కింగ్ నాగార్జున కెరీర్ బెస్ట్ చిత్రాల లిస్టులో మన్మథుడు చిత్రం తప్పకుండా ఉంటుంది. ఈ చిత్రం కె విజయభాస్కర్ దర్శకత్వం లో, త్రివిక్రమ్ రచనలో రూపొందింది. మన్మథుడు చిత్రాన్ని నాగార్జున స్వయంగా తన అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించారు. నాగార్జున కెరీర్ లోనే మన్మథుడు చిత్రం ఒక క్లాసిక్ మూవీగా నిలిచిపోయింది.
25
మన్మథుడు చిత్రంలో అలరించిన అంశాలు
ఈ చిత్రంలో నాగార్జునకి జోడిగా సోనాలి బింద్రే, అన్షు అంబానీ నటించారు. టైటిల్ కి తగ్గట్లుగానే ఈ చిత్రంలో నాగార్జున మన్మథుడిలా కనిపించారు. హీరోయిన్లతో నాగార్జున కెమిస్ట్రీ, కామెడీ సన్నివేశాలు, దేవి శ్రీ సంగీతం, త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ ఇలా ప్రతి ఒక్క అంశం ఈ చిత్రాన్ని మరో స్థాయిలో నిలబెట్టాయి. ఆడవాళ్లు అంటే ఇష్టం లేని మేనేజర్ పాత్రలో నాగార్జున నటన భలే గమ్మత్తుగా ఉంటుంది.
35
మన్మథుడు అసలు హిట్ సినిమానే కాదు
మన్మథుడు చిత్రం బ్లాక్ బస్టర్ మూవీ అని ఆడియన్స్ ఇప్పటివరకు అనుకుంటూ వచ్చారు. కానీ నాగార్జున ఓ ఇంటర్వ్యూలో అసలు మన్మథుడు మూవీ హిట్ సినిమానే కాదు అంటూ బాంబు పేల్చారు. నాగార్జున నుంచి ఇది షాకింగ్ స్టేట్మెంట్ అనేది చెప్పాలి. ఓ ఇంటర్వ్యూలో యాంకర్ మాట్లాడుతూ మన్మథుడు లాంటి బ్లాక్ బస్టర్ చిత్రానికి సీక్వెల్ గా మన్మథుడు 2 చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది అని ప్రశ్నించారు.
నాగార్జున స్పందిస్తూ.. ఫస్ట్ మీ స్టేట్మెంట్ ని కరెక్ట్ చేయాలనుకుంటున్నా. మన్మథుడు మూవీ అసలు హిట్ సినిమా కాదు. థియేటర్లలో రిలీజ్ అయినప్పుడు అది ఒక అబౌ యావరేజ్ చిత్రం మాత్రమే. కానీ కొన్నేళ్ల పాటు ఆ చిత్రం టీవీలో టెలికాస్ట్ అయిన తర్వాత ఆడియన్స్ కి ఇంకా విపరీతంగా నచ్చేసింది, దీంతో ఆడియన్స్ ఆ మూవీ బ్లాక్ బస్టర్ సినిమా అని మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు.
55
ఆ లెక్కలు నాకే బాగా తెలుసు
వాస్తవానికి రెవెన్యూ పరంగా మన్మథుడు చిత్రం సూపర్ హిట్ కాలేదు. ఆ చిత్రానికి నేనే నిర్మాతను కాబట్టి ఆ లెక్కలు నాకే బాగా తెలుసు అని సంచలనం వ్యాఖ్యలు చేశారు. మన్మథుడు కంటే ముందుగా వచ్చిన సంతోషం చిత్రం వసూళ్ల పరంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందని నాగార్జున తెలిపారు.