ఇక్కడే నెటిజన్లకి మంటపుట్టిస్తుంది. వీడియోల్లోనూ స్పష్టంగా సన్నీ అన్న మాటల ఉద్దేశం కన్పిస్తుందని, ఆయన్ని రెచ్చగొడితేనే ఆయన రియాక్ట్ అయ్యాడని, తంతా అన్నది బ్రిక్స్ నే అని, అప్పడం అయిపోతావనే అన్నది తనని పట్టుకున్నందుకే, అప్పడం అమ్ముతా అన్నది కూడా సిరి అమ్ముకో పో అంటేనే అని, అందులో సన్నీ తప్పేం లేదని, వాళ్లు రెచ్చగొడితేనే రియాక్ట్ అయ్యాడని అంటున్నారు నెటిజన్లు. ఈ విషయంలో నాగార్జున బైయాస్‌గా ఉండాల్సింది పోయి, సన్నీని దోషిగా తేల్చడం కరెక్ట్ కాదని, షణ్ముఖ్, సిరిలకు సపోర్ట్ చేస్తూ సన్నీని తప్పుపట్టడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాదు నాగార్జునని ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు.