ఎంతటి మాస్ హీరో అయినా సరే వెంకటేష్ ని తక్కువ అంచనా వేస్తే అంతే.. 4 సార్లు చిత్తైపోయిన బాలకృష్ణ

Published : Dec 04, 2025, 12:10 PM IST

మాస్ హీరోల సినిమాలని తన ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తో చిత్తు చేసే సత్తా వెంకటేష్ కి మాత్రమే సొంతం. నాలుగు సార్లు బాలయ్య లాంటి మాస్ హీరోపై వెంకటేష్ బాక్సాఫీస్ వార్ లో విజయం సాధించారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి. 

PREV
15
వెంకటేష్ Vs బాలకృష్ణ

విక్టరీ వెంకటేష్ తన కెరీర్ బిగినింగ్ లో మాస్ సినిమాలు ఎక్కువగా చేశారు. ఆ తర్వాత నెమ్మదిగా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ జోనర్ కి వెంకీ మారారు. ఈ మార్పు వెంకటేష్ కి బాగా కలసి వచ్చింది. చిరంజీవి, బాలకృష్ణ లాంటి హీరోలు మాస్ సినిమాలు చేస్తుండడంతో.. వెంకటేష్ తన సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ కి ఫేవరేట్ హీరోగా మారిపోయాడు. ఫ్యామిలీ సినిమాలు చేస్తున్నాడని వెంకీ బాక్సాఫీస్ స్టామినాని తక్కువగా అంచనా వేస్తే పొరపాటే. అలా వెంకీతో పోటీ పడి బాలయ్య లాంటి మాస్ హీరో 4 సార్లు చిత్తైపోయాడు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

25
శ్రీకృష్ణార్జున విజయము - ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు

బాలకృష్ణ తన కెరీర్ లో కొన్ని సార్లు పౌరాణిక చిత్రాలతో ప్రయోగాలు చేశారు. కానీ తన తండ్రి ఎన్టీఆర్ స్థాయిలో బాలయ్యకి విజయాలు దక్కలేదు. 1996 మే 16న సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన పౌరాణిక చిత్రం శ్రీకృష్ణార్జున విజయము రిలీజ్ అయింది. అంచనాలని అందుకోలేక ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. ఈ చిత్రానికి వారం తర్వాత విడుదలైన వెంకటేష్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు మూవీ సూపర్ హిట్ గా నిలిచింది.

35
వంశోద్ధారకుడు - కలిసుందాం రా

2000 సంవత్సరం సంక్రాంతికి జనవరి 14న బాలకృష్ణ నటించిన వంశోద్ధారకుడు, వెంకటేష్ నటించిన కలిసుందాం రా రిలీజ్ అయ్యాయి. ఒకే రోజు రిలీజ్ కావడంతో అటు వెంకీ, ఇటు బాలయ్య అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. కానీ వంశోద్ధారకుడు ఫ్లాప్ కాగా.. వెంకటేష్ కలిసుందాం రా మూవీ ఏకంగా ఇండస్ట్రీ హిట్ గా సంచలనం సృష్టించింది.

45
ఎన్టీఆర్ కథానాయకుడు - ఎఫ్ 2

మరోసారి వీరిద్దరూ 2019 సంక్రాంతికి పోటీ పడ్డారు. జనవరి 9న బాలకృష్ణ నటించిన తన తండ్రి బయోపిక్ చిత్రం ఎన్టీఆర్ కథానాకుడు రిలీజ్ అయింది. బాలయ్య ఎంతో ఇష్టపడి ఈ చిత్రం చేసినప్పటికీ బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫ్లాప్ గా నిలిచింది. జనవరి 12న రిలీజైన వెంకటేష్ ఎఫ్ 2 చిత్రం సంచలనంగా 100 కోట్లకుపైగా గ్రాస్ రాబట్టింది. కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపింది.

55
డాకు మహారాజ్ - సంక్రాంతికి వస్తున్నాం

ఈ ఏడాది 2025 సంక్రాంతికి మరోసారి బాలయ్య, వెంకీ మధ్య బాక్సాఫీస్ వార్ జరిగింది. బాలయ్య నటించిన మాస్ యాక్షన్ మూవీ డాకు మహారాజ్ జనవరి 12న విడుదలైంది. ఈ మూవీ మంచి విజయమే సాధించింది. బిగినింగ్ లో కలెక్షన్స్ బాగా వచ్చాయి. 2 రోజుల గ్యాప్ లో సంక్రాంతికి వస్తున్నాం చిత్రం జనవరి 14న రిలీజ్ అయింది. నెమ్మదిగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద జోరు పెంచుతూ సంచలన విజయం గా నిలిచింది. సంక్రాంతికి వస్తున్నాం చిత్రం జోరుతో డాకు మహారాజ్ కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. డాకు మహారాజ్ హిట్ కాగా.. సంక్రాంతికి వస్తున్నాం చిత్రం వెంకటేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా దాదాపు 300 కోట్ల గ్రాస్ రాబట్టింది.

జస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తోనే ఎలాంటి మాస్ హీరోలని అయినా చిత్తు చేయగలనని చాలా సందర్భాల్లో వెంకటేష్ ప్రూవ్ చేశారు.

Read more Photos on
click me!

Recommended Stories