Published : Dec 28, 2023, 06:47 PM ISTUpdated : Dec 28, 2023, 06:50 PM IST
యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. ఈ క్రమంలో తన నుంచి ఊహించని విధంగా పోస్టులు కూడా వస్తుంటాయి.
‘జబర్దస్త్’ Jabardasth కామెడీ షోతో అనసూయ భరద్వాజ్ యాంకర్ గా గుర్తింపు పొందారు. తన స్కిల్స్ తో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా క్రే్ దక్కించుకుంది. అలాగే బ్యూటీఫుల్ అవుట్ ఫిట్లలోనూ మెరుస్తూ బుల్లితెరపై సెన్సేషన్ క్రియేట్ చేసింది.
26
ప్రస్తుతం తన యాంకరింగ్ కెరీర్ కు గుడ్ బై చెప్పి నటిగా సెటిల్ అయ్యింది. స్మాల్ స్క్రీన్ కు దూరమై వెండితెరకు బాగా దగ్గరైంది. టీవీలో కనిపించకపోయినా తన అభిమానుల కోసం నెట్టింట సందడి చేస్తూనే ఉంటుంది.
36
ఎప్పటికప్పుడు తన గురించిన అప్డేట్స్ ను అందిస్తూ అభిమానులను మరింతగా ఆకట్టుకుంటూ వస్తోంది.ఈ క్రమంలో బ్యూటీఫుల్ గా పొటోషూట్లు కూడా చేస్తోంది. తన గ్లామర్ ఫొటోలను నెట్టింట షేర్ చేస్తూ కుర్రాళ్లను మంత్రముగ్ధులను చేస్తోంది.
46
తాజాగా మాత్రం అనసూయ ఊహించని విధంగా దర్శనమిచ్చింది. ఎప్పుడూ మేకప్ తో మెరిసే అనసూయ.. ఈ సారి మాత్రం కనీసం లిప్ స్టిక్ కూడా లేకుండా దర్శనమిచ్చింది. తన నేచురల్ అందంతో కట్టిపడేసింది.
56
సింపుల్ లుక్ లో మెరిసిన అనసూయ మేకప్ లేకపోయినా ఆకర్షించే చర్మ సౌందర్యంతో చూపుతిప్పుకోకుండా చేశారు. స్కిన్ టోన్, చర్మ సౌందర్యంతో కట్టిపడేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అభిమానులతో పాటు నెటిజన్లూ ఫిదా అవుతున్నారు.
66
ఇదిలా ఉంటే.. అనసూయ కెరీర్ లోనూ ఫుల్ బిజీగా ఉంటోంది. మొన్నటి వరకు గ్యాప్ లేకుండా వరుస చిత్రాలతో కుమ్మేసింది. ప్రస్తుతం ఐాకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప2 ది రూల్ Pushpa 2 The Ruleలో కీలక పాత్ర పోషిస్తోంది. తమిళంలో మరో సినిమా చేస్తోంది.