మణింకఠలో మరో షేడ్ చూపించిన నాగార్జున, నిఖిల్, పృధ్వీ సెల్ఫ్ గోల్..?

First Published | Oct 12, 2024, 11:21 PM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో మరో వీకెండ్ వచ్చేసింది. ఇక వీకెండ్ లో భాగంగా నాగార్జున ఇవ్వాల్సిన క్లాస్ ఇచ్చిపడేశాడు. ఈక్రమంలోనే ఎవరెవరికి క్లాస్ పడింది.. ఎవరిని నాగ్ మెచ్చుకున్నారంటే..? 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో హోరా హోరీ టాస్క్ లు జరుగుతున్ననేపథ్యంలో .. మరో వీకెండ్ రానే వచ్చింది. ఇక ఈసారి నాగార్జున వచ్చి ఏంచెపుతారా అని అంతా ఎదురుచూసిన టైమ్ లోకింగ్ రానే వచ్చాడు.

ఎవరికి ఇవ్వాల్సింది వారికి ఇచ్చాడు.  రేజింగ్, ఫాలింగ్ అని రెండు లిస్ట్ లు పెట్టుకున్నారు. అందులో రేజింగ్ లిస్ట్ లోకి మణికంఠ, హరితేజ, గంగవ్వ, మెహబూబ్. యష్మిలను చేర్చాడు. 

మణింకఠ ఆటతీరుఅద్భుతం అని.. ఈ వారం ఒక్క సారి కూడా ఎమోషనల్ అవ్వలేదన్నారు. ఇక అతనికి ఇచ్చినటిష్యూ బండిల్ ను తీసుకు రమ్మని.. అది మెగా చీఫ్ మెహబూబ్ కు ఇచ్చాడు.

అంతే కాదు మరో షాకింగ్ విషయం ఏంటంటే.. మణికంఠలో అద్భుతమైన పెర్ఫార్మర్ ఈ వారం బయటకు వచ్చాడని చెప్పి వీడియో కూడా వేసి చూపించాడు నాగార్జున. 
 

ఇది ఇలానే కొనసాగాలి.. మరోసారి మరో కొత్త మణికంఠ రావద్దు అని చెప్పి నాగార్జున చెప్పారు. ఇక పృధ్వీ, నిఖిల్.. తమ ఆటతీరు బాలేదని తమను తామే సెల్ఫ్ గా ఫాలింగ్ లిస్ట్ లో ఫోటో పెట్టించారు.

ఇక నబిల్ ఆటతీరు తగ్గిందని క్లాస్ పీకారు కింగ్. ప్రేరణకు కూడా ఇవ్వాల్సిన క్లారిటీ ఇచ్చాడు. అటు విష్ణు ప్రియ ను నామినేషన్స్ లో ఉంచింది ఎందుకు.. అనేది గుర్తించాలని.. తన కోసం తాను ఆడాలని నాగ్ చెప్పారు. 


ఇక గంగవ్వను పలకరించాలి కాబట్టి ఏదో అనేసి నవ్వించి వదిలేశారు. ఇక అవినాశ్ , రోహిణీ.. మధ్య కామెడీ బాగా పండింది. హౌస్ ను కాస్త నవ్వుల్లో ముంచి తేల్చారు. అటు గౌతమ్ కు మాత్రం గట్టిగా క్లాస్ పడింది. మైక్ విసిరి కొట్టడంతో పాటు..టాస్క్ ల విషయంలో కూడా మాటలు పడ్డాడు గౌతమ్.  

ఇక అందరికి క్లాస్ పడిన తరువాత హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్లిపోవాలి అని మీరు అనుకుంటున్నారు అని రెండు క్లాన్ ల సభ్యులు.. ఎదురెదురు కూతర్చోబెట్టి గేమ్ ఆడారు. ఇక అందులో ఎక్కవ మంది గౌతమ్ కృష్ణ, టేస్టి తేజ,  పృధ్వీల పేర్లు ఉన్నాయి. 

ఇక ఏం చేయాలి అనేది మాత్రం బిగ్ బాస్ చెపుతారని నాగార్జున అన్నారు. సో ఏం జరుగుతుంది ఏంటో తరువాత ఎపిసోడ్ లో తెలుస్తోంది. ఇక వీకెండ్ ఎపిసోడ్ సండే ఎపిసోడ్ లో దరసరా ఉత్సవాలు అదరిపోయేలా చేశారు.

Latest Videos

click me!