Illu Illalu Pillalu Today Episode Dec 4: ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్లో వల్లీ మహానటిని మించిపోయింది. ఇకపై వల్లీ 2.0ని చూస్తారని చెప్పింది. ఇకపై మనం ఎన్ని వేషాలు చూడాలో. ఇక ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోండి.
ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ లో నర్మద, ప్రేమ కలిసి వల్లికి వార్నింగ్ ఇవ్వడంతో ప్రారంభమవుతుంది. ‘ఇకపైన నీ కాపురం నువ్వు చేసుకో, మా విషయాల్లో వేలు పెట్టకు’ అని ఇద్దరూ చెబుతారు. దానికి వల్లి కూడా ఒప్పుకుంటుంది. ‘ఇకపై వల్లి 2.0 ని మీరు చూస్తారు’ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ప్రేమ మాట్లాడుతూ వల్లీ మారడం చాలా కష్టం అంటుంది. కానీ నర్మద మాత్రం వల్లీ మారుతుందనే నమ్మకాన్ని కలిగి ఉంటుంది. మరోపక్క వల్లి పక్కకొచ్చి నర్మద, ప్రేమను తిట్టుకుంటూ ఉంటుంది. అక్కడున్న బియ్యం బస్తాలను ప్రేమ, నర్మదా అనుకొని కాలుతో తన్నడం, గుద్దడం వంటివి చేస్తుంది. వాటిని చూసి నర్మద, ప్రేమ మళ్ళీ అక్కడికి వస్తారు.
మేము ఈ బస్తాలనుకొని మా మీద కోపం వీటి మీద చూపించావు కదా అంటే వల్లి ఓవరాక్షన్ మొదలుపెడుతుంది. మీరు ఏదేదో ఊహించుకుంటున్నారు అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మామయ్యకి దీని గురించి చెప్పేద్దామని అంటుంది ప్రేమ అంటుంది... కానీ నర్మద మాత్రం ఒప్పుకోదు. ఎంతైనా తను మన అక్కలాంటిది, తన బుద్ధి మార్చి తన కాపురాన్ని చక్కదిద్దాలి కానీ నాశనం చేయకూడదని చెబుతుంది.
24
విశ్వ ఇచ్చిన చీరలో అమూల్య
ఇక ఇక్కడి నుంచి సీన్.. అమూల్య దగ్గరికి మారుతుంది. విశ్వ ఇచ్చిన చీరను అమూల్య కట్టుకొని అద్దంలో చూసి మురిసిపోతూ ఉంటుంది. విశ్వాది మంచి సెలక్షనే అని ఆ చీరతో బయటకి వస్తుంది. వేదవతి అమూల్య చూసి ఈ చీర ఎక్కడిది? ఈ చీర నేను నీకు కొనలేదు కదా అని అంటుంది. దానివి అమూల్య గాభరా పడిపోతూ వల్లి వదిన ఇచ్చింది అని చెబుతుంది. ధీరజ్ అక్కడికి వచ్చి అదేంటి నేను అడిగినప్పుడు నీ ఫ్రెండ్ ఇచ్చిందని చెప్పావు అని అంటాడు. ఆ చీర గురించి వేదవతి చాలా గట్టిగా అడగడంతో వల్లి కల్పించుకుంటుంది. తానే ఆ చీర ఇచ్చానని చెప్పేస్తుంది వల్లి. వేదవతి మాట్లాడుతూ ఈ మధ్యన నీ మాటల్లోనూ ప్రవర్తనలోనూ చాలా తేడా కనిపిస్తోంది అనడంతో అమూల్య, వల్లి భయపడిపోతూ ఉంటారు. ధీరజ్ సర్ది చెప్పడంతో వేదవతి అక్కడినుంచి వెళ్ళిపోతుంది. తర్వాత వల్లి ,అమూల్య మాట్లాడుకుంటారు. చీర ఎవరిచ్చారని వల్లి అడగ్గానే.. అమూల్య విశ్వ ఇచ్చి పూజకు కట్టుకోమని చెప్పాడని అంటుంది.
34
ఇంట్లోకి తిరుపతికి ఎంట్రీ
ఇక తిరుపతి మాత్రం రెండిళ్ల మధ్యన ఇంకా అలాగే తిరుగుతూ ఉంటాడు. ఎవరూ కూడా ఇంట్లోకి రమ్మని పిలవక పోవడంతో ఇలా రోడ్డుమీద తిరుగుతూ ఉంటాడు. సాగర్, ధీరజ్, పెద్దోడు రాగానే వాళ్లని ఇంట్లోకి తీసుకెళ్లేందుకు రామరాజును ఒప్పించమని అడుగుతాడు. అయితే వాళ్లు కూడా నగల గురించి అడగడంతో తిరుపతి తల పట్టుకుంటాడు. ఆ తర్వాత రామరాజు అక్కడికి వస్తాడు. తన బాధను రామరాజుతో చెప్పుకుంటాడు తిరుపతి. ‘మా వాళ్ళ కంటే నాకు నువ్వంటేనే ఇష్టం. చిన్నప్పుడే అమ్మానాన్నలని, అక్కా అన్నయ్యలని ఎదిరించి నీతో పాటు వచ్చాను. మీరు ఏడిస్తే ఏడ్చాను. మీరు నవ్వితే నవ్వాను. నీలో నాన్నని చూసుకున్నాను’ అని సెంటిమెంట్ డైలాగులు కొడతాడు. దీంతో రామరాజు కాస్త చల్లబడతాడు. ఈ లోపు ముగ్గురు కొడుకులు వచ్చి రామరాజుని బతిమిలాడతారు. ఈలోపు తిరుపతి మాట్లాడుతూ పరిగెత్తుకుంటూ రామరాజు ఇంట్లోకి వచ్చేస్తాడు. అప్పుడు రామరాజు పూజకు ఇంట్లోకి రమ్మని తిరుపతికి చెబుతాడు. దీంతో తిరుపతి సంతోషంగా రామరాజు ఇంట్లోకి వెళ్లిపోతాడు.
ఇక ఇంట్లో పూజ జరుగుతూ ఉంటుంది. ప్రేమకు మాత్రం ధీరజ్ అన్న మాటలు గుర్తొస్తూ ఉంటాయి. నీ మెడలో తాళి కట్టకుండా ఉండాల్సిందే అనే డైలాగ్ పదేపదే గుర్తొచ్చి ధీరజ్ కి కొంచెం దూరంగా జరుగుతుంది. అయినా ధీరజ్.. ప్రేమ పక్కకే మళ్ళీ జరుగుతాడు. అలా వారిద్దరూ కాసేపు గిల్లికజ్జాలు పెట్టుకుంటారు. ఏదో కోపంలో అనేసానని ఇంకెప్పుడు అననని చెబుతాడు ధీరీజ్. అయినా ప్రేమ వినదు. వీరు చేసినదంతా తిరుపతి చూస్తూ ఉంటాడు. వెంటనే ‘మీరు పూజ గదిలో ఉన్నామనుకుంటున్నారా.. మీ గదిలో ఉనమనుకుంటున్నారా? ఏంటి రొమాన్స్’ అని అంటాడు. దాంతో అందరూ ఒక్కసారిగా నవ్వుతారు. ఇక్కడతో ఎపిసోడ్ ముగిసిపోతుంది.