నాగార్జునతో విజయశాంతికి గొడవ ఎందుకో తెలుసా? ఆ కారణంగానే దూరం, మళ్లీ ఎప్పుడూ కలవలేదు

Published : Jul 04, 2025, 07:10 PM IST

నాగార్జున, విజయశాంతి కలిసి మూడు సినిమాలు మాత్రమే చేశారు. కానీ ఆ తర్వాత కలిసి నటించలేదు. దానికి కారణం వారి మధ్య గొడవే అని తెలుస్తుంది. ఆ గొడవేంటి? 

PREV
15
నాగార్జునతో ఎక్కవ సినిమాలు చేయని విజయశాంతి

లేడీ అమితాబ్‌గా అప్పట్లో గుర్తింపు తెచ్చుకున్న విజయశాంతి తెలుగులో టాప్‌ హీరోలందరితోనూ కలిసి నటించింది. చిరంజీవి, బాలయ్యలతో ఏకంగా పోటీ పడి సినిమాలు చేసింది. అత్యధికంగా వీరి కాంబినేషన్‌లో విజయశాంతికి మూవీస్‌ ఉన్నాయి.

 వెంకటేష్‌తోనూ బాగానే చేసింది. కానీ నాగార్జునతో కేవలం మూడు సినిమాలే చేసింది. ఆ తర్వాత కూడా వీరి కాంబినేషన్‌లో సినిమాలు రావాల్సింది. కానీ ఓ గొడవ వీరిని దూరం చేసింది. మరి ఆ గొడవేంటనేది చూస్తే,

25
నాగార్జున, విజయశాంతి కాంబోలో వచ్చిన మూవీస్‌

నాగార్జున, విజయశాంతి కాంబినేషన్‌లో `జానకీరాముడు`(1988), `విజయ్‌`(1989), `జైత్రయాత్ర`(1991) వంటి సినిమాలు చేశారు. ఇవి మంచి ఆదరణనే పొందాయి. 

ఆ తర్వాత మరో సినిమా నాగార్జున, విజయశాంతి కాంబినేషన్‌లో రావాల్సింది. ఓ పోలీస్‌ డ్రామా మూవీలో ఈ ఇద్దరు జంటగా నటించేందుకు ఓకే చెప్పారు. సినిమా షూటింగ్‌ కూడా ప్రారంభమైంది. 

అయితే ఇందులో నాగార్జున కెప్టెన్‌ పాత్రలో, విజయశాంతి సీబీఐ అధికారిని పాత్రలో నటించేందుకు ఓకే చెప్పారు. సినిమా గ్రాండ్‌గా స్టార్ట్ అయ్యింది. తొలి క్లాప్‌ కూడా కొట్టారు. కానీ ఆ రోజు మధ్యాహ్ననికే మూవీ ఆగిపోయింది.

35
నాగార్జున, విజయశాంతి మధ్య ఈగో క్లాష్‌

స్క్రిప్ట్ చూసిన నాగార్జున హర్ట్ అయ్యారు. ఇందులో తనకంటే విజయశాంతికే ఎక్కువ సీన్లు ఉండటంతో ఆయన భరించలేకపోయారు. ఇది హీరో మూవీ, కానీ హీరోయిన్‌కి ఇన్ని సీన్లు ఉండటమేంటి? అని ప్రశ్నించారు. 

హీరో కంటే హీరోయిన్‌ పాత్ర డామినేషనే ఎక్కువగా ఉండటంతో ఆయన తట్టుకోలేకపోయారు. దీనికి విజయశాంతి స్పందించారు. కథబలం పాత్రలతోనేగా, హీరోయిన్లకి ఎక్కువ స్థానం ఇస్తే ఏంటి ఇబ్బంది అని ప్రశ్నించిందట. 

ఇది ఇద్దరి మధ్య గ్యాప్‌ పెంచేసింది. ఈగోలకు దారి తీసింది. ఈ విషయంలో అటు నాగార్జున తగ్గలేదు, అటు విజయశాంతి తగ్గలేదు. దీంతో షూటింగ్‌ని ఆపేశారు.

45
ఆ గొడవతో మళ్లీ సినిమాలు చేయలేదు

ఆ తర్వాత అయినా గొడవ సర్దుమనుగుతుందని భావించినా ఎవరూ తగ్గలేదు. దీంతో సినిమానే ఆపేయాల్సి వచ్చిందట. కానీ నిర్మాతలకు ఇది భారీగానే నష్టాలను తెచ్చింది.

 అయితే ప్రారంభంలోనే ఆగిపోవడంతో తక్కువ నష్టం వచ్చిందని, అదే షూటింగ్‌ మధ్యలో లాంటి క్లాష్‌ వస్తే నిర్మాత నిండా మునిగిపోవడమే అనే టాక్‌ అప్పట్లో జరిగిందట. అదే సమయంలో నాగార్జున,విజయశాంతిల గొడవ వ్యవహారం కూడా బాగా చర్చనీయాంశం అయ్యిందని టాక్‌. 

ఆ గొడవతో ఈ ఇద్దరి మధ్య గ్యాప్‌ పెరిగింది. ఇంకెప్పుడూ ఈ ఇద్దరు కలిసి నటించలేదు. మళ్లీ వెండితెరపై కలవలేదు. ఈగో క్లాష్‌ ఈ ఇద్దరు స్టార్స్ ని దూరం చేసిందని చెప్పొచ్చు. మరి ఇదే కారణమా? ఇంకా ఏదైనా ఉందా అనేది తెలియాలి.

55
`కుబేర`తో నాగ్‌, `అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి`తో విజయశాంతి సందడి

నాగార్జున హీరోగా సినిమాలు చేయడంతోపాటు క్యారెక్టర్స్ వైపు కూడా టర్న్ తీసుకున్నారు. ఇటీవల `కుబేర`లో కీలక పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. మరోవైపు ఇప్పుడు `కూలీ` సినిమాతో రాబోతున్నారు. ఇది ఇండిపెండెంట్‌ డే కి విడుదల కానుంది. 

ఇక విజయశాంతి సినిమాలకు దూరయ్యింది. ఆమె చాలా ఏళ్ల గ్యాప్‌తో ఆ మధ్య `సరిలేరు నీకెవ్వరు`లో కీలక పాత్రలో నటించింది. ఇటీవల `అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి`లో మెరిసిన విషయం తెలిసిందే.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories