నాకింకా 30 ఏళ్లే.. రెండో పెళ్లిపై నిహారిక క్లారిటీ...?

First Published | Jan 27, 2024, 10:57 AM IST

తన విడాకుల పై ఫస్ట్ టైమ్ స్పందించింది మెగా డాటర్ నిహారిక కొణిదెల. అంతే కాదు రెండో పెళ్ళి చేసుకుంటారా..? అని అడిగిన ప్రశ్నకు షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది మెగా బ్యూటీ. 
 

నిహారిక కొణిదెల... మెగా డాటర్ ఇమేజ్ తో పాటు.. ఇండస్ట్రీలో తనకంటూ సొంత ఇమేజ్ ను కూడా బిల్డ్ చేసుకుంది. హోస్ట్ గా, హీరోయిన్ గా, ప్రొడ్యూసర్ గా.. ఇలా రకరకాల క్యారెక్టర్స్ ను ఆమె టాలీవుడ్ లో పోషించింది. ఇక జొన్నలగడ్డ చైతన్యతో పెళ్ళి తరువాత ఇండస్ట్రీకి దూరం అయిన నిహారిక... విడాకులు తరువాత మళ్లీ టాలీవుడ్ లో యాక్టీవ్ అయ్యింది. 

సినిమా కెరీర్ అంతగా సక్సెస్ అవ్వలేదు.. అటు మ్యారేజ్ లైఫ్ కూడా ఫెయిల్ అవ్వడంతో.. నిహారికి చాలా కాలం డిస్సపాయింట్ లో ఉండిపోయింది. ఆతరువాత టాలీవుడ్ లో యాక్టీవ్ అవుతోంది బ్యూటీ.. అయితే ఇప్పటి వరకూ తన మ్యారేజ్ లైఫ్ గురించి కాని.. విడాకులు గురించి కాని స్పందించని మెగా డాటలర్.. ఈమధ్య తన స్నేహితుడు  కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యింది. 


తన పెళ్లి విడాకుల పై మాట్లాడిన నిహారిక.. విడాకుల తో పాటు..మళ్లీ పెళ్లి చేసుకోవడంపై కూడా  స్పందించారు. జీవితంలో నెక్ట్స్‌ ఏంటని హోస్ట్‌ ప్రశ్నించగా.. చాలా హుషారుగా బదులిచ్చారు నిహారిక.  హోప్‌ ఫుల్లీ, నాకింకా 30 ఏళ్లు మాత్రమే అన్నారు. అంటే అర్ధం.. రెండో పెళ్లి చేసుకోవడానికి తనకేమి అభ్యంతరం లేదనే కదా..?  మళ్ళీ పెళ్లి చేసుకోకూడదు అని తానేమి బలంగా ఫిక్స్‌ అవ్వలేదనే విషయాన్ని నిహారికా స్పష్టం చేశారు. 

Niharika Konidela

అంతే కాదు ఈ విషయాన్ని డైరెక్ట్ గా చెప్పకున్నా.. మళ్లీ పెళ్లి చేసుకోవడానికి తాను రెడీగానే ఉన్నట్టు హింట్ ఇచ్చారు. ఈక్రమంలో ఫన్నీగా సెటైర్లు కూడా వేశారు నిహారిక.  తన హృదయాన్నేమి ముసివేయలేదని చెప్పి నవ్వులు పూయించారు. అలాగని.. పెళ్లి కోసం తాను పరుగులు పెట్టడం లేదని, ఎవర్ని చేసుకోవాలని ఎవర్ని చేసుకోవాలంటూ తాను పెళ్లి వెంట పడననని అన్నారు. 
 

Niharika Konidela

అంతే కాదు భవిష్యత్తులో తాను తప్పకుండా  మళ్లీ పెళ్లి చేసుకుంటానని కూడా ఆమె క్లారిటీ ఇచ్చారు. కాని ఈసారి ఆమె పెళ్ళి గురించి పక్కాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని తన సమాధానాలను బట్టి తెలుస్తోంది. చాలా మంది పెళ్లీ విడాకులు తరువాత మళ్లీ అటువైపు చూడకూడదు అనుకుంటారు.. మళ్ళీ పెళ్ళి జోలికి వెళ్ళకూడదు అనుకునేవారు ఎక్కువ. కాని నిహారిక మాత్రం చాలా  హుందాగా, మెచ్యూర్‌గా సమాధానం ఇవ్వడంపై నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. 
 

Niharika Konidela

ఇక తన విడాకులు గురించి కూడా సంచలన విషయాలు వెల్లడించింది నిహారిక. జీవితంలో పెళ్లి, విడాకులు అనేవి చిన్న విషయాలు కావు..  విడాకుల టైమ్ లో తాను చాలా  కఠిన పరిస్థితి ఎదుర్కొన్నాన్నారు.  అలాంటి టఫ్‌ కండీషన్‌లో సోషల్ మీడియాలో తనపై ట్రోలింగ్, తన గురించి రకరకాల వార్తలు ప్రచారం చేయడంతో చాలా కృంగిపోయాను అన్నారు. అప్పుడు తన  కుటుంబం విలువేంటో తెలిసొచ్చిందని కూడా నిహారిక పేర్కొన్నారు. 
 

అంత కఠిన పరిస్థితిని ఫేస్ చేస్తున్న తనకు తన కుటుంబం అండగా నిలబడిందన్నారు. తన తండ్రి చేసిన సపోర్ట్ తనకు బలాన్ని ఇచ్చిందన్నారు నిహారిక.ఒక తండ్రి తన కూతురి కోసం ఎంత దూరమైనా వెళ్తాడు, ఏమైనా చేస్తాడనే దానికి తన తండ్రి నిదర్శనం అని అన్నారు నిహారిక. ఇక నిహారిక ఇంటర్వ్యూ కు.. చైతన్య కౌంటర్ పోస్ట్ కూడా ప్రస్తుతం వైరల్ అవుతోంది. 

Latest Videos

click me!