నాగార్జున ఎంత చెప్పినా వినని ఇషా కొప్పికర్
ఇషా తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న సందర్భంలో ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ. '' చంద్రలేఖ షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటన జరిగింది. సినిమాలో ఒక సీన్‌లో నాగార్జున నన్ను చెంపపై కొట్టే సీన్ ఉంది. షూటింగ్‌కు ముందు నాగార్జున నాతో సున్నితంగా కొడతాను, షాట్ ఓకే చేద్దాం అన్నారు.
కానీ నేను మాత్రం అలా అయితే ఈ సీనుకు న్యాయం చేయలేము కాబట్టి మీరు నిజంగా కొట్టాలి అని చెప్పాను. అప్పటికీ నాగార్జున నాకు సర్ధి చెప్పాలని ఎంతో ప్రయత్నం చేశారు. కాని ఆయన ఎంత చెప్పినా నేను వినలేదు. దాంతో నేను అడిగినందకే ఆయన నిజంగానే గట్టిగా చెంపపై కొట్టారు.