Prithviraj Sukumaran : ప్రభాస్ ఉన్నాడని ‘సలార్’ చేయలేదు.. పృథ్వీరాజ్ సుకుమారన్ షాకింగ్ కామెంట్స్..

Published : Mar 26, 2024, 05:40 PM IST

‘సలార్’ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రభాస్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట ఆసక్తికరంగా మారాయి.

PREV
16
Prithviraj Sukumaran : ప్రభాస్ ఉన్నాడని ‘సలార్’ చేయలేదు.. పృథ్వీరాజ్ సుకుమారన్ షాకింగ్ కామెంట్స్..

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ‘సలార్’ చిత్రంతో తెలుగు ఆడియెన్స్ లోనూ మంచి గుర్తింపు దక్కించుకున్నారు. ప్రభాస్ (Prabhas)కి స్నేహితుడి పాత్రలో మెప్పించారు.

26

‘సలార్ సీజ్ ఫైర్’ (Salaar : Cease Fire) చిత్రంతో పృథ్వీరాజ్ సుకుమారన్ ఆడియెన్స్ లో క్రేజ్ దక్కించుకున్నారు. ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సమానంగా ఈయన్ని చూపించిన విషయం తెలిసిందే.

36

అయితే పృథ్వీరాజ్ సుకుమారన్ తాజాగా ‘ది గోట్ లైఫ్’ The Goat Life)  అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సందర్బంగా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

46

ఈ సందర్భంగా తాజాగా ఆయన ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రభాస్, టాలీవుడ్ లో మరో మల్టీస్టారర్ పై ఆసక్తికరంగా కామెంట్స్ చేశారు. ఇంటర్వ్యూయర్ అడిగిన ప్రశ్నకు ఇలా బదులిచ్చారు.

56

‘మరో మల్టీస్టారర్ చేయాల్సి వస్తే నేను హీరోను చూసి చేయను.. ‘సలార్’ విషయంలోనూ ప్రభాస్, ప్రశాంత్ నీల్, పెద్ద ప్రాజెక్ట్ అని కాదు.. స్క్రిప్ట్ ఏంటనేది తప్పకుండా చూస్తాను. దానికే ప్రాధాన్యత ఇస్తాను.’ అంటూ చెప్పుకొచ్చారు.

66

అనంతరం ఆయన నటించిన సినిమా గురించి మాట్లాడారు. నిజ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమాగా చెప్పుకొచ్చారు. ఇక పృథ్వీరాజ్ కూడా మలయాళంలో స్టార్ హీరోగా ఎదిగారు.. ఆయన వ్యక్తిత్వంతోనూ ఎందరినో అభిమానులుగా మార్చుకున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories