పుష్ప 2 జోరుకు ‘బేబీ జాన్’ బేజారు!

First Published | Dec 27, 2024, 7:21 AM IST

పుష్ప 2 సినిమా విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమవుతుండగా, బేబీ జాన్ సినిమా మాత్రం పోటీ పడలేకపోయింది. క్రిస్మస్ రోజున విడుదలైన బేబీ జాన్, పుష్ప 2 ముందు నిలవలేకపోయింది.

Pushpa 2 , Baby John, Christmas Day

పుష్పరాజ్ కు భాక్సాఫీస్ దగ్గర ఎదురేలేకుండా పోయింది. ఈ సినిమాకి పోటీగా మరో పెద్ద  సినిమా ఇన్ని రోజులూ రిలీజ్ కాలేదు. అయితే పుష్ప- 2 రిలీజ్ అయిన మూడు వారాల తర్వాత థియేటర్లోకి వచ్చింది బేబీ జాన్. ఈ సినిమాకి మంచి బజ్ ,క్రేజ్ ఉంది. అయితే పుష్ప 2 ముందు నిలబడలేకపోయింది.

బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ నటించిన తాజా సినిమా బేబీ జాన్. ఇందులో సల్మాన్ ఖాన్ స్పెషల్ రోల్ చేశారు. అలాగే ఈ సినిమాతో కీర్తి సురేష్ హిందీ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. వామికా గబ్బి మరొక హీరోయిన్. దళపతి విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వం వహించిన తమిళ సినిమా తెరికీ హిందీ రీమేక్ ఇది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నా కలిసి రాలేదు. పుష్ప 2 ముందు నిలవలేకపోయాడు.

Pushpa 2 , Baby John, Christmas Day


'బేబీ జాన్' లో  లవ్, యాక్షన్, కామెడీ వంటి మాస్, కమర్షియల్ అంశాలు అన్ని ఉన్నాయి. ఈ మసాలా సినిమాలో కేరళ నేపథ్యం, ముంబై టచ్ ఇవ్వడం వల్ల నార్త్ ఆడియన్స్ కొత్తగా అనిపిస్తుందని భావించారు.  ‘బేబీ జాన్’ మూవీ డిసెంబర్ 25న రిలీజ్ అయింది.

అయితే ఇండియాలో ఈ సినిమా ఫస్డ్ డే కలెక్షన్స్ కేవలం రూ. 12 కోట్ల నెట్ మాత్రమే వచ్చినట్టుగా ట్రేడ్  చెప్తోంది. కానీ అదే రోజు కూడా పుష్ప రూ. 19 కోట్లకు పైగా నెట్ వసూలు చేసి షాక్ ఇచ్చింది. ఇందులో ఒక్క హిందీలోనే రూ.  15 కోట్లు వచ్చినట్టు అంచనా. 


shashi tharoor remembering former pm manmohan singh


 క్రిస్టమస్ హాలిడేలో స్ట్రైయిట్ హిందీ కొత్త సినిమా మంచి బజ్ తో  రిలీజ్ అయినా కూడా జనాలు పుష్ప2 మూవీ కే ఓటు వేశారు. పుష్ప2 చిత్రం 21వ రోజు కలెక్షన్స్ మొదటి రోజు బేబీ జాన్ మూవీ కలెక్షన్స్ కన్నా ఎక్కువగా ఉండటం చూసి బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు కూడా ఆశ్యర్యపోతున్నారు, సినిమా ఊపు చూస్తూ ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో బేబీ జాన్ ని ప్రక్కన పెట్టి పుష్ప 2  సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపే అవకాశం ఉందనే అనిపిస్తోంది.


వాస్తవానికి  పుష్పరాజ్ హవా తెలుగులో కంటే హిందీలోనే ఎక్కువగా ఉంది.  నార్త్‌లో పుష్ప 2 కు లాంగ్ రన్‌లో రూ. 800 కోట్లు ఈజీగా వస్తాయని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. అదే జరిగితే డబ్బింగ్ మూవీస్ పరంగా బిగ్గెస్ట్ రికార్డ్ ను అందుకున్న పుష్ప2 ఇప్పుడు బాలీవుడ్ మూవీస్ పరంగా ఆల్ టైం ఎపిక్ బెంచ్ మార్క్ ని సెట్ చేసినట్లే.


డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా 12 వేలకు పైగా థియేటర్లలో రిలీజ్ అయింది పుష్ప 2. మొదటి రోజు ఏకంగా రూ.  294 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక మొదటి ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్లు రాబట్టి  రెండు వారాల్లో రూ. 1500 కోట్లు, మూడు వారాల్లో రూ. 1700 కోట్లు వసూలు చేసింది. ఇందులో ఒక్క హిందీలోనే రూ. 700 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పటికీ హిందీలో పుష్పరాజ్ కుమ్మేస్తున్నాడు. దానికి నిదర్శనమే 21వ రోజు హిందీ కలెక్షన్స్ అని చెప్పాలి.
 

Latest Videos

click me!