అజిత్‌ పై హీరోయిన్ క్రష్.. నువ్వు నా చెల్లివి అని షాకిచ్చిన హీరో, ఇంతకీ ఆమె ఎవరో తెలుసా?

Published : May 01, 2026, 09:14 PM IST

ఒకప్పటి పాపులర్ హీరోయిన్, అజిత్‌తో కలిసి నటిస్తున్నప్పుడు ఆయనపై క్రష్ ఉండేదని, కానీ అజిత్ చెప్పిన ఒక్క మాటతో ఆ ఫీలింగ్ మొత్తం పోయిందని రీసెంట్‌గా బయటపెట్టింది. ఇంతకీ ఎవరా హీరోయిన్? 

PREV
15
సౌత్ లో 100 కోట్ల హీరో..

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న అతి కొద్దిమంది  100 కోట్ల హీరోలలో అజిత్ ఒకరు. ఆయన సినిమాకు 120 కోట్ల వరకూ  రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం. 55 ఏళ్ల ఈ హీరో బర్త్ డే సందర్భంగా.. ఆయన నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ బిల్లా 2ను రీరిలీజ్ చేశారు. 

25
అజిత్ తో ప్రేమలో పడ్డ హీరోయిన్లు..

ఈమధ్య కాలంలో  అజిత్‌కు సంబంధించిన పాత విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కెరీర్ ప్రారంభంలో అజిత్ చాలా ప్రేమ వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయన్ను చాలా మంది హీరోయిన్లు ప్రేమించారు. అజిత్ ను  ప్రేమలో పడేయాలని ప్రయత్నించి విఫలమైనవారు ఎంతో మంది ఉన్నారు.  ఆ కోవలోనే, అజిత్‌పై తనకు క్రష్ ఉండేదని ఆయనతో నటించిన ఓ హీరోయిన్ ఓపెన్‌ కామెంట్స్ చేసింది. 

35
అజిత్ ను ప్రేమించిన మహేశ్వరి

అజిత్ ను ప్రేమించిన ఆ హీరోయిన్ మరెవరో కాదు, దివంగత నటి, లేడీ సూపర్ స్టార్ శ్రీదేవి చెల్లెలు మహేశ్వరి. తెలుగు, తమిళ భాషల్లో  ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది మహేశ్వరి. తెలుగులో గులాబి, పెళ్లి లాంటి సినిమాలతో సక్సెస్ అందుకుంది. ఇక తమిళంలో అజిత్ తో 'నేసం', 'ఉల్లాసం' సినిమాల్లో వరుసగా యాక్ట్ చేసింది. ఈ సినిమాల్లో నటిస్తున్నప్పుడే మహేశ్వరికి అజిత్‌పై క్రష్ ఏర్పడింది.

45
మహేశ్వరికి షాక్ ఇచ్చిన అజిత్..

'ఉల్లాసం' సినిమా చివరి రోజు షూటింగ్‌లో.. ఇకపై అజిత్‌ను చూడలేనేమోనని మహేశ్వరి బాధపడిందట. అప్పుడు అజితే స్వయంగా మహేశ్వరి దగ్గరకు వెళ్లి మాట్లాడారు. వెళ్లగానే మొదటి మాటే “నువ్వు నాకు చెల్లెలి లాంటి దానివి...” అని చెప్పారట. ఆ మాట వినగానే ఆయనపై ఉన్న క్రష్ మొత్తం పోయిందని మహేశ్వరి తన బాధను ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది.

55
అభిమానులు ఏమంటున్నారంటే?

మహేశ్వరి ఇంటర్వ్యూ చూసి, ఆమె కామెంట్స్ విన్న అభిమానులు అజిత్ ఒక జెంటిల్‌మ్యాన్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఆయన ఏ హీరోయిన్‌ను తప్పుడు దృష్టితో చూడరని పొగిడేస్తున్నారు. ప్రస్తుతం అజిత్ ఆధిక్ రవిచంద్రన్‌ డైరెక్షన్ లో చేయబోతున్నారు. సినిమాలు తగ్గించి కార్ రేసింగ్ లపై ఫోకస్ చేశాడు అజిత్. రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నాడు.

Read more Photos on
click me!

Recommended Stories