Balakrishna: నా కెరీర్ లో పెద్ద రాడ్డు లాంటి సినిమా అదే, ఒప్పుకున్న బాలయ్య..ఇష్టమైన మూవీ కూడా ఫ్లాపే

Published : May 02, 2026, 07:45 AM IST

నందమూరి బాలకృష్ణ తన కెరీర్ లో దారుణమైన ఫ్లాప్ మూవీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కెరీర్ లో ఒక రాడ్డు లాంటి సినిమా ఉందని అన్నారు. అదే విధంగా ఇష్టమైన మూవీ పేరు కూడా చెప్పారు. ఆ చిత్రాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకోండి. 

PREV
15
నందమూరి బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ వందకు పైగా చిత్రాల్లో నటించారు. పౌరాణిక, జానపద సోషల్ డ్రామా ఇలా అన్ని జోనర్స్ లో బాలయ్య సినిమాలు ఉన్నాయి. కెరీర్ లో ఎన్నో రికార్డులు కూడా ఉన్నాయి. సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు లాంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాలు కూడా ఉన్నాయి. వీటితో పాటు దారుణమైన డిజాస్టర్ సినిమాలు కూడానా బాలయ్య చేశారు.

25
రాడ్డు రంబోలా లాంటి సినిమాలు

ఓ కార్యక్రమంలో బాలకృష్ణ నటించిన ఫ్లాప్ సినిమాల గురించి చర్చ జరిగింది. ఆ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత నాగవంశీ బాలయ్యని ఆసక్తికర ప్రశ్న అడిగారు. అదేంటంటే.. మీ కెరీర్ లో ఈ సినిమా ఎందుకు చేశానా అని అనిపించినవి ఏమైనా ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. బాలయ్య బదులిస్తూ 100కి పైగా సినిమాలు చేశాను. అందులో కొన్ని రాడ్డు రంబోలా లాంటి సినిమాలు తప్పకుండా ఉంటాయి.

35
కత్తుల కొండయ్య

అలాంటి రాడ్డు సినిమాల్లో ముందుగా చెప్పాలి అంటే కత్తుల కొండయ్య అనే మూవీ ఉంది. 1985లో విడుదలైన ఈ చిత్రం ఎస్బి చక్రవర్తి దర్శకత్వంలో రూపొందింది. అది పెద్ద రాడ్డు లాంటి సినిమా అని బాలయ్య అంగీకరించారు.

45
ఎంతో ఇష్టమైన మూవీ

నాకు ఎంతో ఇష్టమైన మూవీ కూడా ఒకటుంది. అదే యువరత్న రాణా మూవీ. ఆ సినిమాని ఎంతో ఇష్టపడి ఆ సినిమా చేశా. పెర్ఫార్మెన్స్ లో నేనంటే ఏంటో ఆ సినిమాలో చూపించా. కానీ అది వర్కౌట్ కాలేదు. ఆ సినిమా నిరాశ పరిచింది. కొన్ని మనకి నచ్చి చేసినప్పటికీ వర్కౌట్ కావు అని బాలయ్య అన్నారు.

55
బాలయ్య అభిమానులకు పెద్ద షాక్

బాలయ్య అభిమానులకు పెద్ద షాక్ అంటే మాత్రం ఒక్క మగాడు సినిమా అనే చెప్పాలి. వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ కనీ వినీ ఎరుగని అంచనాలతో విడుదలయింది. దారుణమైన ఫ్లాప్ గా నిలిచింది. బాలయ్య అభిమానుల నుంచే ఈ చిత్రానికి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి.

Read more Photos on
click me!

Recommended Stories