ఎన్టీఆర్‌ని అమితాబ్‌ బచ్చన్‌తో పోల్చిన నాగార్జున.. ఆ కమాండ్‌ తెలుగులో ఏ హీరోకి లేదా?

First Published May 24, 2024, 2:56 PM IST

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ గురించి కింగ్‌ నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్‌ బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌తో పోల్చాడు. ఆ క్వాలిటీ ఎన్టీఆర్‌ ఒక్కడికే ఉందన్నాడు.  
 

నటనా సార్వభౌముడు నందమూరి తారక రామారావు మనవడిగా నందమూరి ఫ్యామిలీలో ఆయన తర్వాత  ఆ స్థాయి నటన ప్రదర్శించే నటుడిగా మెప్పిస్తున్నారు. `ఆర్‌ఆర్‌ఆర్‌`తో ఇండియన్‌ ఆడియన్స్ ని అలరించారు. పాన్‌ ఇండియా హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు మరో పాన్‌ ఇండియా మూవీ `దేవర`తో త్వరలో మన ముందుకు రాబోతున్నారు. 
 

NTR Nagarjuna

ఎన్టీఆర్‌ అంటే అద్భుతమైన నటుడు అంటారు. ఆయన డాన్స్ ల గురించి చెబుతారు. టాలీవుడ్‌ హీరోల్లో డాన్సుల్లో ఆయన్ని మించిన  వాళ్లు లేరంటారు. బన్నీ, రామ్‌ చరణ్‌లతో పోల్చితే ఓ మార్క్ ఎక్కువే  అంటారు. ఎక్స్‌ ప్రెషన్స్ పరంగానూ ఆయన తోపు అంటారు. కళ్లతోనే నటించడంలో కమల్‌ హాసన్‌ తర్వాత ఎన్టీఆర్‌కే సాధ్యమనే కంపేరిజన్‌ కూడా ఉంటుంది. 
 

ఎన్టీఆర్‌పై ప్రశంసలు కురిపించారు నాగార్జున. తన ఫేవరేట్‌ యాక్టర్‌ తెలుగులో ఎవరు అని అడిగిన ప్రశ్నలకు ఆయన ఎన్టీఆర్‌ అని చెప్పారు.  ఈ సందర్భంగా ప్రత్యేకంగా తారక్‌లో తనకు నచ్చే క్వాలిటీ ఏంటో తెలిపారు నాగ్‌. ఆ విషయంలో ఇండియన్‌ వన్‌ అండ్‌ ఓన్లీ  బిగ్‌ బీ  అమితాబ్‌ బచ్చన్‌తో పోల్చారు నాగార్జున. 
 

ప్రత్యేకంగా ఎన్టీఆర్‌లోని ఓ క్వాలిటీ గురించి మాట్లాడారు నాగ్‌. డైలాగ్‌ డిక్షన్‌ గురించి ప్రశంసలు కురిపించారు. డైలాగ్స్ చెప్పడంలో తనకు తానే సాటి అని చెప్పాడు. రెండు మూడు పేజీల డైలాగ్‌ కూడా అవలీలగా చెబుతాడని,  డైలాగ్‌ల్లో ఆ స్పష్టత, భావాన్ని, దాన్ని తీవ్రతని కూడా స్పష్టంగా పలికిస్తాడని తెలిపారు. 
 

డైలాగ్‌లతోనే సీన్లని రక్తికట్టించడం తనే సాధ్యమన్నారు. ఇది చాలా కొద్ది మంది నటులకే సాధ్యమన్నారు. బాలీవుడ్‌లో అమితాబ్‌ బచ్చక్‌కి, అలాగే ప్రకాష్‌ రాజ్‌ వంటి వారికే మాత్రమే  ఇది సాధ్యమవుతుందని, ఆ రేర్‌ క్వాలిటీ ఎన్టీఆర్‌లో ఉందని తెలిపారు నాగ్‌. అందుకే అతనంటే తనకు చాలా ఇష్టమని, ఫేవరేట్‌ యాక్టర్‌ అని తెలిపారు నాగ్‌. 

నాగార్జున ఈ సంక్రాంతికి `నా సామి రంగ` చిత్రంతో వచ్చాడు. చాలా  రోజుల తర్వాత  హిట్‌ కొట్టాడు. మళ్లీ అదే దర్శకుడు విజయ్‌ బిన్నితోనే మరో సినిమా చేస్తున్నాడు. అలాగే తమిళంలో ధనుష్‌తో కలిసి `కుబేరా`. అలాగే రజనీకాంత్‌తో `కూలీ` చిత్రంలో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. 

Latest Videos

click me!