బీర్లు, నాటుకోడి.. ఆ ఒక్క రోజు ఫుల్లుగా ఎంజాయ్‌.. `శిరిడి సాయి` సినిమా వెనక అసలు కథ చెప్పిన నాగార్జున

First Published Mar 26, 2024, 6:14 PM IST

నాగార్జున తన ఫుడ్‌ సీక్రెట్‌ని బయటపెట్టాడు. ఆయన వారంలో ఒక్కరోజు అన్ని నియమాలను బ్రేక్‌ చేస్తాడట. అన్ని మర్చిపోయి ఎంజాయ్‌ చేస్తాడట. 
 

నాగార్జున.. టాలీవుడ్‌ మన్మథుడిగా పిలుస్తుంటారు. ఆయన అంతగా రొమాంటిక్‌ లవ్‌ స్టోరీస్ ని పండించాడు. వెండితెరపై రక్తికట్టించాడు. యాక్షన్‌ సినిమాలతోనూ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ తోనూ మెప్పించాడు. సూపర్‌ హిట్లు అందుకున్నాడు. వీటికి భిన్నంగా మరికొన్ని సినిమాలు చేసి మెప్పించాడు. అవే ఆథ్యాత్మిక మూవీస్‌. 

రొమాన్స్ కి కింగ్‌ అనిపించుకున్న నాగార్జున.. `అన్నమయ్య`, `శ్రీరామదాసు`, `శిరిడి సాయి` వంటి ఆథ్యాత్మిక చిత్రాలు చేసి మెప్పించాడు. ఆడియెన్స్ ని అలరించారు. నాగార్జున ఇలా కూడా మెప్పించగలడా అని అంతా ఆశ్చర్యపోయారు. నాగ్‌లోని విలక్షణ నటనకి ఫిదా అయ్యారు. అదే సమయంలో ఆయా చిత్రాలకు బ్రహ్మరథం పట్టారు ఆడియెన్స్. 
 

ఇదిలా ఉంటే `అన్నమయ్య`, `శ్రీరామదాసు` వంటి సినిమాల అనంతరం దర్శకుడు కె రాఘవేంద్రరావు `ఇంటింట అన్నమయ్య` మూవీని తెరకెక్కించాలని భావించారట. ఈ విషయాన్ని నాగార్జునకి చెప్పారట. మరి దాన్నుంచి `శిరిడిసాయి` ఎలా వచ్చింది, ఆ సినిమా ఏమైంది అనే విషయాలను నాగార్జున వెల్లడించారు. `ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే` టాక్‌ షోలో అసలు కథ వివరించారు. 
 

`అన్నమయ్య`, శ్రీరామదాసు` చిత్రాలు పెద్ద హిట్‌ కావడంతో కొంత గ్యాప్‌ తర్వాత రాఘవేంద్రరావు ఇంటింట అన్నమయ్య కథతో వచ్చారట. కానీ అది చేయడం నాగార్జునకి నచ్చలేదు. `అన్నమయ్య` లాంటి గొప్ప సినిమాని తీసి మళ్లీ ఇంటింట అన్నమయ్య ఏంటి, అలా చేస్తే దాన్ని క్యాష్‌ చేసుకోవడానికే తీశారని అంతా అనుకుంటారని తనకు అనిపించిందట. కానీ ఆ విషయం చెప్పలేకపోయాడట నాగ్‌. 
 

Bigg Boss Telugu 7

రాఘవేంద్రరావు శిరిడి సాయిబాబా భక్తుడు. నేను అప్పటి వరకు శిరిడి సాయిని కలవలేదు. ఆ విషయం తనకు గుర్తొచ్చిందట. ఇంటింట అన్నమయ్యని తప్పించుకోవడం కోసం.. మీరు శిరిడి సాయి భక్తులు కదా, ఆయనపై సినిమా చేయాలని అనిపించలేదా అని అడిగాడట నాగ్‌. అయితే ఆ సమయంలో నాగ్‌కి ఓ అలవాటు ఉండేదట. సోమవారం నుంచి శనివారం వరకు చాలా పరిమితంగా భోజనం తింటాడట. ఆల్కహాల్‌గానీ, నాన్‌ వెజ్‌ విషయాలో చాలా స్టిక్ట్ గా ఉండేవాడట. కానీ ఆదివారం మాత్రం అన్ని వదిలేసి హాయిగా, కడుపునిండా భోజనం చేసేవాడట. 

నాటుకోడి కూర తెప్పించుకుని, బీర్లు తాగుతూ, ఫ్రెండ్స్ తో ఎంజాయ్‌ చేసేవాడట. అలా పార్టీ చేసుకునే సమయంలో శిరిడిసాయిబాబా టెంపుల్‌కి వెళ్లాలనే ఆలోచన వచ్చిందట. దీంతో వెంటనే నెక్ట్స్ డే నే శిరిడి సాయి టెంపుల్‌కి వెళ్లి వచ్చాడట. అయితే అక్కడ టెంపుల్‌ వద్ద ఉండటానికి ఫ్రెండ్స్ ని అడగ్గా ఏఎంఆర్‌(మహేష్‌ రెడ్డి) ఇంట్లో ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. 
 

శిరిడిని దర్శించుకుని వచ్చాక రాఘవేంద్రరావు కలిశారు. వెంటనే సినిమా చేస్తున్నామని తెలిపారు. అదే సినిమాతో తనకు వసతి ఏర్పాటు చేసిన మహేష్‌ రెడ్డి నిర్మాతగా మారాడు. ఇదంతా యాదృశ్చికంగా జరిగింది. అయితే అది సాయిబాబా వల్లే అయ్యిందేమో అని వెల్లడించారు నాగ్‌. 2012లో విడుదలైన ఈ మూవీ యావరేజ్‌గా ఆడింది.
 

అయితే ఈ సందర్భంగా ఓ ఇంట్రెస్టింగ్‌ విషయాన్ని వెల్లడించారు నాగ్‌. తాను ఆదివారం మాత్రమే బీర్లు, నాన్‌ వెజ్‌ కడుపునిండా తింటాననే సీక్రెట్‌ని వెల్లడించడం విశేషం. ఫుడ్‌ విషయంలో చాలా నియమాలు పాటిస్తారు నాగ్‌. కానీ ఆ రోజు మాత్రం నచ్చినట్టుగా తింటాడట, బాగా ఎంజాయ్‌ చేస్తాడట.  ఇదిప్పుడు ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేస్తుంది. 

click me!