అట్టర్ ఫ్లాపుల్లో నుంచి దూసుకొచ్చిన పవన్, మహేష్, ప్రభాస్, చిరు.. టాలీవుడ్ లో అసలు సిసలైన కంబ్యాక్ చిత్రాలు

Published : Sep 01, 2025, 09:13 AM IST

టాలీవుడ్ హీరోలు వరుస ఫ్లాపుల్లో ఉన్నప్పుడు కొన్ని చిత్రాలతో అదిరిపోయేలా బౌన్స్ బ్యాక్ అయ్యారు. ఆ చిత్రాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం. 

PREV
19
Tollywood Heroes Comeback movies

స్టార్ హీరోలకు వరుస ఫ్లాపులు ఎదురైనప్పుడు తిరిగి పుంజుకునేందుకు ఒక కంబ్యాక్ మూవీ కోసం ఎదురుచూస్తుంటారు. టాలీవుడ్ లో దాదాపుగా అందరు స్టార్ హీరోలకు ఇలాంటి పరిస్థితి ఎదురైంది. మరి ఎవరెవరు ఎలాంటి చిత్రాలతో ఫ్లాపుల నుంచి బయటపడ్డారో ఇప్పుడు చూద్దాం. 

29
ఇష్క్ 

 యంగ్ హీరో నితిన్ దాదాపు 10 ఏళ్ళ పాటు హిట్ చిత్రానికి నోచుకోలేదు. ఇక నితిన్ కెరీర్ ముగిసిపోవడం ఖాయం అనుకుంటున్న తరుణంలో డైరెక్టర్ విక్రమ్ కుమార్ సింపుల్ లవ్ స్టోరీతో మ్యాజిక్ చేశారు. ఆ చిత్రమే ఇష్క్. ఈ మూవీలో నిత్యామీనన్ హీరోయిన్. నితిన్, నిత్యామీనన్ కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా కావడంతో ఈ మూవీ హిట్ అయింది. ఇష్క్ మూవీ లేకుంటే నితిన్ కెరీర్ ని ఊహించుకోలేం. 

39
డార్లింగ్ 

ఛత్రపతి తర్వాత ప్రభాస్ కి సరైన హిట్ లేదు. పౌర్ణమి, యోగి, మున్నా, బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ లాంటి అట్టర్ ఫ్లాప్ చిత్రాలతో ప్రభాస్ సతమతమయ్యాడు. మధ్యలో బిల్లా మాత్రమే యావరేజ్ గా నిలిచింది. ప్రభాస్ ఏంటి ఇలాంటి మూవీస్ చేస్తున్నాడు అని ఫ్యాన్స్ అనుకుంటున్న తరుణంలో ఫన్ అండ్ రొమాంటిక్ లవ్ స్టోరీ చిత్రం డార్లింగ్ తో అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చాడు. ఈ మూవీలో కాజల్ హీరోయిన్. కరుణాకరన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. 

49
పటాస్ 

నందమూరి కళ్యాణ్ రామ్ కి కూడా అతనొక్కడే తర్వాత దాదాపు పదేళ్లు సరైన హిట్ లేదు. అసాధ్యులు, విజయదశమి, కళ్యాణ్ రామ్ కత్తి, ఓం 3డి లాంటి చెత్త సినిమాలు కళ్యాణ్ రామ్ కెరీర్ ని వెనక్కి లాగాయి. ఆ టైంలో పటాస్ చిత్రం వచ్చింది. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో కళ్యాణ్ రామ్ కెరీర్ నిలబడింది. ఇది డైరెక్టర్ అనిల్ రావిపూడికి డెబ్యూ మూవీ. 

59
సింహా 

లక్ష్మీ నరసింహ మూవీ తర్వాత బాలయ్య కొన్ని చెత్త సినిమాలు చేశారు. ఆరేళ్లపాటు ఒక్క హిట్ కూడా లేదు. అల్లరి పిడుగు, ఒక్క మగాడు లాంటి చిత్రాలు విపరీతంగా ట్రోలింగ్ కి గురయ్యాయి. ఆ టైంలో డైరెక్టర్ బోయపాటి శ్రీను బాలయ్యకి పూర్వ వైభవం తీసుకువచ్చారు. సింహా చిత్రంతో బాలయ్య సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు. 

69
యమదొంగ 

సింహాద్రి చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ నెక్స్ట్ లెవల్ కి వెళ్ళిపోయింది. టాలీవుడ్ అగ్రహీరోల సరసన ఎన్టీఆర్ చేరారు. కానీ సింహాద్రి తర్వాత తారక్ కి అగ్నిపరీక్ష మొదలైంది. వరుస చిత్రాలు ఫ్లాప్ కావడంతో పాటు తన లుక్స్ విషయంలో కూడా విమర్శలు వచ్చాయి. ఆ టైంలో దర్శకధీరుడు రాజమౌళి తారక్ కి యమదొంగ చిత్రంలో అదిరిపోయే హిట్ ఇచ్చారు. కేవలం హిట్ మాత్రమే కాదు.. ఎన్టీఆర్ లుక్స్ మారడంలో కూడా రాజమౌళి కీలక పాత్ర వహించారు. ఈ చిత్రం కోసం తారక్ భారీగా బరువు తగ్గినా సంగతి తెలిసిందే. 

79
దూకుడు 

పోకిరి చిత్రం సెట్ చేసిన అంచనాలు అందుకోలేక మహేష్ నటించిన సైనికుడు, అతిథి, ఖలేజా చిత్రాలు నిరాశ పరిచాయి. ఆ టైంలో శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన దూకుడు చిత్రం మహేష్ ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషీ చేసేసింది. కమర్షియల్ గా దూకుడు చిత్రం అనేక రికార్డులు క్రియేట్ చేసింది. 

89
గబ్బర్ సింగ్ 

దాదాపు పదేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానుల ఆకలి తీర్చిన చిత్రం గబ్బర్ సింగ్. ఫ్యాన్స్ ఎలా కోరుకుంటున్నారో ఆ విధంగానే డైరెక్టర్ హరీష్ శంకర్ పవన్ ని ప్రజెంట్ చేశారు. పవన్ కళ్యాణ్ కి తిరుగులేని కంబ్యాక్ గా గబ్బర్ సింగ్ మూవీ నిలిచింది. 

99
హిట్లర్ 

మెగాస్టార్ చిరంజీవికి కూడా ఒక దశలో ఎదురుదెబ్బలు తప్పలేదు. వరుస ఫ్లాపులు ఎదురవుతున్న సమయంలో చిరంజీవి హవా తగ్గిపోతోంది అనే కామెంట్స్ మొదలయ్యాయి. ఆ టైం వచ్చిన చిత్రం హిట్లర్. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో చిరంజీవి ఐదుగురు చెల్లెళ్లకి అన్నగా అద్భుతమైన సెంటిమెంట్ పండించారు. 

Read more Photos on
click me!

Recommended Stories