National Crush: రష్మిక మందన్నాకి నిధి అగర్వాల్ దిమ్మతిరిగే షాక్‌‌.. పవన్‌ కళ్యాణ్‌ని చూసుకునేనా ఈ దూకుడు?

First Published | Nov 13, 2021, 7:56 PM IST

నేషనల్‌ క్రష్‌గా రష్మిక మందన్నా తిరుగులేని ఇమేజ్‌తో దూసుకుపోతుంది. శాండల్‌వుడ్‌ నుంచి బాలీవుడ్‌ వరకు దూసుకెళ్లిన ఈ సెన్సేషన్‌కి తాజాగా అందాల సెన్సేషన్‌, ఇస్మార్ట్ భామ నిధి దిమ్మితిరిగే షాకిస్తుంది. రష్మిక అభిమానులకు మైండ్‌ బ్లాంక్‌ చేసేస్తుంది. 

రష్మిక మందన్నా(Rashmika Mandanna) సునామీలా దూసుకొచ్చింది. కేవలం ఒక్క సినిమాతోనే ఈ అమ్మడి కెరీర్‌ మారిపోయింది. `ఛలో` సినిమా సక్సెస్‌, ఆ వెంటనే `గీతగోవిందం` బ్లాక్‌బస్టర్‌ కావడంతో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది Rashmika Mandanna. ప్రస్తుతం బాలీవుడ్‌ సినిమాలతో దూసుకుపోతుంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ చిత్రాల్లో సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీగా ఉంది. నాలుగు చిత్ర పరిశ్రమలను ఓ రౌండేసుకుంటుంది. ప్రధానమైన చిత్ర పరిశ్రమలో సినిమాలు చేయడం, అభిమానులకు నిత్యం అందుబాటులో ఉండటం, వారితో చాట్‌ చేయడం, అందాల ఫోటోలను పంచుకుని ఫాలోయింగ్‌ని పెంచుకోవడం వంటి కారణాలతో రష్మిక మందన్నా ఇప్పుడు నేషనల్‌ క్రష్‌గా ఎదిగింది. 

రష్మిక మందన్నా అభిమానులు ఆమెని నేషనల్‌ క్రష్‌గా ట్విట్టర్‌ వంటిసామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ చేస్తుంటారు. ఇలా చాలా సార్లు ఈ బ్యూటీ ట్రెండింగ్‌లోకి వెళ్లడం, బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్లని సైతం ఆశ్చర్యానికి గురి చేయడం విశేషం. రష్మిక అభిమానులు సౌత్‌లోనే ఎక్కువ. ఆమెకి సోషల్‌ మీడియాలో ఏకంగా 24 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. రష్మిక ఫాలోయింగ్‌ రేంజ్‌ని తెలియజేస్తుంది. 


సౌత్‌లోనే అత్యధిక ఫాలోయింగ్‌ కలిగిన నటిగా నిలిచిన రష్మిక మందన్నా నేషనల్‌ క్రష్‌గా ఉన్నారు. అభిమానులు ఆమెని ముద్దుగా నేషనల్‌ క్రష్‌గా పిలుచుకుంటారు. ఆమె అందం అంతగా ఆకట్టుకుంటుండటం విశేషం. ఇలా అతి తక్కువ టైమ్‌లోనే ఇంతటి ఇమేజ్‌ని, ఫాలోయింగ్‌ని సొంతం చేసుకోవడం చాలా అరుదుగా చెప్పొచ్చు. 
 

ఇక తనకు తిరుగులేదనుకుంటున్న రష్మిక దిమ్మదిరిగే షాక్‌ ఇస్తుంది మరో హాట్‌ సెన్సేషన్‌ నిధి అగర్వాల్‌ (Nidhhi Agarwal). `ఇస్మార్ట్` శంకర్‌ చిత్రంతో ఓవర్‌ నైట్‌లో స్టార్‌ అయిపోయిన నిధి అగర్వాల్‌ ఇప్పుడు రష్మికకి పోటీనిస్తుంది. ఊహించని విధంగా నిధి కూడా నేషనల్‌ క్రష్‌గా ఎదుగుతూ మతిపోయేలా చేస్తుంది. రష్మిక అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. nidhhi shock to rashmika mandanna.

నిధి అగర్వాల్‌ `ఇస్మార్ట్` భామగా పాపులర్‌ అయ్యింది. నిన్న శుక్రవారం సోషల్‌ మీడియాని ఊహించని విధంగా మరో నేషనల్‌ క్రష్‌గా ట్రెండింగ్‌లోకి వెళ్లిపోయింది. నిధి అభిమానులు ఆమె పంచుకున్న రెండు కొత్త గ్లామర్‌ ఫోటోలను షేర్‌ చేస్తూ నేషనల్‌ వైడ్‌గా ట్రెండ్‌ చేయడం ఓ విశేషమైతే, `నేషనల్‌క్రష్‌` అంటూ ఆమెని ట్రెండ్‌ చేయడం మరో విశేషం. ఊహించిన విధంగా ఆమెకి వేలల్లో ట్వీట్లు పోస్ట్ కావడం ఇప్పుడు రష్మిక అభిమానులను ఉలిక్కిపాటుకి గురి చేస్తుంది. నిధి అభిమానులు ఇచ్చిన ఊహించని షాక్‌కి బెంబెలెత్తిపోతున్నారట రష్మిక మందన్నా ఫ్యాన్స్. ఈ సెక్సీ భామ రేంజ్‌కి మతిపోయిందని సోషల్‌ మీడియాలో కామెంట్లు వస్తుండటం విశేషం. అంతేకాదు ఇద్దరు హీరోయిన్లలో ఎవరికి మీ ఓటు అని నిర్వహించిన పోల్‌లోనూ నిధికే ఎక్కువగా ఓట్లు పడటం నిధి ఫాలోయింగ్‌ కి అద్దం పడుతుంది. ఇది రష్మిక అభిమానులకు మింగుడు పడటం లేదట. 

అయితే ఈ సందర్భంగా ఓ కొత్త చర్చ ప్రారంభమైంది. Nidhhi Agarwal ఇలా ఊహించని విధంగా ట్రెండింగ్‌లోకి రావడం ఏంటనేది ఇప్పుడు సరికొత్త చర్చకి తెరలేపుతుంది. ఆమె అందాల ఫోటోలే అందుకు కారణమని, హాట్‌నెస్‌లో నిధి మరెవ్వరూ సాటి రాలేరని అంటున్నారు అభిమానులు. అయితే ఇందులో మరో కొత్త రీజన్‌ కూడా బయటకు వచ్చింది. పవన్‌ కళ్యాణ్‌ అందుకు కారణమని అంటున్నారు. 

నిధి అగర్వాల్‌..ప్రస్తుతం పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌తో కలిసి `హరిహర వీరమల్లు` చిత్రంలో నటిస్తుంది. ఇందులో మెయిల్‌ లీడ్‌గా పవన్‌తో రొమాన్స్‌ చేస్తుంది. మరో హీరోయిన్‌ జాక్వెలిన్‌ కనిపిస్తారని వినిపిస్తుంది. కానీ ప్రధానంగా నిధినే డామినేషన్‌ ఉంటుందట. పవన్‌ అభిమానులు కూడా ఇప్పుడు నిధిని ట్రెండింగ్‌ చేయడంలో భాగమయ్యారని, పవర్ స్టార్‌ ఫ్యాన్స్ కూడా నిధికి ఫ్యాన్స్ గా మారిపోతున్నారని అంటున్నారు. మరి ఇందులో నిజమెంతో గానీ ఇప్పుడు రష్మిక మందన్నాని మించిన నేషనల్‌ క్రష్‌గా ట్రెండ్‌ అవడం నిధి స్టామినాని తెలియజేస్తుందని చెప్పొచ్చు. 

ఇక క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న `హరిహర వీరమల్లు` చిత్రంలో పవన్‌ కల్యాణ్‌ వీరమల్లుగా కనిపించబోతున్నారు. ఆయనకు జోడీగా నిధి హీరోయిన్‌గా చేస్తుంది. ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా 
షూటింగ్‌ త్వరలో ప్రారంభం కాబోతుందని, డిసెంబర్‌ నుంచి నిధి చిత్రీకరణలో పాల్గొంటుందని తెలుస్తుంది. 
 

మరోవైపు నిధి అగర్వాల్‌ ఈ చిత్రంతోపాటు అశోక్‌ గల్లా హీరోగా పరిచయమవుతున్న `హీరో` చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ని ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి 26న రిపబ్లిక్‌ డే సందర్భంగా రిలీజ్‌ చేయబోతున్నట్టు తాజాగా ప్రకటించారు. మరోవైపు తమిళంలో ఓ సినిమా చేస్తుంది నిధి అగర్వాల్‌.

also read: థైస్ అందాలతో నిధి అగర్వాల్ స్టన్నింగ్ ఫోటోస్.. ఫ్యాన్స్ కి హాట్ ట్రీట్
 

ఇక రష్మిక మందన్నా ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న `పుష్ప` చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రం మొదటి భాగం డిసెంబర్‌ 17న రాబోతున్నట్టు ప్రకటించారు. అయితే ఇది వాయిదా పడే అవకాశం ఉందట. దీంతోపాటు శర్వానంద్‌తోపాటు `ఆడవాళ్లు మీకు జోహార్లు` సినిమా చేస్తుంది రష్మిక.

మరోవైపు బాలీవుడ్‌లో మూడు సినిమాలు చేస్తుంది రష్మిక. అందులో `మిషన్‌ మజ్ను` చిత్రంలో సిద్ధార్థ్‌ మల్హోత్రాకి జోడీ కట్టింది. అలాగే అమితాబ్‌ బచ్చన్‌తో `గుడ్‌బై` సినిమాలో నటిస్తుంది. వీటితోపాటు మరో సినిమా కూడా చేయబోతుందని టాక్‌. 

also read; Rashmika mandanna:పైట తీసేసి నడుము, నాభీ చూపిస్తూ రష్మిక రచ్చ... ఇంత హాట్ గా ఎప్పుడూ చూసి ఉండరు!
 

Latest Videos

click me!