Pooja Hegde: మాల్దీవుల్లో తన గది చూపిస్తూ పూజా హెగ్డే రచ్చ.. వాటికోసం అభిమానులు ఎదురుచూపులు..

Published : Nov 13, 2021, 08:59 PM ISTUpdated : Nov 13, 2021, 10:29 PM IST

స్టార్‌ హీరోయిన్‌, బుట్టబొమ్మ పూజా హెగ్డే వెకేషన్‌కి చెక్కేసింది. మాల్దీవుల్లో ఎంజాయ్‌ చేసేందుకు సడెన్‌గా ట్రిప్పేసింది.ఇప్పుడు అక్కడ అసలైన రచ్చ షురూ చేస్తుంది. ఈ సందర్భంగా ఆమె పంచుకున్న పిక్స్, వీడియోలో వైరల్‌ అవుతున్నాయి.   

PREV
18
Pooja Hegde: మాల్దీవుల్లో తన గది చూపిస్తూ పూజా హెగ్డే రచ్చ.. వాటికోసం అభిమానులు ఎదురుచూపులు..

పూజా హెగ్డే శుక్రవారం వెకేషన్‌కి వెళ్లింది. జనరల్‌గా స్టార్స్ అందరూ వెకేషన్‌కి మాల్దీవులకే వెళ్తుంటారు. నీలి సముద్రం అందాలను ఆస్వాదిస్తూ, సూర్య కిరణాలు అందాల భామ అందాలను ముద్దాడగా, తన్మయత్వం చెందుతుంటారు కథానాయికలు. అందులో భాగంగానే పూజా హెగ్డే మాల్దీవుల్లో రచ్చ చేసేందుకు వెళ్లింది. నిత్యం షూటింగ్‌లతో బిజీగా ఉన్న బుట్టబొమ్మ దాన్నుంచి రిలీఫ్‌ అయ్యందుకు మాల్దీవులకు చెక్కేసింది. అక్కడ తాను దిగిన రిసార్ట్ చూపిస్తూ వీడియోలు పంచుకుంది. ఇప్పుడవీ వైరల్‌ అవుతున్నాయి. ఈ సందర్భంగా పూజా చెబుతూ `విరామం తీసుకునే సమయం ఇది.. ఆ తర్వాత ఏంటో చూడండి` అంటూ మాల్దీవుల పేరుతో ఉన్న హ్యాష్‌ ట్యాగ్‌ను జత చేసింది.

28

 పూజా హెగ్డే నీలి సముద్రం అందాలను ఆస్వాధించేందుకు రెడీ అవుతుంది. అయితే ఈ సందర్భంగా పూజా ధరించిన డ్రెస్‌ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఎయిర్‌ పోర్ట్ నుంచి వెళ్లిన డ్రెస్సులోనే కనిపించింది పూజా. జస్ట్ అక్కడికి రీచ్‌ అయి వెంటనే తన సహాయకులతో ఈ వీడియోలు తీయించి ఇన్‌స్టా స్టోరీలో అభిమానులతో షేర్‌ చేసుకుంది. మాల్దీవులకు వెకేషన్‌కి వచ్చినట్టు చెప్పింది పూజా. 

38

ఇందులో చిన్న పీలికని ముడేసుకుని, నడుము అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది. బాటమ్‌లో వైట్‌ ప్యాంట్‌ ధరించింది పూజా. అయితే ఈ సందర్భంగా అభిమానులు, నెటిజన్లు ఈగర్ గా వెయిట్‌ చేస్తున్నారట. అక్కడి బికినీ అందాల కోసం తాము వెయింటింగ్‌ అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. అందాల విందుని ఆరగించేందుకు తాము కాచుకుని కూర్చున్నట్టు కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. 

48

ఇక రేపు ఈ అమ్మడి నుంచి అసలైన గ్లామర్‌ విందు రాబోతుందని అర్థమవుతుంది. దీంతో ప్రస్తుతం పూజా హెగ్డే వెకేషన్‌ వీడియోలో, వెకేషన్‌కి వెళ్తున్న సందర్భంగా ఎయిర్‌పోర్ట్ లో ఆమె దిగిన ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. 
 

58

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు పూజా హెగ్డే. వరస హిట్‌లు అందుకంటూ మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా టాలీవుడ్‌ని ఊపేస్తుంది పూజా. ఇటీవల ఆమె నటించిన `మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకుంది. 

68

ఆమె నటించిన పాన్‌ ఇండియా చిత్రం `రాధేశ్యామ్‌` కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. నేడు(శనివారం) ఈ సినిమా నుంచి ఓ అప్‌డేట్‌ని పంచుకున్నారు. ఈ నెల 15న ఈ చిత్రంలోని తొలి పాటని విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. 

78

మరోవైపు `ఆచార్య`లో రామ్‌చరణ్‌తో నటిస్తుంది పూజా. ఇది కూడా చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. తమిళంలో విజయ్‌తో `భీస్ట్` చిత్రంలో నటిస్తుంది పూజా. మహేష్‌తో త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందే చిత్రం షూటింగ్‌ ఇంకా స్టార్ట్ కావడానికి టైమ్‌ పడుతున్న నేపథ్యంలో ఈ లోపు వెకేషన్‌ ఇంజాయ్‌ చేయాలని నిర్ణయించుకుందట పూజా. 
 

88

మాల్దీవుల్లో తాను దిగిన హోటల్‌ రూమ్‌లో పూజా సందడి. స్ట్రెస్‌ నుంచి రిలీఫ్‌ పొందేందుకు మాల్డీవులకు చెక్కేసింది పూజా.  pooja hegde enjoying maldives vacation. 

also read: National Crush: రష్మిక మందన్నాకి నిధి అగర్వాల్ దిమ్మతిరిగే షాక్‌‌.. పవన్‌ కళ్యాణ్‌ని చూసుకునేనా ఈ దూకుడు?

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories