మహేష్‌తో నాది లవ్‌ ఎట్‌ ఫస్ట్ సైట్‌ కాదు.. అసలు రహస్యం బయటపెట్టిన నమ్రత.. ఆ టైమ్‌లో ప్రపంచంతో మాకు పనిలేదు..

Published : Jun 30, 2024, 08:17 PM IST

మహేష్‌ బాబుతో ప్రేమ వివాహానికి సంబంధించిన ఓ రహస్యం బయటపెట్టింది నమ్రత. తమ ప్రేమకి సంబంధించి బయట జరుగుతున్న ప్రచారానికి ఫుల్‌ స్టాప్‌ పెట్టింది.   

PREV
16
మహేష్‌తో నాది లవ్‌ ఎట్‌ ఫస్ట్ సైట్‌ కాదు.. అసలు రహస్యం బయటపెట్టిన నమ్రత.. ఆ టైమ్‌లో ప్రపంచంతో మాకు పనిలేదు..

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు, నమ్రత ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. `వంశీ` సినిమా సమయంలో ఈ ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడి, అది ప్రేమగా మారి, చివరికి పెళ్లి వరకు వెళ్లింది. వీరి ప్రేమకి గుర్తుగా గౌతమ్‌, సితార జన్మించారు. ఈ ఇద్దరు జెమ్స్ లాంటి పిల్లలు కావడం విశేషం.  
 

26

ఇదిలా ఉంటే మహేష్‌ బాబుకి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది నమ్రత. తమ ప్రేమకి సంబంధించిన రహస్యాలను బయటపెట్టింది. మహేష్‌తో తన ప్రేమ లవ్‌ ఎట్‌ ఫస్ట్ సైట్‌ కాదని చెప్పి షాకిచ్చింది నమ్రత. తామిద్దరం ముందు ఫ్రెండ్స్ అయ్యామని చెప్పింది. `వంశీ` సినిమాలో తామిద్దరం కలిశామని, తమ మధ్య స్నేహం ఏర్పడిందని, ఆ తర్వాత ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నామని తెలిపింది. 
 

36
Tollywood Heroes

మహేష్‌ ఏంటో తనకు పూర్తిగా తెలుసు అని, ఆయన మనస్థత్వం ఎలా ఉంటుందో తాను తెలుసుకున్నాను, నేనేంటో ఆయన తెలుసుకున్నాడు. ఒకరి గురించి ఒకరికి కంప్లీట్‌గా తెలిసిన తర్వాత ప్రేమించుకున్నామని, కొన్నాళ్లు ప్రేమలో ట్రావెల్‌ చేసిన తర్వాత పెళ్లికి సిద్ధమైనట్టు తెలిపింది నమ్రత. మ్యారేజ్‌ నిర్ణయం వెంటనే జరిగింది కాదని చెప్పింది. 
 

46

మహేష్‌ పై ప్రేమని వ్యక్తం చేస్తూ, తనతో మహేష్‌ ఉంటే ఇక ఈ ప్రపంచంతోనే పనిలేదని, తామిద్దరం ఉన్నప్పుడు మూడో వ్యక్తి అవసరం కూడా ఉండదని చెప్పింది. ఇద్దరం అలా ఏకాంతంగా ఉండిపోతామని, ఎన్ని రోజులైనా అలానే ఉంటామని, మాకు ఈ లోకంతో అవసరం ఉండదని చెప్పింది. అంతటి ప్రేమ తాము ఫీలవుతామని వెల్లడించింది. మహేష్‌ కూడా అదే కోరుకుంటాడని వెల్లడించింది. అందుకే ఆయన షూటింగ్‌లు, లేదంటే ఫ్యామిలీతో ఉంటాడని చెప్పింది నమ్రత. సాక్షితో కొన్నేళ్ల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలో నమ్రత ఈ విషయాలను వెల్లడించింది. 

56

`వంశీ` సినిమా సమయంలో ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న నమ్రత, మహేష్‌లకు మొదట సూపర్‌ స్టార్‌ కృష్ణ నో చెప్పారని, ఆయనకు ఈ పెళ్లి ఇష్టం లేదనే టాక్‌ వచ్చింది. ఇదంతా మహేష్‌ అక్క మంజుల సెట్‌ చేసిందని, కృష్ణతో రాయబారం నడిపించి సెట్‌ చేసిందని తెలుస్తుంది. కృష్ణ సైతం ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. మహేష్‌ తో పెళ్లి తర్వాత నమ్రత సినిమాలకు దూరమైంది. ఆమె పూర్తిగా ఫ్యామిలీ లైఫ్‌కే పరిమితమయ్యింది. కానీ ఇంటి వ్యవహారాలు, బిజినెస్‌లు, మహేష్‌ కాల్షీట్లు, పారితోషికం, యాడ్స్ ఇలా అన్నీ తానై చూసుకుంటూ బ్యాక్‌ బోన్‌లా ఉంది నమ్రత.  
 

66

మహేష్‌ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో దీన్ని తెరకెక్కించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు జక్కన్న. ఇంటర్నేషనల్‌ ఫిల్మ్ గా దీన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. కథ పరంగానూ దీన్ని యూనివర్సల్‌గా మార్చేశాడు. ఆఫ్రికన్‌ అడవుల నేపథ్యంలో ఓ సాహసికుడి కథగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. త్వరలోనే దీన్ని సెట్స్ పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories