బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ సక్సెస్. దీంతో మేకర్స్ నెక్స్ట్ సీజన్ కి సన్నాహాలు చేస్తున్నారు. బిగ్ బాస్ తెలుగు 8 ఆగస్టులో లాంచ్ కానుందని విశ్వసనీయ సమాచారం. ఈ క్రమంలో కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ మొదలైంది. ఎప్పటిలానే బుల్లితెర, వెండితెర సెలెబ్స్ తో పాటు సోషల్ మీడియా స్టార్స్ కంటెస్టెంట్స్ గా ఉంటారని సమాచారం.