ఇది కదా అసలు సిసలైన కాంబో, సెట్ అయితే ఓజీకి 100 రెట్లు ఇంపాక్ట్..పవన్ నెక్స్ట్ మూవీ రేసులో లోకేష్ కనకరాజ్

Published : Oct 18, 2025, 08:18 AM IST

Pawan Kalyan and Lokesh Kanagaraj: ఓజీ తర్వాత ఫుల్ జోష్ లో ఉన్న పవన్ ఫ్యాన్స్ కి మరో గుడ్ న్యూస్ రాబోతోంది. ఇద్దరు తమిళ క్రేజీ దర్శకులు పవన్ తో సినిమా చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 

PREV
15
ఓజీతో ఫ్యాన్స్ ఖుషీ 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల ఓజీ చిత్రంతో భారీ హిట్ అందుకుని అభిమానుల ఆకలి తీర్చారు. సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2025 లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించే సినిమాపై బలమైన వార్తలు వస్తున్నాయి. 

25
కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో పవన్ మూవీ 

పవన్ కళ్యాణ్ ఆల్రెడీ కన్నడ ప్రొడక్షన్ హౌస్ కేవీఎన్ ప్రొడక్షన్ సంస్థకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సంస్థలో పవన్ కళ్యాణ్ ఓ చిత్రంలో నటించేందుకు ఒప్పందం జరిగిందట. ఇప్పటికే పలుమార్లు కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మాత ఎన్ కె లోహిత్ పవన్ కళ్యాణ్ ని కలిశారు. దీనితో ఈ సంస్థలో పవన్ కళ్యాణ్ మూవీ లాక్ అయింది. ప్రస్తుతం కెవిఎన్ సంస్థ సరైన దర్శకుడు, కథ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకునే న్యూస్ వైరల్ గా మారింది. 

35
పవన్ కళ్యాణ్, లోకేష్ కనకరాజ్ కాంబో 

పవన్ తో సినిమా కోసం కేవీఎన్ సంస్థ ఇద్దరు క్రేజీ తమిళ దర్శకులతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ ఇద్దరూ ఎవరో కాదు.. ఒకరు లోకేష్ కనకరాజ్, మరొకరు హెచ్ వినోత్. వీళ్ళిద్దరూ ప్రూవెన్ దర్శకులు. లోకేష్ కనకరాజ్ కి అయితే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉంది. ఖైదీ, విక్రమ్, కూలీ లాంటి చిత్రాలని లోకేష్ కనకరాజ్ తెరకెక్కించారు. ఇక హెచ్ వినోత్ కూడా ప్రతిభావంతుడు. థ్రిల్లర్స్, స్టైలిష్ యాక్షన్ మూవీస్ తెరకెక్కించడంలో ఇతడు దిట్ట. వినోత్ ఇప్పటికే అజిత్ తో వలిమై, తెగింపు అనే చిత్రాలు రూపొందించారు. ప్రస్తుతం దళపతి విజయ్ తో జన నాయకన్ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 

45
ఓజీకి 100 రెట్లు 

వీరిద్దరిలో ఒకరితో పవన్ కళ్యాణ్ కాంబినేషన్ సెట్ అయ్యేలా కేవీఎన్ సంస్థ చర్చలు జరుపుతోంది. పవన్ అభిమానులంతా లోకేష్ కనకరాజ్ తో మూవీ సెట్ కావాలని కోరుకుంటున్నారు. పవన్, లోకేష్ కాంబినేషన్ సెట్ అయితే ఆ ఇంపాక్ట్ ఓజీ చిత్రానికి 100 రెట్లు ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. 

55
చిరంజీవితో కూడా మూవీ 

కేవీఎన్ ప్రొడక్షన్ సంస్థ ప్రస్తుతం భారీ చిత్రాలని నిర్మిస్తోంది. యష్ 'టాక్సిక్' మూవీ వీరి బ్యానర్ లోనే రూపొందుతోంది. అదే విధంగా మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లోని మెగా 158 చిత్రాన్ని కూడా వీరే నిర్మిస్తున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories