శృతి హాసన్ నువ్వు కమిట్ అయ్యావా?... స్టార్ హీరోయిన్ మైండ్ బ్లోయింగ్ ఆన్సర్!

First Published May 24, 2024, 1:46 PM IST

శృతి హాసన్ ని ఓ నెటిజెన్ అడగకూడని ప్రశ్న అడిగారు. క్రేజీ హీరోయిన్ మొహమాటం లేకుండా సమాధానం చెప్పింది. శృతి హాసన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 
 

స్టార్ కిడ్ శృతి హాసన్ కెరీర్ బిగినింగ్ నుండి పలు ఎఫైర్ రూమర్స్ ఎదుర్కొంది. అధికారికంగా ఆమె మైఖేల్ కోర్స్లే తో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. లండన్ కి చెందిన మైఖేల్-శృతి కొన్నాళ్ళు ఘాడమైన ప్రేమలో మునిగి తేలారు. 

మైఖేల్ కోసం శృతి హాసన్ కెరీర్ కూడా వదిలేసింది. సినిమాలు చేయడకుండా లండన్ లో మకాం వేసింది. కెరీర్ పీక్స్ లో ఉండగా శృతి హాసన్ నిర్ణయం అందరికీ షాక్ ఇచ్చింది. మైఖేల్ ని కుటుంబ సభ్యులకు పరిచయం చేసింది. ఒకటి రెండుసార్లు చెన్నై కూడా వచ్చాడు. 

దాంతో మైఖేల్-శృతి పెళ్లి ఫిక్స్ అనుకున్నారు. అనూహ్యంగా 2019లో బ్రేకప్ చెప్పుకున్నారు. శృతి కొంత డిప్రెషన్ అనుభవించినట్లు సమాచారం. ఇండియాకు వచ్చి కెరీర్ పై ఫోకస్ పెట్టింది. టాలీవుడ్ ఆమెకు బ్రేక్ ఇచ్చింది. క్రాక్, వకీల్ సాబ్ చిత్ర విజయాలతో మరలా ఫార్మ్ లోకి వచ్చింది.

మరలా ముంబైకి చెందిన డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారిక తో ప్రేమలో పడింది. రెండేళ్లకు పైగా వీరు ప్రేమించుకుంటున్నారు. ముంబైలో వీరిద్దరూ ఒకే ఇంట్లో నివసిస్తున్నట్లు సమాచారం. శాంతను తో బహిర్గతంగా రిలేషన్ నడిపింది శృతి హాసన్. అతనితో ఉన్న ప్రతి మూమెంట్ ని సోషల్ మీడియాలో షేర్ చేసేది.

తాజాగా శాంతను ని సైతం ఆమె వదిలేసినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కొన్నాళ్లుగా శాంతను-శృతి హాసన్ కలిసి కనిపించడం లేదు. అలాగే శృతి హాసన్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుండి శాంతను తో ఉన్న ఫోటోలు తొలగించింది. దీంతో వీరి బంధం ముగిసిందన్న టాక్ వినిపిస్తుంది. 
 

కాగా శృతి హాసన్ సైతం దీనిపై క్లారిటీ ఇచ్చేసింది. ఆన్లైన్ లో అభిమానులతో చాట్ చేసిన శృతి హాసన్ ని ఓ వ్యక్తి 'మీరు సింగిలా లేక కమిటెడ్ నా?' అని అడిగాడు. 'ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నేను ఇష్టపడను. కానీ చెబుతాను. నేను ప్రస్తుతం సింగిల్. మింగిల్ కావడానికి ఎప్పుడూ సిద్ధం. నేను నా వర్క్ ఎంజాయ్ చేస్తున్నాను. హ్యాపీగా బ్రతికేస్తున్నాను' అని సమాధానం చెప్పింది. శృతి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

Shruti Haasan

ఇక శృతి హాసన్ కెరీర్ పరిశీలిస్తే... సలార్ 2లో ఆమె నటిస్తుంది. అలాగే అడివి శేష్ కి జంటగా డెకాయిట్ టైటిల్ తో ఒక థ్రిల్లర్ చేస్తుంది. ఈ చిత్ర టైటిల్ టీజర్ మెప్పించింది. గత ఏడాది శృతి హాసన్ నటించిన వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, సలార్ చిత్రాలు విజయాలు సాధించాయి. 

click me!