Naga Chaitanya: నాగ చైతన్యకి ఆస్తులు ఎలాగూ ఉన్నాయి, కానీ అలా చేస్తే నకిలీ అవుతాడు.. బాలకృష్ణ కామెంట్స్

Published : Jul 18, 2026, 04:35 PM IST

నాగ చైతన్య గురించి నందమూరి బాలకృష్ణ తొలిసారి చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. నాగ చైతన్య భవిష్యత్తు గురించి, అక్కినేని ఫ్యామిలీ గురించి బాలయ్య కామెంట్స్ చేశారు.

PREV
15
Naga Chaitanya

అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం వృషకర్మ అనే చిత్రంలో నటిస్తున్నాడు. విరూపాక్ష డైరెక్టర్ కార్తిక్ దండు దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. నాగ చైతన్య జోష్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్ర ఆడియో లాంచ్ సందర్భంగా బాలయ్య తొలిసారి నాగ చైతన్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

25
బాలయ్య సెటైర్లు

అక్కినేని నాగేశ్వర రావు గారు నాకు బాబాయ్. ఈ రోజు నేను నాగ చైతన్య బాబాయ్ గా అతడిని ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చాను. ఈ సందర్భంగా బాలయ్య నవ్వుతూనే నాగేశ్వర రావు, నాగార్జున ఇద్దరిపై సెటైర్లు వేశారు. నాగార్జున వాళ్ళ నాన్నగారిలాగే అనుకుంటా.. ఆ లక్షణాలు పునికిపుచ్చుకున్నాడు. నాగార్జున పక్కా కమర్షియల్ బిజినెస్ మ్యాన్.

35
అలా చేస్తే నకిలీ అవుతారు

నాగ చైతన్య తొలి చిత్రాన్ని తాను నిర్మించకుండా దిల్ రాజు లాంటి మంచి నిర్మాతకు ఇచ్చారు. వారసత్వం కొనసాగించడం మంచిదే. కానీ పూర్తిగా అనుకరించకూడదు. బాబాయ్ నాగేశ్వర రావు గారి సినిమాలు, నాగార్జున సినిమాలకు అసలు పోలిక ఉండదు. అందుకే మా నాన్న నందమూరి తారకరామారావు ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. అనుసరించేవారు వారసుడు అవుతాడు.. అనుకరించేవాడు నకిలీ అవుతాడు అని.

45
నాగ చైతన్యకి ఆస్తులు ఎలాగూ ఉన్నాయి

ఇప్పుడు కుర్రాళ్ళ మధ్య కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. ఆ కాంపిటీషన్ లో నాగ చైతన్య నెగ్గుకు రావాలి. భగవంతుడు నాగ చైతన్యకి ఆయురారోగ్యాలు అష్టఐశ్వర్యాలు ప్రసాదించాలి. అష్టఐశ్వర్యాలు ఎలాగూ ఉన్నాయనుకోండి. కెరీర్ లో నాగ చైతన్య ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ఉండాలి అని బాలకృష్ణ అన్నారు.

55
తొలి మూవీ ఫ్లాప్

నాగ చైతన్య నటించిన తొలి మూవీ జోష్ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. వాస్తవానికి ఈ చిత్రం రాంచరణ్ చేయాల్సింది. కానీ చిరంజీవి అంగీకరించలేదు. ఆ తర్వాత యూత్ ఫుల్ లవ్ స్టోరీలు చేస్తూ విజయం అందుకున్నాడు. ఇప్పుడు చైతూ వైవిధ్యమైన కథలని ఎంచుకుంటూ హీరోగా దూసుకుపోతున్నాడు.

Read more Photos on
click me!

Recommended Stories