నందమూరి ఫ్యాన్స్ అఖండ సంబరాల్లో మునిగితేలుతుండగా చిత్ర యూనిట్ మరింత జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. బాలయ్య ఆహా ఓటిటిలో అన్ స్టాపబుల్ షోకి హోస్ట్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. అఖండ రిలీజ్ కావడంతో చిత్ర యూనిట్ తో ఓ ఎపిసోడ్ ప్లాన్ చేశారు. డిసెంబర్ 10 నుంచి ఈ ఎపిసోడ్ ఆహా లో స్ట్రీమింగ్ కానుంది. ఈ ఎపిసోడ్ కి అఖండ డైరెక్టర్ బోయపాటి శ్రీను, సంగీత దర్శకుడు తమన్, హీరోయిన్ ప్రగ్య జైస్వాల్, విలన్ గా నటించిన శ్రీకాంత్ హాజరయ్యారు. దీనికి సంబందించిన ప్రోమో తాజాగా విడుదలైంది.