డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ హీరోయిజాన్ని ప్రత్యేకంగా చూపించడంలో స్పెషలిస్టు. ఆయన చిత్రాల్లో హీరో పాత్రలు వైవిధ్యంగా ఉంటాయి. పూరి జగన్నాధ్ తన హీరోలకు రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల్లో లాగా భారీ డైలాగులు, బిల్డప్ లు ఇవ్వరు. హీరో పాత్రకి కాస్త ఆకతాయి తనం, పొగరు జోడించి దానినే హైలైట్ చేసి చూపిస్తారు.