్నారు. భవిష్యత్ లో ట్రాన్స్ జెండర్స్ కోసం ఏదైనా మంచి చేస్తానని కూడా ఇంటర్వ్యూలో హామీనిచ్చారు. 
 

తన లైఫ్ స్టోరీ గురించి తెలుసుకున్న వారు డాలీషాకు మంచి అవకాశాలు రావాలని ఆశిస్తున్నారు. ఇక డాలీషా ఎప్పుడూ ఎక్కువగా తన బ్యాక్ స్టోరీ గురించి చెప్పలేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో టాలెంట్ తోనే ఆఫర్లు అందుకోవాలని ప్రయత్నిస్తున్నారు. మున్ముందు ఇంకెలాంటి సినిమాలు చేస్తుందో చూడాలి. 

Latest Videos

click me!