టాలీవుడ్ లో కొంత కాలం పాటు పూజా హెగ్డే హవా సాగింది. ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు, రాంచరణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్లతో నటించింది. గ్లామర్ ప్రదర్శించడంలో పూజా హెగ్డేకి తిరుగులేదు. బికినీ సన్నివేశాల్లో కూడా నటించింది. అయితే సౌత్ లో పూజా హెగ్డేకి ప్రస్తుతం బ్యాడ్ టైం కొనసాగుతోంది. అరకొర అవకాశాలు మాత్రమే ఆమె చేతిలో ఉన్నాయి. ప్రస్తుతం పూజా హెగ్డే సౌత్ కంటే బాలీవుడ్ పై ఎక్కువ ఫోకస్ పెట్టింది.