నందమూరి హీరోలు పోలీస్ పాత్రల్లో నటిస్తే ఆ చిత్రాలు సూపర్ హిట్ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోవచ్చు. నందమూరి హీరోలు ఖాకీ డ్రెస్ లో నటించిన సినిమాల జాబితా ఈ కథనంలో ఉంది.
నందమూరి హీరోలు పోలీస్ పాత్రల్లో నటించిన ప్రతిసారీ మంచి ఫలితాలు వచ్చాయి. నందమూరి తారక రామారావు నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు ప్రతి ఒక్కరూ ఖాకీ డ్రెస్ లో ఫైర్ చూపించారు. నందమూరి హీరోలు పోలీస్ అధికారులుగా నటించిన సినిమాలు, వాటి విజయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
28
కొండవీటి సింహం
స్వర్గీయ నందమూరి తారక రామారావు తన కెరీర్ లో ఎన్నోసార్లు పోలీస్ పాత్రల్లో నటించారు. వాటిలో రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన కొండవీటి సింహం మూవీ ఒకటి. ఈ మూవీలో ఎన్టీఆర్ ఎస్పీ రంజిత్ కుమార్ పాత్రలో విశ్వరూపం ప్రదర్శించారు. ఈ మూవీలో శ్రీదేవి, జయంతి, మోహన్ బాబు, కైకాల సత్యనారాయణ కీలక పాత్రల్లో నటించారు. 1981లో విడుదలైన కొండవీటి సింహం మూవీ సంచలన విజయం సాధించింది.
38
రౌడీ ఇన్‌స్పెక్టర్
ఎన్టీఆర్ తర్వాత వెండి తెరపై పోలీస్ పాత్రలకు కళ తీసుకువచ్చింది బాలకృష్ణే అని చెప్పాలి. రౌడీ ఇన్‌స్పెక్టర్ మూవీ బాలయ్య నట విశ్వరూపం ప్రదర్శించారు. బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో ఇది ఒకటిగా నిలిచింది. ఈ మూవీలో విజయశాంతి హీరోయిన్ గా నటించింది.
నందమూరి హరికృష్ణ సీతయ్య చిత్రంలో పోలీస్ గా ఖాకీ డ్రెస్ లో అదరగొట్టారు. ఈ మూవీలో సౌందర్య, సిమ్రాన్ హీరోయిన్లుగా నటించారు. వైవిఎస్ చౌదరి ఈ చిత్రానికి దర్శకుడు. ఈ మూవీలో హరికృష్ణ డైలాగ్స్, కీరవాణి అందించిన పాటలు ఒక ఊపు ఊపాయి.
58
లక్ష్మీ నరసింహ
బాలకృష్ణ మరోసారి పోలీస్ అధికారిగా నటించిన మూవీ లక్ష్మీ నరసింహ. 2004లో జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఆసిన్ హీరోయిన్ గా నటించారు.
68
బాద్షా
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాద్షా చిత్రంలో అండర్ కవర్ లో ఉండే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా నటించారు. ఎన్టీఆర్ ఖాకీ డ్రెస్ లో కనిపించే సన్నివేశాలు ఫ్యాన్స్ ఫీస్ట్ లా ఉంటాయి. శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ నటన, బ్రహ్మానందం కామెడీ హైలైట్ గా నిలిచాయి.
78
పటాస్
నందమూరి కళ్యాణ్ రామ్ పోలీస్ అధికారిగా నటించిన మూవీ పటాస్. అనిల్ రావిపూడి దర్శకుడిగా ఇది డెబ్యూ మూవీ. లంచగొండిగా ఉండే పోలీస్ అధికారి తిరిగి ఎలా మంచివాడిగా సీనియర్స్ గా మారాడు అనే కథాంశం తో ఈ చిత్రం రూపొందింది. కళ్యాణ్ రామ్ కి చాలా కాలం తర్వాత బ్రేక్ ఇచ్చిన మూవీ ఇది.
88
టెంపర్
జూనియర్ ఎన్టీఆర్, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో రూపొందిన టెంపర్ మూవీ కథ కూడా దాదాపుగా పటాస్ లాగే ఉంటుంది. కానీ ఇది కంప్లీట్ గా పూరి జగన్నాధ్ స్టైల్ స్క్రీన్ ప్లే తో సాగుతుంది. ఈ మూవీలో ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ గా నటన అదరగొట్టారు. దండయాత్ర ఇది దయాగాడి దండయాత్ర అంటూ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్స్ హైలైట్ గా నిలిచాయి. ఈ మూవీలో ఎన్టీఆర్ పోలీస్ అయినప్పటికీ చివర్లో మాత్రమే ఖాకీ డ్రెస్ లో కనిపిస్తారు.