బాలకృష్ణ కెమెరామెన్ గా చేసి.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మూవీ..?

బాలయ్య బాబు మల్టీ టాలెంటెడ్.. నటుడు, నిర్మాత,సింగర్, పొలిటికల్ లీడర్ మాత్రమే కాదు.. ఆయన కెమెరా డిపార్టెమెంట్ లో కూడా పనిచేశారని మీకు తెలుసా..? 

బాలయ్య బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నందమూరి నటవారసత్వాన్ని తీసుకుని.. ఎన్టీఆర్ తరువాత అంతటి స్టార్ ఇమేజ్ ను తన సొంతంగా సాధించుకున్న హీరో బాలకృష్ణ. ఆయనంటే పడిచచ్చిపోతారు ఫ్యాన్స్.  ఎన్టీఆర్ నట వారసుడిగా నందమూరి బిడ్డగా చిన్నవయస్సులోనే  బాల నటుడుగా సినిమాల్లోకి వచ్చాడు. ప్రస్తుతం మాస్ హీరోగా బాలకృష్ణ ఇమేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. 

బాలయ్య బాబు  ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయన కనుసైగ కోసం ఎదురుచూసే సైన్యం ఉందంటే..తెలుగు నాట బాలయ్య సత్తా అర్ధం అవుతుంది. బాలకృష్ణ బాలనటుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. తండ్రితో పాటే కొన్ని సినిమాలు చేశారు.


ఎన్టీఆర్ డైరెక్షన్ లో కూడా బాలయ్య సినిమాలు చేశారు. అంతే కాదు బాలకృష్ణను సోలో హీరోగా పరిచయం చేసింది కూడా పెద్దాయనే. వీరిద్దిరి కాంబోలో వచ్చిన అప్పటి సినిమాలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. 

సోలో హీరోగా కూడా నటించి.. మాస్ సినిమాలను తీస్తున్న బాలయ్య హీరోగా ఎంట్రీ ఇచ్చిందిమాత్రం ఓ హిస్టారికల్ మూవీలో.. అది ఒక బయోపిక్ మూవీ.. సీనియర్ ఎన్టీఆర్  దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన సినిమా పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర.  ఈ సినిమాలో ఎన్టీఆర్ బ్రంహ్మంగారి పాత్ర  పోషించగా అతని భక్తుడు అయిన సిద్ధప్ప పాత్రలో బాలకృష్ణ నటించాడు.  

సిద్దప్ప ను ఒక రకంగా ఈసినిమాలో కథానాయకుడిగా చూపించే ప్రయత్నం చేశారు  ఎన్టీఆర్. పెద్దాయన స్వయంగా దర్శకత్వం వహించారు. ఎన్నో ఇబ్బందులు మధ్య ఈ సినిమా విడుదలై  ప్రభంజనం  సృష్టించింది. సెన్సార్ బోర్డు వారి అభ్యంతరాల వల్ల పలుమార్లు విడుదల వాయిదా పడుతూ వచ్చింది.ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అవ్వగానే..  విడుదలై బారీ బ్లాక్ బస్టర్ గా నలిచింది. అప్పట్లో బండ్లు కట్టుకుని మరీ దూర ప్రాంతాలకు వెళ్లి జనాలు ఈసినిమాను చూశారు. 

నలబై ఏళ్ల కిందటే ఈసినిమా  నాలుగు కోట్లు కలెక్ట్ చేసిందంటే.. ఇప్పుడు బ్లాక్ బస్టర్ సినిమాలకంటే కూడా అవి ఎక్కువనే చెప్పాలి.  ఇక ప్రస్తుతం హీరోగా, నిర్మాతగా, సింగర్ గా, మల్టీ టాలెంట్ చూపిస్తున్న బాలయ్య బాబు.. వీటన్నిటికంటే ముందు ఈసినిమాకు కెమెరా డిపార్ట్ మెంట్ లో పనిచేశారట. ఎన్టీఆర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తూ తన కొడుకు బాలకృష్ణ కు కెమెరా వర్క్ కూడా నేర్పించారట. బాలయ్య ఈ సినిమా అయిపోయేవరకూ..  అందులో మెలకువలు కూడా నేర్చుకున్నారట. 

సినిమా తీసే విధానం నేర్చుకున్న బాలయ్య.. ఈసినిమాలో కొన్ని షాట్స్ స్వయంగా బాలకృష్ణ కెమెరామెన్ గా పని చేసి తీసారట. అలా బాలకృష్ణ కెరీర్ లో కెమెరా మెన్ గా పనిచేసిన ఏకైక సినిమాగా పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర నిలిచిపోయింది. కాని  ఈసినిమా తరువాత అది కంటీన్యూ చేయలేకపోయారు. లేకుంటే.. దర్శకుడిగానో.. సినిమాటోగ్రఫర్ గా కూడా బాలకృస్ణ చరిత్ర సృష్టించేవారు.  
 

Latest Videos

click me!