ఎన్టీఆర్‌ను ఎదిరించే దమ్మున్న వ్యక్తి ఆయనే.. నిజాన్ని బయటపెట్టిన బాలకృష్ణ..

Published : Jan 11, 2026, 07:31 AM IST

Nandamuri Balakrishna: 'అఖండ 2' సినిమాతో సూపర్ హిట్ కొట్టిన నందమూరి బాలకృష్ణ.. గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన తండ్రి ఎన్టీఆర్, అన్న హరికృష్ణ గురించి చేసిన ఆసక్తికర కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

PREV
15
వరుసగా ఐదు విజయాలు..

హీరో నందమూరి బాలకృష్ణ తాజాగా 'అఖండ 2' సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర హిట్ కాగా.. రీసెంట్‌గా ఆయన చేసిన ప్రతీ మూవీ మంచి విజయాన్ని అందుకుంటోంది. 'అఖండ', 'డాకు మహారాజ్', 'భగవంత్ కేసరి', 'వీరసింహ రెడ్డి'.. ఇప్పుడు 'అఖండ 2'.. ఇలా బాక్సాఫీస్ దగ్గర వరుసగా ఐదు విజయాలు అందుకున్నారు బాలకృష్ణ. త్వరలోనే దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో సినిమాను చేయనున్నారు.

25
కామెంట్స్ వైరల్..

గతంలో ఓ ఇంటర్వ్యూలో బాలకృష్ణ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఆ ఇంటర్వ్యూలో తన తండ్రి ఎన్టీఆర్, అన్న హరికృష్ణ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు బాలకృష్ణ. అలాగే తన మొదటి సినిమా అనుభవాలను కూడా అభిమానులతో షేర్ చేసుకున్నారు.

35
మొదటి సినిమా అనుభవం..

14 ఏళ్లకే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నందమూరి బాలకృష్ణ. ఆయన మొదటి సినిమా 'తాతమ్మ కల'. ఇందులో బాలకృష్ణకు నాయనమ్మ పాత్రలో నటి భానుమతి నటించారు. స్కూల్‌కు వెళ్తూ చదువుకునే వయస్సులో సినిమాల్లోకి రావడం.. సెలవు పెట్టి షూటింగ్‌కు వెళ్ళడం తనకు కొత్త అనుభవం అని గుర్తు చేసుకున్నారు హీరో బాలకృష్ణ.

45
ఓ సన్నివేశంలో..

ఈ సినిమాలోని ఓ సన్నివేశంలో నటి భానుమతి దగ్గరకు బాలయ్య నడుచుకుంటూ రావాల్సి ఉండగా.. ఆ సమయంలో తన తండ్రి ఎన్టీఆర్ నడకను ఇమిటేట్ చేశారు బాలయ్య. దాన్ని చూసిన ఎన్టీఆర్.. 'ఏంటి ఆ నడక.? అని బాలకృష్ణను అడిగారట. ఆ సమయంలో తన వయస్సు 14 ఏళ్లు మాత్రమేనని.. సినిమాల్లోకి వచ్చిన తనకు.. తనపై తన తండ్రి ప్రభావం ఎంతగానో ఉందని అన్నారు.

55
చిన్నప్పటి నుంచి ఎదురుతిరిగే స్వభావం..

తన అన్న హరికృష్ణ గురించి మాట్లాడిన బాలయ్య ఇలా అన్నారు.. చిన్నప్పటి నుంచి ఎదురుతిరిగే స్వభావం హరికృష్ణదని చెప్పారు. తాత దగ్గర ఊర్లో పెరగడంతో హరికృష్ణ మొండిగా ఉండేవారని.. తండ్రి ఎన్టీఆర్‌కు రైట్ హ్యాండ్‌గా ఉన్నారని తెలిపారు. తన తండ్రి ఏం చేసినా.. ధైర్యంగా ప్రశ్నించే వ్యక్తి హరికృష్ణ అని.. తమకు అప్పట్లో అంత ధైర్యం ఉండేది కాదని బాలయ్య పేర్కొన్నారు. అందరికంటే ఎక్కువగా హరికృష్ణ మాత్రమే ధైర్యంగా మాట్లాడేవారని స్పష్టం చేశారు.

Read more Photos on
click me!

Recommended Stories