Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణ కెరీర్ లో అతి దారుణమైన 7 ఫ్లాప్ చిత్రాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. సీమ సింహం నుంచి పరమవీర చక్ర వరకు ఫ్లాప్ సినిమాల జాబితా ఇక్కడ ఉంది.
నందమూరి బలకృష్ణ అంటే వెండి తెరపై పవర్ ఫుల్ మ్యానరిజమ్స్ కి పెట్టింది పేరు. మాస్ ఆడియన్స్ లో బాలయ్యకి విపరీతమైన క్రేజ్ ఉంది. బాలకృష్ణ నటించిన సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు, సింహా లాంటి మాస్ యాక్షన్ చిత్రాలు అద్భుత విజయం సాధించాయి. అయితే కొన్ని సందర్భాల్లో బాలయ్య మాస్ చిత్రాల వల్లే దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కొన్నారు. బాలకృష్ణ తన కెరీర్ లో ఎన్నో హిట్ చిత్రాలు, ఫ్లాప్ చిత్రాల్లో నటించారు. బాలయ్య ఫ్లాప్ మూవీస్ లో ఈ 7 చిత్రాలని మాత్రం ఫ్యాన్స్ కూడా జీర్ణించుకోలేరు. ఆ 7 చిత్రాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
28
సీమ సింహం
2002 లో బాలకృష్ణ నటించిన సీమ సింహం చిత్రం రామ్ ప్రసాద్ అనే దర్శకుడి దర్శకత్వంలో తెరకెక్కింది. సిమ్రాన్, రీమా సేన్ హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం దారుణమైన పరాజయం చవిచూసింది.
38
పలనాటి బ్రహ్మనాయుడు
బాలకృష్ణ అభిమానులు అస్సలు గుర్తు చేసుకోకూడదు అని భావించే చిత్రాల్లో పలనాటి బ్రహ్మనాయుడు ఒకటి. సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు లాంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాలని బాలయ్యకి ఇచ్చిన బి గోపాల్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. సూపర్ హిట్ కాంబో కావడంతో కనీవినీ ఎరుగని అంచనాలతో పలనాటి బ్రహ్మనాయుడు రిలీజ్ అయింది. బాలయ్య కెరీర్ లోనే దారుణమైన ఫ్లాప్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ మూవీలో ట్రైన్ రివర్స్ సన్నివేశాలు ఇప్పటికీ ట్రోల్ అవుతుంటాయి. ఓ ఇంటర్వ్యూలో బాలయ్య మాట్లాడుతూ.. 'అసలు పలనాటి బ్రహ్మనాయుడు చిత్రాన్ని నేను ఎందుకు ఒప్పుకున్నానో తెలియదు. డైరెక్టర్ ఆ ట్రైన్ సీన్ ఎందుకు తీశారో తెలియదు' అని తన సినిమాపై తానే సెటైర్లు వేసుకున్నారు.
బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథ అందించారు. స్వర్ణ సుబ్బారావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలయ్య ఇండియన్ ఆర్మీ అధికారిగా నటించారు. ఈ మూవీలో అతిగా అనిపించే యాక్షన్ సన్నివేశాలు చాలానే ఉంటాయి. కన్విన్సింగ్ గా లేని సీన్ల కారణంగా ఈ చిత్రం ఫ్లాప్ అయింది.
58
అల్లరి పిడుగు
జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో అల్లరి పిడుగు చిత్రం రూపొందింది. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించారు. ఛార్మి సెకండ్ హీరోయిన్ గా నటించింది. బాలయ్య కెరీర్ లో మరచిపోదగ్గ చిత్రాల్లో అల్లరి పిడుగు కూడా ఒకటి. ఈ మూవీలో సన్నివేశాలు కూడా ట్రోలింగ్ మెటీరియల్ గా మారాయి.
68
ఒక్క మగాడు
ఈ మూవీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అని బాలయ్య ఫ్యాన్స్ భావిస్తారు. వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. అంతకు ముందు వైవిఎస్ చౌదరి దేవదాసు, సీతయ్య, లాహిరి లాహిరి లాహిరిలో లాంటి వరుస విజయాలతో జోరుమీద ఉన్నారు. దీనితో ఒక్కమగాడు మూవీపై కనీవినీ ఎరుగని అంచనాలు ఏర్పడ్డాయి. తీరా చూస్తే సినిమా అత్యంత దారుణంగా ఉంది. ఈ చిత్రం రిలీజ్ అయ్యాక తాను కథ వినకుండా ఈ చిత్రాన్ని ఓకె చేశానని బాలయ్య తెలిపారు. బాలకృష్ణ కెరీర్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్స్ జాబితా తీస్తే పలనాటి బ్రహ్మనాయుడు, ఒక్క మగాడు చిత్రాలు టాప్ ప్లేస్ లో ఉంటాయి.
78
పాండురంగడు
రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. అన్నమయ్య, శ్రీరామదాసు రేంజ్ లో మంచి భక్తిరస చిత్రం అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమాలో భక్తి కంటే బూతు ఎక్కువైంది అనే విమర్శలు వచ్చాయి.
88
పరమవీర చక్ర
దాసరి నారాయణరావు దర్శకత్వంలో పరమవీర చక్ర చిత్రం రూపొందింది. పరమ రొటీన్ సన్నివేశాలతో ఈ మూవీ అప్పట్లో ప్రేక్షకులకు చిరాకు తెప్పించింది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం డిజాస్టర్ అయింది.