హీరోయిన్ పై లైంగిక వేధింపులపై నానా పటేకర్ షాకింగ్ కామెంట్స్

First Published Jun 24, 2024, 8:24 AM IST

 అతను నటీమణులను కొడతాడు.. లైంగికంగా వేధిస్తాడు. ఈ విషయాల గురించి ఇండస్ట్రీలో అందరికి తెలుసు


2018లో ‘మీటూ’ ఉద్యమాన్ని భారత్‌లో మొదలు పెట్టిన నటి  తనుశ్రీ దత్తా . పదేళ్ల క్రితం ఓ సినిమా సెట్‌లో ప్రముఖ నటుడు నానా పటేకర్‌ తనను లైంగికంగా వేధించాడని ఆమె చెప్పడం అప్పట్లో సంచలనం సృష్టించింది. దీని తర్వాత చాలా మంది నటీనటులు చిత్ర పరిశ్రమలో తమకు వేధింపులు ఎదురయ్యాయని ప్రముఖుల పేర్లు బయటపెట్టారు. అప్పట్లో తనుశ్రీ ఆరోపణల నేపథ్యంలో నానా పటేకర్‌ ‘హౌస్‌ఫుల్‌ 4’తోపాటు మరికొన్ని ప్రాజెక్టుల నుంచి తప్పుకున్నారు. ముంబయి పోలీసులు 2019 జూన్‌లో పటేకర్‌పై కేసు నమోదు చేశారు. తాజాగా నానా పటేకర్ ఈ వేధింపుల విషయమై మీడియాతో మాట్లాడారు. 
 


హిందీ, మరాఠీ, అస్సామీ, నేపాలీ, తమిళ చిత్రాల్లో నటించడమే కాక జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్న ప్రముఖ నటుడు నానా పటేకర్‌ తనను లైంగికంగా వేధించాడని తనుశ్రీ దత్తా ఆరోపించారు. 2009లో ‘హార్న్‌ ఒకే ప్లీజ్‌’ సినిమా షూటింగ్ సమయంలో నానా పటేకర్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె పేర్కొన్నారు.


ఈ విషయం గురించి తనుశ్రీ దత్తా మాట్లాడుతూ ‘నానా పటేకర్‌ గొప్ప నటుడు కావొచ్చు. కానీ అతడు ఆడవారి పట్ల చాలా అమర్యాదగా ప్రవర్తిస్తాడు. అతను నటీమణులను కొడతాడు.. లైంగికంగా వేధిస్తాడు. ఈ విషయాల గురించి ఇండస్ట్రీలో అందరికి తెలుసు. కానీ ఎవ్వరూ మాట్లాడరు. కనీసం అతన్ని తమ సినిమాల్లోకి తీసుకోకుండా బ్యాన్‌ కూడా చేయరు’ అంటూ వాపోయారు. ఈ సందర్భంగా ఆమె అక్షయ్‌ కుమార్‌, రజనీకాంత్‌ల పేర్లు ప్రస్తావించారు. 
 


‘అక్షయ్‌ కుమార్‌ గత ఎనిమిదేళ్లుగా నానా పటేకర్‌తో కొన్ని సినిమాల్లో నటించారు. సుపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కూడా ఈ మధ్యే అతనితో ‘కాలా’ సినిమాలో నటించారు. పెద్ద పెద్ద స్టార్‌ హీరోలందరూ ఇలాంటి నేరస్తులతో కలిసి పని చేస్తున్నప్పుడు ఎన్ని మీటూ ఉద్యమాలు వచ్చిన ఫలితం ఉండద’ని బాధపడ్డారు.
 


అలాగే ‘జనాలందరూ ఈ విషయాల గురించి గుసగుసలాడతారు. కానీ ఒక్కరు కూడా ధైర్యంగా ప్రశ్నించరు. ఇంకా దారుణం ఏంటంటే తప్పు చేసిన వ్యక్తిని వదిలేసి మా గురించి చెడుగా మాట్లడతారు. ‘ఆమె స్క్రీన్‌ మీద ఎంత స్కిన్‌ షో చేస్తుంది. బయట కూడా అలానే ఉంటుంది కాబట్టే ఇలా జరిగింది’ అంటారు. కానీ ఒక్కరు కూడా మేం కేవలం మా జీవనోపాధి కోసం మాత్రమే ఇలా చేస్తున్నామని ఆలోచించరు. మాలో చాలా మంది తమ సంపాదనలోంచి కొంత భాగాన్ని పేదలకు, రైతులకు ఇస్తారనే విషయం మీకు తెలియదు. వీటన్నింటి గురించి వదిలేసి కేవలం స్కిన్‌ షో గురించి మాత్రమే మాట్లడతారు’ అన్నారు.


 పటేకర్‌కు వ్యతిరేకంగా పోరాడే సమయం తనకు లేదని తనుశ్రీ ఇంటర్వ్యూలో అన్నారు. ఆయన తిరిగి బాలీవుడ్‌లో రాణించడం గురించి మాట్లాడుతూ.. ‘పటేకర్‌ నన్ను వేధించి, అవమానించి, బాధించి, బెదిరించడంతోపాటు మా కుటుంబ సభ్యులపై రౌడీలతో దాడి చేయించాడు. నా సినీ కెరీర్‌ను నాశనం చేశాడు. ఇన్ని దారుణాలకు పాల్పడిన ఆయనకు బాలీవుడ్‌ నిర్మాతలు మద్దతుగా నిలిచారు. కమ్‌బ్యాక్‌కు ఘనంగా వెల్‌కమ్‌ చెప్పారు. నా తప్పు లేకపోయినా నన్ను బాలీవుడ్‌కు దూరం చేశారు. ఇప్పుడు ప్రజలు ‘సుశాంత్‌కు న్యాయం జరగాలి?’ అని అడుగుతున్నారు. మరి నాకు న్యాయం జరిగిందా?’.
 

‘ఈ వ్యవస్థతో పోరాడి నేను విసిగిపోయాను. ఇది చెడ్డ వ్యక్తులను రక్షించడమే కాకుండా.. వారికి మద్దతునిస్తూ, తిరిగి అవకాశాలు ఇస్తోంది. నేను మాత్రం జీవితంలో విరామం లేకుండా పోరాడుతూనే ఉన్నా. ఇప్పుడు నాకు పోరాడే సమయం లేదు.  అందుకే ఐటీ ఉద్యోగం కోసం శిక్షణ తీసుకుంటున్నా. ఉదయం 9కి మొదలై.. సాయంత్రం 5కు పూర్తయ్యే ఐటీ ఉద్యోగం చేయబోతున్నా’ అని చెప్పారు.

Tanushree Dutta


ఈ విషయమై నానా పటేకర్ తాజాగా మీడియాతో మాట్లాడారు...ఆరోపిస్తున్న విషయాలు లాంటివేమీ జరగలేదని ఆమెకు తెలుసు.  తనుశ్రీ ఆరోపణలపై నేను షాక్ అయ్యాను, ఇలా ఎందుకు మాట్లాడుతోందో అనుకున్నాను అన్నారు. ఇటీవల జరిగిన ఓ మీడియా ఇంటరాక్షన్‌లో.. తనుశ్రీ దత్తా లైంగిక వేధింపుల ఆరోపణలపై కోపంగా ఉన్నారా అని అడిగిన ప్రశ్నకు నానా పటేకర్‌  అలా సమాధానం ఇచ్చాడు. నటుడు.." నహిన్, ముఝే మాలూమ్ థా జబ్ ఐసా కుచ్ హై హాయ్ నహిన్ (కాదు, ఏది చెప్పినా జరగదని నాకు తెలుసు)" అని బదులిచ్చారు. 

Tanushree Dutta


అలాగే "ముఝే నహిన్ గుస్సా ఆయా (నాకు కోపం రాలేదు). నేను దానితో బాధపడటం లేదు. కుచ్ హువా హి నహీ థా (ఏమీ జరగలేదు), అది దేనికి సంబంధించినదో నాకు తెలియదు. అక్టోబర్ 2018లో, హార్న్ ఓకే ప్లీస్ కోసం ప్రత్యేక పాట షూటింగ్ సమయంలో అనుచితంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ నానా పటేకర్‌పై తనుశ్రీ దత్తా ఫిర్యాదు చేసింది. అయితే, 2008లో ఆ రోజు సెట్స్‌లో దాదాపు 50 మంది ఉన్నారని పేర్కొన్న పటేకర్ అలాంటి సంఘటనను ఖండించారు.  
 


ఇక  2019లో, తనుశ్రీ దత్తా వాదనలకు మద్దతు ఇచ్చే సాక్ష్యాలను దొరకటంలో  విఫలమైన తర్వాత ముంబై పోలీసులు నానా పటేకర్‌కు క్లీన్ చిట్ ఇచ్చారు . ఇంటర్వ్యూలో, 'వెల్‌కమ్' నటుడు కూడా చిత్ర పరిశ్రమ సమస్యల గురించి మాట్లాడటానికి ఇష్టపడలేదు, "నేను ఈ పరిశ్రమకు చెందినవాడిని కాదు. నేను అక్కడ పని చేసి ఇంటికి తిరిగి వచ్చే ఒక ప్రొఫెషనల్‌ని. పరిశ్రమ విషయాలపై నాకు ఆసక్తి లేదు. అక్కడ ఏమి జరుగుతుందో" తనకు తెలియదని నానా పటేకర్‌ చెప్పారు.


ఈ క్రమంలో  తనుశ్రీ చేసిన వేధింపుల ఆరోపణల్ని పటేకర్‌ ఖండించారు. తనకు హాని కలిగించాలని, ప్రతీకారం తీర్చుకోవాలని ఆమె ప్రయత్నిస్తోందని చెప్పారు. ఆ తర్వాత సంవత్సరానికి పటేకర్‌ మళ్లీ సినిమాల్లో నటించడం ప్రారంభించారు. తను ఎంతగా పోరాడినా న్యాయం జరగలేదని తనుశ్రీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
 


అలాగే ‘‘కొంతమంది వ్యక్తులు నన్ను టార్గెట్‌ చేసి విపరీతంగా వేధిస్తున్నారు. దయచేసి ఎవరైనా, ఏదో ఒకటి చేసి నాకు సాయం చేయండి..!! గతంలో ఏడాది పాటు నా సినిమాలు ఆడకుండా చేశారు. మా పనిమనిషితో కుమ్మక్కై తాగే నీటిలో స్టెరాయిడ్స్‌, కొన్నిరకాల మందులు కలిపి నాకు అందించేలా చేశారు. దానివల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నా. ఇవన్నీ తట్టుకోలేక మే నెలలో ఉజ్జయిని పారిపోయా. 


అక్కడ నా బైక్‌ బ్రేకులు తీసేసి రెండుసార్లు ప్రమాదాలకు గురి చేశారు. ధైర్యంతో చావు నుంచి బయటపడి మళ్లీ సాధారణ జీవితం కోసం 40 రోజుల తర్వాత తిరిగి ముంబయికి వచ్చా. ఇవన్నీ చూసి భయంతో ఆత్మహత్య చేసుకోను. ఎక్కడికి పారిపోను. నా కెరీర్‌ని తిరిగి నిర్మించుకునేందుకు ఇక్కడే ఉండి కష్టపడతా. బాలీవుడ్‌ మాఫియా ఇదంతా చేస్తోంది. మీటూ వేదికగా నేను ఎవరిపైనైతే ఆరోపణలు చేశానో, అప్పట్లో నేను ఏ ఎన్‌జీవోని అయితే నిందించానో వారే ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్నారని నాకు తెలుసు. ఎందుకంటే నన్ను టార్గెట్‌ చేయడం వల్ల వేరేవాళ్లకి ఏం లాభం?’’ అని తనుశ్రీ దత్తా రాసుకొచ్చారు.


2005లో విడుదలైన ‘ఆషిక్ బనాయా ఆప్నే’ సినిమాతో తనుశ్రీ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. దీంతో ఆమె హిందీతోపాటు దక్షిణాదిలోనూ పలు సినిమాల కోసం వర్క్‌ చేశారు. బాలయ్య నటించిన ‘వీరభద్ర’తో ఆమె తెలుగు తెరపై సందడి చేశారు. నటిగా రాణిస్తోన్న సమయంలోనే నటుడు నానా పటేకర్‌ తనని వేధించారంటూ ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. మీటూ ఉద్యమం సమయంలోనూ సోషల్‌మీడియా వేదికగా ఆయనపై తనుశ్రీ విరుచుకుపడ్డారు.
 

Latest Videos

click me!