పుష్ప 2 బడ్జెట్ రూ. 300 కోట్లు అనుకున్నారు. షూటింగ్ ఆలస్యం కావడంతో అది దాదాపు రూ. 500 కోట్లకు చేరిందట. ఆగస్టు 15న విడుదల కావాల్సిన పుష్ప 2 డిసెంబర్ కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. షూటింగ్ నిర్ణీత సమయానికి పూర్తి చేయని కారణంగా సుకుమార్ పై అల్లు అర్జున్ కోప్పడ్డారని, డైరెక్టర్-హీరో మధ్య విబేధాలు తలెత్తాయంటూ పుకార్లు వినిపించాయి.
పుష్ప 2 బడ్జెట్ లో అధిక భాగం రెమ్యూనరేషన్ రూపంలో ఖర్చు చేశారట. లాభాల్లో వాటా అడిగిన అల్లు అర్జున్ కి పుష్ప 2 ద్వారా రూ. 300 కోట్ల రెమ్యూనరేషన్ అందినట్లు కథనాలు వెలువడ్డాయి. ఇదే నిజమైతే దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా అల్లు అర్జున్ రికార్డులకు ఎక్కినట్లు అవుతుంది.