చిరంజీవి చిత్రాల్లో బాలకృష్ణకి బాగా ఇష్టమైన మూవీ ఏంటో తెలుసా.. ఏ హీరో అయినా అలా చేస్తే నచ్చదట 

Published : Jan 27, 2025, 08:37 AM IST

నందమూరి బాలకృష్ణకి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. సినీ రంగంలో అందించిన సేవలకు గాను బాలయ్యకి దేశంలో అత్యుత్తమ మూడో అవార్డు దక్కింది. దీనితో బాలయ్య కెరీర్ గురించి, అరుదైన విషయాల గురించి నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

PREV
15
చిరంజీవి చిత్రాల్లో బాలకృష్ణకి బాగా ఇష్టమైన మూవీ ఏంటో తెలుసా.. ఏ హీరో అయినా అలా చేస్తే నచ్చదట 

నందమూరి బాలకృష్ణకి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. సినీ రంగంలో అందించిన సేవలకు గాను బాలయ్యకి దేశంలో అత్యుత్తమ మూడో అవార్డు దక్కింది. దీనితో బాలయ్య కెరీర్ గురించి, అరుదైన విషయాల గురించి నెటిజన్లు చర్చించుకుంటున్నారు. బాలకృష్ణ ఒక వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు రాజకీయాల్లో రాణిస్తున్నారు. 

25

హిందూపురం ఎమ్మెల్యేగా బాలయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవికి, బాలయ్యకి మధ్య ప్రధానంగా పోటీ కొనసాగింది అనే విషయం తెలిసిందే. సినిమాల విషయంలో పోటీ పడుతూనే ఇద్దరూ స్నేహంగా ఉండేవారు. కానీ ఫ్యాన్స్ మధ్య మాత్రం ఎప్పుడూ సోషల్ మీడియాలో యుద్ధం జరుగుతూ ఉంటుంది. బాలయ్య తన కెరీర్ లో అనేక అద్భుతమైన చిత్రాల్లో నటించారు. ఇతర హీరోల సినిమాల ని కూడా బాలయ్య చూస్తారట. 

35

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల్లో బాలయ్యకి బాగా ఇష్టమైన చిత్రం ఒకటుంది. ఆయా చిత్రం మరేదో కాదు.. రాఘవేంద్ర రావు, చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కిన దృశ్య కావ్యం జగదేక వీరుడు అతిలోక సుందరి. ఈ చిత్రం అంటే బాలయ్యకి చాలా ఇష్టం అట. ఇక రజనీకాంత్ ముత్తు సినిమా అంటే కూడా బాలయ్యకి ఇష్టం అని తెలుస్తోంది. 

45

బాలయ్య నటించిన అద్భుతమైన చిత్రాల్లో ఆదిత్య 369 చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ చిత్రంతో చిరంజీవికి కూడా అనుబంధం ఉంది. ఈ చిత్రం విడుదలయ్యాక చిరంజీవితో ప్రచారం చేస్తే సినిమా జనాల్లోకి ఇంకా బాగా వెళుతుంది అని ఆదిత్య 369 చిత్ర నిర్మాత భావించారు. ఆదిత్య 369 చిత్రానికి ప్రచారం చేయాలని చిరంజీవిని రిక్వెస్ట్ చేసిన వెంటనే ఆయన ఒప్పుకున్నారు. దూరదర్శన్ లో ఈ చిత్రానికి చిరు ప్రచారం చేశారు. 

55

సినిమాల్లో బాలయ్యకి నచ్చని అంశం ఒకటి ఉంది. చొక్కా విప్పి ఏ హీరో అయినా సిక్స్ ప్యాక్ ప్రదరిస్తే బాలయ్యకి నచ్చదట. అది మన సంస్కృతి కాదు అని అంటారు. బాలయ్య కూడా చాలా చిత్రాల్లో చొక్కా విప్పి నటించారు. కానీ ఆయన ఎప్పుడూ సిక్స్ ప్యాక్ కోసం ట్రై చేయలేదు. దర్శకుల కోసం చొక్కా విప్పి నటించాల్సి వచ్చిందట. తాను చేసే రొమాంటిక్ సన్నివేశాలు తనకి నచ్చవని కూడా బాలయ్య తెలిపారు. 

Read more Photos on
click me!

Recommended Stories