'డాకు మహారాజ్'గా బాలయ్య, టీజర్ రివ్యూ.. ఆ విజువల్స్ ఏంటి బాబోయ్

First Published | Nov 15, 2024, 11:59 AM IST

నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ ఎన్బీకే 109. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సంక్రాంతికి రిలీజ్ అంటూ వార్తలు వస్తున్నాయి కానీ ఇంతవరకు టైటిల్ అనౌన్స్ చేయలేదు. ఆ మధ్యన బాలయ్య పాత్రని పరిచయం చేస్తూ ఒక టీజర్ రిలీజ్ చేసారు. 

నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ ఎన్బీకే 109. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సంక్రాంతికి రిలీజ్ అంటూ వార్తలు వస్తున్నాయి కానీ ఇంతవరకు టైటిల్ అనౌన్స్ చేయలేదు. ఆ మధ్యన బాలయ్య పాత్రని పరిచయం చేస్తూ ఒక టీజర్ రిలీజ్ చేసారు. అది బాగా వైరల్ అయింది. కనై ఫ్యాన్స్ కి టైటిల్ విషయంలో నిరీక్షణ తప్పలేదు. ఎట్టకేలకు ఎదురుచూపులు తెరపడింది. 

టైటిల్ అనౌన్స్ చేస్తూ మైండ్ బ్లోయింగ్ టీజర్ రిలీజ్ చేశారు. డైరెక్టర్ బాబీ పక్కా కమర్షియల్ చిత్రం చేస్తాడు అనుకుంటే టీజర్ లో మైండ్ బ్లోయింగ్ విజువల్స్ తో సర్ప్రైజ్ చేశాడు. అద్భుతమైన కథతో బాబీ గట్టి ప్రయత్నం చేస్తున్నట్లు టీజర్ ద్వారా అర్థం అవుతోంది. టీజర్ లో హైలైట్ అయిన అంశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 


ఈ చిత్రానికి ఊహించని విధంగా 'డాకు మహారాజ్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. టైటిల్ సౌండింగ్ కొత్తగా ఉంటూ క్యూరియాసిటీ పెంచుతోంది. వాయిస్ ఓవర్ లో టీజర్ ప్రారంభం అవుతుంది. 'ఈ కథ వెలుగుని పంచే దేవుళ్ళది కాదు.. చీకటిని శాసించే రాక్షసులది కాదు.. ఆ రాక్షసులని ఆడించే రావణుడిది కాదు.. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది.. కండ్ర గొడ్డలి పట్టిన యమధర్మరాజుది.. మరణాన్ని వణికించిన మహారాజుది.. అంటూ వాయిస్ ఓవర్ లో పవర్ ఫుల్ డైలాగ్స్ వినిపిస్తాయి. ఆ తర్వాత బాలయ్య.. గుర్తు పెట్టావా.. డాకు.. డాకు మహారాజ్ అంటూ ఎంట్రీ ఇస్తారు. 

బాలయ్య గెటప్, బాడీ లాంగ్వేజ్ పవర్ ఫుల్ గా ఉన్నాయి. టీజర్ లో విజువల్స్ ఎక్కువగా ఎడారి ప్రాంతంలో చూపించారు. విజువల్స్ స్టన్నింగ్ అనిపించేలా ఉన్నాయి. ఒక భారీ చిత్రాన్ని బాబీ అందించబోతున్నాడు అని అర్థం అవుతోంది. హార్స్ రైడింగ్ సీన్లు కూడా ఎక్కువగా ఉన్నాయి. తమన్ బిజియం తో బాలయ్యకి మంచి ఎలివేషన్ ఇచ్చాడు. 

టీజర్ చివర్లో బాలయ్య కనిపించినప్పుడు, తమన్ బిజియం అదరగొట్టారు. బాలయ్య బ్లాక్ డ్రెస్ లో గుర్రపు స్వారీ చేస్తూ పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. బాబీ పీరియాడిక్ చిత్రం తెరకెక్కిస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. గతంలో టీజర్ రిలీజ్ చేసినప్పుడు బాలయ్య వేరు.. ఇందులో కనిపిస్తున్న బాలయ్య గెటప్ వేరు. డ్యూయెల్ రోల్ చేస్తున్నాడా అనేది కూడా తెలియాల్సి ఉంది. మొత్తంగా బిగ్ స్క్రీన్ పై మంచి ఎక్స్పీరియన్స్ అందించే చిత్రాన్ని బాబీ తెరకెక్కిస్తున్నట్లు టీజర్ ద్వారా అర్థం అవుతోంది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి జనవరి 12న రిలీజ్ చేయబోతున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. 

Latest Videos

click me!