బెడ్‌పై కదలలేని స్థితిలో ఏఎన్నార్‌.. కన్నీళ్లు పెట్టుకున్న నాగార్జున.. సుశీల భర్తకి చెప్పిన మాట ఒక్కటే

Published : Aug 16, 2025, 09:38 PM IST

నాగార్జున సాధారణంగా ఎమోషనల్‌ కారు, చాలా స్ట్రాంగ్‌ పర్సన్‌. కానీ ఆయన ఒక్కరి విషయంలో మాత్రం ఎమోషనల్‌ అవుతారు. తాజాగా నాన్న ఏఎన్నార్‌ని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. 

PREV
16
విలన్‌గా టర్న్ తీసుకున్న నాగార్జున

నాగార్జున ఇటీవల హీరో నుంచి విలక్షణ నటుడిగా టర్న్ తీసుకుంటున్నారు. ఆ మధ్య `కుబేర`లో కీలక పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. ఇప్పుడు `కూలీ`లో నెగటివ్‌ రోల్‌ చేశారు. సైమన్‌గా అదరగొట్టాడు. అయితే ఆయన స్టార్‌ ఇమేజ్‌ కి తగ్గ రోల్‌ దక్కలేదనే కామెంట్‌ వచ్చింది. ఫ్యాన్స్ నుంచి కొంత అసంతృప్తి వినిపిస్తోంది. ఈ క్రమంలో తాజాగా నాగార్జున కన్నీళ్లు పెట్టుకున్న వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతుంది. జగపతిబాబు హోస్ట్ గా చేస్తున్న షోలో పాల్గొన్న నాగ్‌ నాన్న ఏఎన్నార్‌ని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు.

DID YOU KNOW ?
క్యాన్సర్‌తో ఏఎన్నార్‌ కన్నుమూత
తెలుగు చిత్ర పరిశ్రమలో లెజెండరీ నటుడిగా రాణించిన ఏఎన్నార్‌ క్యాన్సర్‌తో బాధపడుతూ 2014 జనవరి 22న కన్నుమూశారు.
26
జగపతిబాబు హోస్ట్ గా `జయమ్ము నిశ్చయమ్ము రా` షో

జగపతిబాబు హోస్ట్ గా మారి `జయమ్ము నిశ్చయమ్ము రా` అనే టాక్‌ షోని నిర్వహిస్తున్నారు. జీ తెలుగులో ఇది ప్రసారం కానుంది. రేపు ఆదివారం(ఆగస్ట్ 17) నుంచి ఫస్ట్ ఎపిసోడ్‌ స్టార్ట్ అవుతుంది. ఈ క్రమంలో దీనికి సంబంధించిన ప్రోమోలు విడుదలయ్యాయి. అందులో భాగంగా ఓ ప్రోమోలో నాగార్జున తండ్రిని తలుచుకుని ఎమోషనల్‌ అయ్యారు. ఏఎన్నార్‌ కొడుకుగా ఉండటం ఎలా అనిపిస్తుందని నాగార్జునని అడిగారు జగపతిబాబు.

36
ఏఎన్నార్‌ కళ్లల్లో నీళ్లు తిరిగిన సందర్భం

దీనికి నాగ్‌ స్పందిస్తూ, ఏఎన్నార్‌ కొడుకు అనుకుంటున్నావేమో, అంత ఈజీ కాదు అని నాన్న చెప్పినట్టు తెలిపారు నాగార్జున. ముందుగా అన్నయ్య వెంకట్‌ ఉండి, హీరో అవుతావా? అని అడిగితే, నటిస్తానని చెప్పాను. ఈ విషయాన్ని ఓ రోజు నాన్నకి ఇలా అనుకుంటున్నట్టు చెప్పినప్పుడు ఆయన కళ్లలో నీళ్లు తిరిగాయి. `అన్నమయ్య` సినిమా వచ్చినప్పుడు నా రెండు చేతులు పట్టుకుని నువ్వు సాధించినట్టుగా ఎక్స్ ప్రెషన్స్ తో వెల్లడించారని, అది తనకు ప్రపంచాన్ని జయించినంత ఆనందాన్నిచ్చిందని చెప్పారు నాగ్‌.

46
నాన్నని గుర్తు చేసుకుంటూ నాగార్జున కన్నీళ్లు

ఆ తర్వాత నాన్న ఏఎన్నార్‌ని గుర్తు చేసుకుంటూ, నాన్న బెడ్‌పై పడుకుని ఉన్నాడు. లేవలేకపోతున్నారని చెబుతూ షోలోనే జగపతిబాబు ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు నాగార్జున. ఆయన ఎలా బతకాలనుకున్నారో అలానే బతికారని చెప్పారు. చివర్లో చినబాబు అని ఏఎన్నార్‌ చెప్పినట్టుగా ఆడియో చూపించడం విశేషం. అయితే ఇందులో చిన్నప్పటి ఏఎన్నార్‌, నాగార్జునని ఏఐ ద్వారా చూపించిన వీడియో అదిరిపోయింది. ఇది చూసి నాగార్జున సైతం ఆశ్చర్యపోయారు. ఆనందం వ్యక్తం చేశారు.

56
సిస్టర్‌ నాగ సుశీల భర్తకి మాటిచ్చిన నాగ్‌

ఇంకోవైపు ఇదే షోలో నాగార్జున అన్న వెంకట్‌, సిస్టర్‌ నాగసుశీల కూడా పాల్గొన్నారు. తన భర్త సత్య భూషణ్‌ రావు మరణించడానికి చివరి రోజుల్లో జరిగిన సంఘటన పంచుకుంటూ, తాను చివరి రోజుల్లో మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. కనీసం మంచినీళ్లు కూడా తాగలేకపోతున్నాడు. చాలా మదన పడుతున్నారు. ఆ సమయంలో చినబాబు(నాగార్జున) ఉండి, సుశీల నేను వచ్చి మాట్లాడనా సత్యభూషణ్‌తో అని అన్నాడు. ఆ తర్వాత చినబాబు, అమల, అఖిల్‌ వచ్చి.. సత్య భూషణ్‌ నువ్వు బాధపడకు, సుశీల, పిల్లలను నేను చూసుకుంటాను అని చెప్పాడు. అంతే ఆ మరుసటి రోజే ఆయన వెళ్లిపోయారు(చనిపోయారు) అని చెప్పింది నాగసుశీల. ఈ క్రమంలోనే వెంకట్‌ కన్నీళ్లు పెట్టుకోగా, నాగ్‌ సైతం ఎమోషనల్‌ అయ్యారు.

66
నాగార్జున కన్నీళ్లు పెట్టుకోవడం చాలా అరుదు

నాగార్జున కన్నీళ్లు పెట్టుకోవడం చాలా అరుదు. ఆయన చాలా స్ట్రాంగ్‌ పర్సన్‌. నాన్న ఏఎన్నార్‌ మరణించినప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు జగపతిబాబు షోలో ఇలా కన్నీళ్లు పెట్టుకోవడం గమనార్హం. నాన్నపై ఆయనకున్న ప్రేమకి, అభిమానానికి నిదర్శనంగా చెప్పొచ్చు. అదే సమయంలో కుటుంబం పట్ల తనకున్న బాధ్యతని చాటి చెప్పారు నాగ్‌. అభిమానుల చేత ప్రశంసలందుకుంటున్నారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories