కొరటాల శివ ట్విస్ట్ ఇవ్వబోతున్నారా.. ఎవ్వరూ ఊహించని హీరోతో మూవీకి ప్లాన్ ?

Published : Aug 16, 2025, 09:26 PM IST

దేవర చిత్రం తర్వాత కొరటాల శివ తదుపరి చిత్రం ఏంటనేది క్లారిటీ లేదు. దేవర 2 తెరకెక్కిస్తారా లేక వేరే మూవీ చేస్తారా అనే చర్చ జరుగుతోంది. ఈ తరుణంలో కొరటాల నెక్స్ట్ మూవీ గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. 

PREV
15
కొరటాల శివ కొత్త చిత్రంపై సస్పెన్స్ 

గత ఏడాది విడుదలైన దేవర చిత్రం తర్వాత డైరెక్టర్ కొరటాల శివ తన తదుపరి చిత్రాన్ని ఇంకా ప్రకటించలేదు. దేవర 2 చేయాల్సి ఉంది. కానీ ఇప్పట్లో ఆ చిత్రం పట్టాలెక్కే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎన్టీఆర్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. తాను కమిటైన చిత్రాలని ఆపి దేవర 2కి సమయం కేటాయించే పరిస్థితి ఉందా అంటే అది అనుమానమే. 

DID YOU KNOW ?
కొరటాల శివ పాన్ ఇండియా చిత్రం
కొరటాల శివ తెరకెక్కించిన తొలి పాన్ ఇండియా చిత్రం దేవర. ఎన్టీఆర్ హీరోగా రూపొందిన ఈ చిత్రానికి పార్ట్ 2 కూడా అనౌన్స్ చేశారు. అయితే పార్ట్ 2 ఎప్పుడు వస్తుంది అనేది క్లారిటీ లేదు. 
25
ఎవ్వరూ ఊహించని హీరోతో మూవీకి ప్లాన్ 

కొరటాల శివ తదుపరి చిత్రం గురించి వస్తున్న వార్తలు ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, చిరంజీవి లాంటి స్టార్స్ ని డైరెక్ట్ చేసిన కొరటాల శివ ఈసారి పెద్ద స్టార్ కాకుండా నాగ చైతన్యతో మూవీ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

35
జోరుమీద ఉన్న అక్కినేని హీరో 

నాగ చైతన్య చివరగా తండేల్ చిత్రం విజయంతో మంచి జోరు మీద ఉన్నాడు. ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో నాగ చైతన్య తన 24వ చిత్రంలో నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా కొరటాల శివ ఇటీవల కొన్ని సార్లు నాగ చైతన్యని మీట్ అయినట్లు తెలుస్తోంది. 

45
కొరటాల, నాగ చైతన్య కాంబినేషన్ 

ఒక స్టోరీ ఐడియాని కొరటాల చైతు ముందు ఉంచారట. కొరటాల చెప్పిన లైన్ నాగ చైతన్యకి బాగా నచ్చినట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ తప్పకుండా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. కొరటాల శివ తన పూర్తి సత్తా చూపి చాలాకాలం అవుతోంది. చిరంజీవితో రూపొందించిన ఆచార్య చిత్రం దారుణంగా నిరాశ పరిచింది. ఎన్టీఆర్ తో తెరకెక్కించిన దేవర చిత్రం దేవర కూడా పర్వాలేదనిపించింది కానీ పూర్తి స్థాయిలో అంచనాలని అందుకోలేదు. 

55
కొరటాల శివ చిత్రాలు 

దీనితో కొరటాల శివ.. నాగ చైతన్యతో ఒక చిత్రం రూపొందించి బౌన్స్ బ్యాక్ అవ్వాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కొరటాల శివ ప్రభాస్ మిర్చి చిత్రంతో డైరెక్టర్ గా మారారు. మిర్చి, జనతా గ్యారేజ్, శ్రీమంతుడు, భరత్ అనే నేను లాంటి చిత్రాలతో ఘనవిజయాలు అందుకున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories