ఉస్తాద్ భగత్ సింగ్: హరీష్ శంకర్ కి పవన్ సైడ్ నుంచి డిమాండ్ ఇదే

First Published | Nov 1, 2024, 6:15 PM IST

హరీష్ శంకర్ 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా స్క్రిప్ట్‌లో మార్పులు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు తగ్గట్టుగా, ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో కీలక మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. 'మిస్టర్ బచ్చన్' ఫ్లాప్ తర్వాత హరీష్ శంకర్ ఈ సినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్నారు.

#UstaadBhagatSingh, #PawanKalyan, #HarishShankar

ప్రస్తుతం హరీష్ శంకర్ ఇప్పుడు తన ఫోకస్ మొత్తం  ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీపైకి షిఫ్ట్ చేసినట్లుగా వార్తలు తెలుస్తోంది. కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ తప్పిస్తే  ‘ఉస్తాద్ భగత్ సింగ్’షూటింగ్ జరిగింది లేదు. మేజర్ పోర్షన్ షూటింగ్ పెండింగ్ ఉంది.

దాంతో ఇప్పుడు ఆయన స్క్రిప్టులో మార్పులు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ రెండు కీలకమైన మీటింగ్స్ జరిగాయని సమచారం. దాంతో ఇప్పుడు  స్క్రిప్టుపై రీవర్క్ చేస్తున్నాయి. 


మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు కొన్ని కీలకమైన మార్పులు సెకండాఫ్ లో చేయబోతన్నారని వినికిడి. గత పది రోజులుగా తన టీమ్ తో హరీష్ కూర్చుంటున్నారట.  ఈ  నెలాఖరకు పూర్తి బౌండ్ స్క్రిప్టుతో డైలాగ్ వెర్షన్ ని  పవన్ ని కలవబోతున్నారట. తను చేసిన మార్పులు చెప్పబోతున్నారట.  గతంలో ఉన్న కొన్ని పొలిటికల్ డైలాగులు సైతం తీసేసి, ఇప్పుడు వేరేవి రెడీ చేస్తున్నారట. 
 


పవన్  ఇప్పుడు ఓ రాష్ట్రానికి డిప్యూటి సీఎం . ఇమేజ్ పూర్తిగా మారింది. తన మీద తీసే సన్నివేశాలు డైరక్ట్ గానో , ఇండైరక్ట్ గానో ప్రభుత్వానికి గుచ్చుకునేలా ఉండకూడదు. ఆ విషయంలో తను చేస్తున్న సినిమాల  స్క్రిప్టుల్లో మార్పులు చేయాలని భావిస్తున్నారు.

ఆ క్రమంలోనే హరీష్ ని మార్పులు చేయమని చెప్పారట. హరీష్ సైతం థేరీ రీమేక్ కాబట్టి ...ఆ ఛాయిలు లేకుండా కొత్త స్క్రిప్టులా చేయాలని భావిస్తున్నారు. అలాగని మిస్టర్ బచ్చన్ లా స్క్రిప్టు విషయంలో దెబ్బ తినకూడదనుకుంటున్నారట. 
  

  
దర్శకుడు హరీష్ శంకర్ రీసెంట్‌ చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ఫ్లాఫ్ అవటం అతన్ని ఇబ్బందుల్లోనే పడేసింది. రీమేక్ స్క్రిప్టు విషయంలో అతను జడ్జిమెంట్ కు తిరుగులేదు అనుకుని నమ్మిన వాళ్లు సైతం మరొక్కసారి స్క్రిప్టుని చూద్దాం అంటున్నారు.

ఓ రకంగా హరీష్ శంకర్  ఇమేజ్ ని మిస్టర్ బచ్చన్ ఇబ్బంది పెట్టిందనే చెప్పాలి. ఈ సినిమాతో ఏ తరహా అంశాలు ప్రేక్షకులు కోరుకుంటున్నారనే విషయంలో హరీష్ తడబడ్డారని అంతటా వినిపించింది. మారిన ప్రేక్షకుడుకి కావాల్సిన ఎలిమెంట్స్ అందించలేకపోయారనే కామెంట్స్ వినిపించాయి. 
 


హరీష్ మార్క్ పంచ్ లు కానీ ఫన్ సీన్స్ కానీ  సినిమాలో వర్కవుట్ కాలేదు.  రీమేక్ లు చేయటంలో హరీష్ శంకర్ స్పెషల్ అనే ముద్ర ఈ చిత్రం తుడిచిపెట్టేసింది. దాంతో ఇప్పుడు ఆయన నెక్ట్స్ చిత్రం ఖచ్చితంగా పెద్ద హిట్ కొట్టాల్సిన అవసరం ఏర్పడింది.

ఆ సినిమా పవన్ కళ్యాణ్ తో చేస్తున్న  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో పవన్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.    


పవన్ కళ్యాణ్ పొలిటికల్ కమిట్మెంట్స్ తో సినిమాల విషయంలో  మల్టిపుల్ గా ప్రొడక్షన్ డిలే లు ఎదుర్కొంటున్నారు. అయితే పవన్ తన వల్ల ఎవరూ నష్టపోకూడదని సినిమాలకు వీలు చూసుకుని సమయం కేటాయించి పెండింగ్ వర్క్ లు ఫినిష్ చేస్తామన్నారు. ఆయన షూటింగ్ కు డేట్స్ ఇవ్వటానికి త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి. అభిమానులు సైతం త్వరలోనే ఆ సినిమాలు ప్లోర్ కు వెళ్తాయని భావిస్తున్నారు. 
 

ఏదైమైనా గబ్బర్‌ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. విజయ్ తేరీ సినిమాను ఇక్కడి నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసినట్టుగా కనిపిస్తోంది.  గబ్బర్ సింగ్‌ను మించేలానే ఉండబోతోన్నట్టుగా అనిపిస్తోంది. ఈ చిత్రంలో శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఈ చిత్రంలో కీ షెడ్యూల్ కోసం ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్‌ సాయి నేతృత్వంలో స్పెషల్ సెట్‌ వేయించారు కూడా. 
 

పవన్ కళ్యాణ్ - హరీశ్ శంకర్ కాంబోలో రెండోసారి వస్తున్న చిత్రం కావడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ సరసన యంగ్ సెన్సేషన్ శ్రీలీలా (Sreeleela)  నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 

Latest Videos

click me!