నందమూరి బాలకృష్ణ ఒకే టైటిల్ తో రెండు సినిమా చేశారు. అదేంటంటే కథానాయకుడు చిత్రం. కథానాయకుడు 1984లో విడుదలై సూపర్ హిట్ అయింది. అదే టైటిల్ తో మరో చిత్రం కూడా చేశారు. కాకపోతే అది 'ఎన్టీఆర్ కథానాయకుడు' చిత్రం. ఎన్టీఆర్ బయోపిక్ మూవీ గా తెరకెక్కిన ఆ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ రెండు చిత్రాల్లో ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఎన్టీఆర్ ప్రమేయం ఉండడం యాదృచ్చికం.