జపాన్ లో నాగార్జున క్రేజ్
తాజాగా జపాన్‌లో తెలుగు నటుడు నాగార్జునకు ఏర్పడిన ఫ్యాన్ బేస్ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జపాన్ లో నాగార్జున క్రేజ్ ఎంత పెరిగిందంటే, తాజాగా ఆయన నటించిన ‘మనం’ సినిమా జపాన్‌లో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాను ఆగస్టు 8న జపాన్‌లో రీ-రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ రీ-రిలీజ్ సందర్భంగా జపాన్ అభిమానులతో నాగార్జున వర్చువల్ కాల్ ద్వారా మాట్లాడనున్నాడు. జూమ్ లేదా గూగుల్ మీట్ ప్లాట్‌ఫార్మ్‌లలో ఈ ఇంటరాక్షన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
నాగార్జునకు జపాన్‌లో ఇంతటి ఆదరణ రావడానికి ప్రధాన కారణం “బ్రహ్మాస్త్ర” సినిమా. ఈ సినిమాలో ఆయన పోషించిన పాత్ర అక్కడి ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా 5 ఏళ్ల క్రితం రిలీజై అక్కడ మంచి విజయం సాధించింది. రణబీర్ కపూర్, అలియా భట్‌తో కలిసి నటించిన ఈ సినిమాలో నాగార్జున పాత్రకు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. దీనితో ఆయనకి అక్కడ ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది.