పవన్‌ కళ్యాణ్‌, అల్లు అర్జున్‌ మధ్య గొడవకి పునాది అక్కడే? బన్నీ మూలాలు మరిచాడా? తెరవెనుక అసలు కథ ఇదే?

First Published | Sep 5, 2024, 6:19 PM IST

పవన్‌ కళ్యాణ్‌, అల్లు అర్జున్‌ల మధ్య గొడవకి పునాదులు అప్పుడే పడ్డాయా? బన్నీకి కాలింది ఎక్కడో తెలుసా? ఐకాన్‌ స్టార్‌ మూలాలు మరిచిపోయాడా?
 

మెగా ఫ్యామిలీ చూడబోతుంటే ఇప్పుడు రెండుగా చీలబోతున్నట్టు అనిపిస్తుంది. ఇటీవల పరిణామాలు రాను రాను రెండు ఫ్యామిలీల మధ్య గ్యాప్‌ని పెంచేలా కనిపిస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్‌ ఎన్నికల సమయంలో ఏర్పడిన వివాదం నెమ్మదిగా రాజుకుంటోంది. క్రమంగా పెద్దదవుతుంది. ఇటీవల అల్లు అర్జున్‌పై పరోక్షంగా పవన్‌ చేసిన వ్యాఖ్యలు, అలాగే పవన్‌ని ఉద్దేశించి బన్నీ పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి.  

పవన్‌, బన్నీల మధ్య ఏర్పడిన ఈ వివాదంతో గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో వార్‌ నడుస్తూనే ఉంది. ఇద్దరు హీరోల ఫ్యాన్స్ నెట్టింట రెచ్చిపోయి కొట్టుకుంటున్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారు. దారుణంగా ట్రోల్స్ చేసుకుంటున్నారు. ఈ వివాదానికి సంబంధించి అటు అల్లు కాంపౌండ్‌ నుంచి గానీ, ఇటు మెగా కాంపౌండ్‌ నుంచి గానీ `ఏం లేదనే` కామెంట్ మాత్రం రావడం లేదు.

అంటే రెండు ఫ్యామిలీల మధ్య గట్టిగానే రచ్చ నడుస్తుందనేది స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ వివాదానికి కారణం ఏంటి? అసలు ఈ వివాదానికి సంబంధించిన మూలాలు ఎక్కడ ఉన్నాయి అనేది చూస్తే.. 
 

Latest Videos


ఏపీ ఎన్నికల్లో తాను స్థాపించిన జనసేన పార్టీ నుంచి పవన్‌ కళ్యాణ్‌ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. టీడీపీ, బీజేపీతో కలిసి తన పార్టీ నుంచి 21 స్థానాలకు పోటీ చేశారు. ఈ ఎన్నికల సమయంలో పవన్‌ గెలుపు కోసం మెగా ఫ్యామిలీ అంతా సపోర్ట్ చేశారు. చిరు వీడియో రూపంలో సపోర్ట్ ని ప్రకటించారు. రామ్‌ చరణ్‌, వరుణ్‌ తేజ్‌, సాయిధరమ్‌ తేజ్‌ స్వయంగా ప్రచారంలో పాల్గొన్నారు.

నిర్మాత అల్లు అరవింద్‌ సైతం పవన్‌కి మద్దతుగా పిఠాపురం వెళ్లడం విశేషం. అల్లు అర్జున్‌ కూడా ట్విట్టర్‌ ద్వారా పవన్‌కి సపోర్ట్ చేస్తూ పోస్ట్ చేశారు. కానీ ఆ మరుసటి రోజు వైసీపీ నంధ్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవిచంద్రారెడ్డి గెలుపు కోసం అల్లు అర్జున్‌ స్వయంగా నంధ్యాల వెళ్లి ప్రచారంలో పాల్గొన్నారు. ఇదే అసలు రచ్చకి కారణమని చెప్పొచ్చు.

సొంత మేనమామ కోసం ప్రచారం వెళ్లకుండా పవన్‌ ప్రత్యర్థి పార్టీకి చెందిన అభ్యర్థి కోసం బన్నీ వెళ్లడంతో అసలు రచ్చ స్టార్ట్ అయ్యింది. దీన్ని పవన్‌ ఫ్యాన్స్, జనసేన అభిమానులు, మెగా అభిమానులు తట్టుకోలేకపోయారు. సోషల్‌ మీడియాలో విమర్శలు చేశారు. బన్నీని దారుణంగా ట్రోల్‌ చేశారు. అటు బన్నీ ఫ్యాన్స్ సైతం పవన్‌, మెగా ఫ్యామిలీపై రెచ్చిపోయారు. దీంతో సోషల్‌ మీడియాలో పెద్ద వారే జరిగింది. 
 

Allu Arjun-Nagababu

ఈ విషయాన్ని మెగా ఫ్యామిలీ కూడా సీరియస్‌గా తీసుకుందని నాగబాబు కామెంట్లని బట్టి అర్థమయ్యింది. ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే `మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైన పరాయివాడే.. మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే..` అంటూ నాగబాబు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది.

అల్లు అర్జున్‌ను ఉద్దేశించే నాగబాబు ఈ ట్వీట్ వేశారంటూ అల్లు ఆర్మీ మెగాఫ్యామిలీపై విరుచుకుపడింది. ఇది పెద్ద దుమారమే రేపింది. దీంతో కొద్ది సేపటికే నాగబాబు ఈ ట్వీట్‌ని డిలీట్‌ చేశాడు. ఆ తర్వాత నిహారిక సైతం ఓ ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ, అది వాళ్లకి వాళ్లకి సంబంధించిన విషయం అని చెప్పింది. కానీ తమ మధ్య ఏం లేదని మాత్రం చెప్పలేకపోయింది.

ఆ మధ్య బన్నీవాసు మాట్లాడుతూ, జరిగింది ఏదైతే ఉందో అది త్వరలోనే సెట్‌ అవుతుందని భావిస్తున్నామని చెప్పారు. ఆచితూచి స్పందించారు. ఈ పరిణామాలు పవన్‌, బన్నీల మధ్య మాత్రమే కాదు, మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య వివాదం గట్టిగానే నడుస్తుందనే సాంకేతాలని ఇస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
 

పవన్‌ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇటీవల ఓ ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ ఇప్పుడు దురదృష్టవశాత్తు హీరోలే ఎర్రచందనం స్మగ్లింగ్‌ పై సినిమాలు చేస్తున్నారని సెటైర్లు పేల్చారు. ఇది బన్నీనే అని అంతా మాట్లాడుకున్నారు. అలానే ప్రొజెక్ట్ అయ్యింది. మరోవైపు ఈ మధ్య ఓ సినిమా ఈవెంట్‌లో బన్నీ సైతం హాట్‌ కామెంట్‌ చేశారు.

`నాకు నచ్చిన వాళ్ల కోసం నేను ఎంత దూరమైనా వెళతా, ఇష్టమైన వాళ్ల కోసం నేను వెళతా` అంటూ వేదికపై నుంచి గట్టిగానే స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఇది పవన్‌ని ఉద్దేశించే అని అంతా మాట్లాడుకుంటున్నారు. ఈ పరిణామాలు వివాదాన్ని మరింత హాట్‌ హాట్‌గా మార్చాయి.

అయితే బన్నీ.. పవన్‌ కోసం ఎందుకు ప్రచారం చేయలేదు, ఆయన ప్రత్యర్థి పార్టీకి ఎందుకు ప్రచారానికి వెళ్లాడనేది చూస్తే దీని వెనుక పెద్ద కథనే ఉందని తెలుస్తుంది. పవన్‌తో గొడవకు పునాదులు చాలా రోజుల క్రితమే ఉన్నాయని తెలుస్తుంది. 
 

అల్లు అర్జున్‌ నటించిన `సరైనోడు` సినిమా ఈవెంట్‌(2017)లో పవన్‌ ఫ్యాన్స్ గోల చేశారు. పవన్‌ గురించి చెప్పాలంటూ ఫ్యాన్స్ బాగా అరిచి గోల చేశారు. దీనికి మండిపోయిన బన్నీ `నేను చెప్పను బ్రదర్‌` అంటూ గట్టిగానే కామెంట్ చేశారు. ఇలాంటి పరిస్థితి బన్నీకి చాలా సందర్భాల్లోనే ఎదురైంది. దీంతో ఆ రోజు బరస్ట్ అయ్యారు.

ఆ తర్వాత కూడా ఓ ఈవెంట్‌లో పవన్‌ గురించి కాకుండా చిరంజీవి గురించి చెప్పారు. ఆయన్ని చూస్తూ, ఆయన్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని నటుడిని అయ్యానని, ఆయనే తనకు గాడ్‌ ఫాదర్‌ అని తెలిపారు బన్నీ. కానీ పవన్‌ గురించి చెప్పలేదు. ఇలా అప్పట్నుంచే పవన్‌ విషయంలో బన్నీ గుర్రుగానే ఉన్నట్టు వార్తలు ప్రారంభమయ్యాయి. ఇద్దరి మధ్య గ్యాప్‌ వచ్చిందనే పుకార్లు షురూ అయ్యాయి. 
 

అయితే ఆ తర్వాత మాత్రం ఈ ఇద్దరు కలుసుకున్నారు. `నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా` ఈవెంట్ కి పవన్‌ గెస్ట్ గా రావడం విశేషం. ఆ సమయంలో పవన్‌ గురించి ఊగిపోయి మాట్లాడారు బన్నీ. దీంతో ఆ గొడవలేమీ లేవని అంతా అనుకున్నారు. కానీ లోపలు గూడు కట్టుకునే ఉన్నాయని లేటెస్ట్ పరిణామాలను చూస్తుంటే తెలుస్తుంది. 
 

Allu Arjun

ఇదిలా ఉంటే అల్లు అర్జున్‌ ఇలా చేయడం వెనుక పెద్ద స్ట్రాటజీనే ఉందట. ఆయన పెద్ద ప్లాన్‌తోనే ఉన్నాడని తెలుస్తుంది. ఇప్పటి వరకు బన్నీ `మెగా` నీడలోనే ఉన్నాడు. మెగా ఫ్యామిలీ హీరోగానే చెలామణి అవుతున్నాడు. మీడియా కూడా అలానే రాస్తుంది. `అల్లు` ఫ్యామిలీకి బ్యాక్‌ గ్రౌండ్‌ ఉన్నా, రామలింగయ్య వారసత్వం ఉన్నప్పటికీ మెగాస్టార్‌ చిరంజీవి తర్వాత ఆయన సపోర్ట్ తో మిగిలిన హీరోలంతా ఎదిగిన నేపథ్యంలో మెగా ఫ్యామిలీ హీరోలుగానే పిలుస్తుంటారు. 

Allu Arjun

కానీ బన్నీ ఇప్పుడు పాన్‌ ఇండియా స్టార్‌ అయ్యాడు. `పుష్ప` సినిమాతో ఆయన రేంజ్‌ మారిపోయింది. `పుష్ప2`తో గ్లోబల్‌ మార్కెట్‌ని టార్గెట్‌ చేస్తున్నారు. ఈ సారి గట్టిగా కొట్టాలని చూస్తున్నారు. ఈ సినిమా హిట్‌ అయితే నిజంగానే బన్నీకి తన మార్కెట్‌, ఇమేజ్‌, క్రేజ్‌ పెరిగిపోతుంది. ఇంకా మెగా హీరో అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు.

స్వతహాగా ఆయన ఎదగొచ్చు, ఎక్స్ పోజ్‌ కావచ్చు. అదే ప్లాన్‌తో బన్నీ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని, అదే స్ట్రాటజీతో ఆయన వెళ్తున్నాడని, స్ట్రెయిట్‌గా చెప్పాలంటే `మెగా` నీడ నుంచి బయట పడాలనే ఉద్దేశ్యంతో అల్లు అర్జున్‌ ముందుకు సాగుతున్నాడని ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.
కానీ ఇప్పుడు పవన్‌, అల్లు అర్జున్‌ ల మధ్య వివాదం మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య గ్యాప్‌ని పెంచుతుందనేది విశ్లేషకులు చెప్పేమాట. మరి ఈ వివాదానికి ఎప్పుడు ఫుల్‌స్టాప్‌ పడుతుందో చూడాలి. 
 

click me!