నాన్న ఎన్ని బాధలు పడ్డారో నాకు తెలుసు... ఆరెంజ్ మూవీ నష్టాలు-కష్టాలు బయటపెట్టిన నిహారిక 

Published : Jan 27, 2024, 11:43 AM IST

నిహారిక లేటెస్ట్ ఇంటర్వ్యూలు వైరల్ అవుతుంది. ఆమె పలు వ్యక్తిగత విషయాల మీద స్పందించారు. ఆరెంజ్ చిత్ర నిర్మాతగా నాగబాబు సర్వం కోల్పోగా అప్పటి బాధల మీద ఓపెన్ అయ్యింది.   

PREV
16
నాన్న ఎన్ని బాధలు పడ్డారో నాకు తెలుసు... ఆరెంజ్ మూవీ నష్టాలు-కష్టాలు బయటపెట్టిన నిహారిక 
Niharika Konidela

2010లో రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ ఆరెంజ్ మూవీ తెరకెక్కించాడు. మగధీర చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టిన రామ్ చరణ్ నుండి వస్తున్న మూవీ కావడంతో విపరీతమైన హైప్ ఏర్పడింది. హారీష్ జయరాజ్ సాంగ్స్ యువతను ఊపేశాయి. 

26
Niharika Konidela

ఆరెంజ్ మూవీతో  రామ్ చరణ్ మరో బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం అన్నమాట వినిపించింది. ఈ చిత్రానికి నాగబాబు నిర్మాత. సినిమా మొత్తం దాదాపు ఆస్ట్రేలియాలో తెరకెక్కించారు. జెనీలియా హీరోయిన్ గా నటించింది. బడ్జెట్ పరిమితులు దాటిపోయాయి. 

 

36

తీరా మూవీ విడుదలయ్యాక డిజాస్టర్ టాక్. భారీ బడ్జెట్ మూవీ కావడంతో నిర్మాత నాగబాబు పెద్ద మొత్తంలో నష్టపోయాడు. ఉన్నవన్నీ అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆర్థిక బాధలు తాళలేక నాగబాబు ఆత్మహత్యా యత్నం చేశారనే టాక్ వినిపించింది. కాగా అప్పటి ఆర్థిక కష్టాలపై నిహారిక తాజాగా స్పందించారు. 

46
Niharika Konidela

ఆరెంజ్ మూవీ నాటికి నేను పదో తరగతి చదువుతున్నాను. నాన్న ఆర్థికంగా బాగా నష్టపోయారు. అయితే ఆ ఇబ్బంది పిల్లల వరకు రానీయలేదు. నాకు పూర్తిగా అవగాహన లేదు. ఏదో జరుగుతుందని మాత్రం తెలుసు. నాన్న ఎన్నో బాధలు పడ్డారో, కష్టాలు చూశారో తెలుసు. అయితే ఇప్పటికీ దాని గురించి అడగలేదు. ఆయన కూడా చెప్పలేదు. 

56

ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడే కదా మన లైఫ్ ఏమిటో మనకు తెలిసేది. అప్పుడు నాకు స్కూల్, హోమ్ వర్క్ ఇదే ప్రపంచం. ఈ వరల్డ్ నుండి నాన్న బయటకు రాకుండా చూశారు. అన్నయ్య మాత్రం నాన్నకు సపోర్ట్ గా నిలిచాడు. గోడకు కొట్టిన బంతిలా నాన్న తిరిగి వచ్చాడు. మరలా ఆర్థికంగా పుంజుకున్నాడు. డబ్బు ఎంత విలువైందో, ఎలా కూడా బెట్టాలో నేర్చుకున్నారు... అని నిహారిక చెప్పుకొచ్చింది. 

 

66
Niharika Konidela

నిర్మాతగా నష్టపోయిన నాగబాబుకు జబర్దస్త్ షో లైఫ్ ఇచ్చింది. ఆ షో జడ్జిగా నాగబాబు సక్సెస్ కావడంతో రెమ్యూనరేషన్ రూపంలో లక్షలు రాబట్టాడు. మెల్లగా అప్పులు తీర్చుకుని నిలదొక్కుకున్నాడు. ఈ లోపు వరుణ్ తేజ్ హీరోగా ఎదగడంతో నాగబాబు ఫ్యామిలీ ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడింది. 

click me!

Recommended Stories