మహేష్ బాబు లేకుండా అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్‌లో రాజమౌళి కొన్ని పోర్షన్‌లను షూట్ చేసాడు. మహేష్ కెన్యాలో తన పోర్షన్‌ల షూటింగ్‌ను ప్రారంభించనున్నారు. అలాగే ప్రియాంక చోప్రా మరో కీలక పాత్రలో కనిపించనుంది. టైటిల్ పెట్టని ఈ చిత్రంలో నటీనటుల పూర్తి జాబితాను మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. ఈ సినిమా షూటింగ్‌లో ఎక్కువ భాగం విదేశాల్లోనే జరుగుతుందని, యాక్షన్‌తో కూడిన స్టైలిష్ ఫారెస్ట్ అడ్వెంచర్‌గా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.
ప్రస్తుతం హాలీవుడ్ హీరోలా తయారయ్యాడు మహేష్ బాబు. రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నాడు. లాంగ్ హెయిర్.. మీడియం గెడ్డంతో.. మహేష్ బాబు చాలా హ్యాండ్సమ్ గా తయారయ్యాడు ఈసినిమాతో మహేష్ పాన్ వరల్డ్ హీరోగా మారబోతున్నాడు.