రామ్‌ చరణ్‌ చేతిలో చలం పుస్తకం.. `గేమ్‌ ఛేంజర్‌`లో దాని కథేంటి?.. శంకర్‌ అలా వాడేశాడా?

Published : Mar 26, 2024, 04:15 PM IST

రామ్‌ చరణ్‌ నటిస్తున్న `గేమ్‌ ఛేంజర్‌` మూవీ నుంచి కొత్త పోస్టర్‌ వచ్చింది. ఇందులో చరణ్‌ తన చేతిలో చలం పుస్తకం పట్టుకుని కనిపించాడు. దీని వెనుక కథ ఇంట్రెస్ట్‌ ని క్రియేట్‌ చేస్తుంది.  

PREV
17
రామ్‌ చరణ్‌ చేతిలో చలం పుస్తకం.. `గేమ్‌ ఛేంజర్‌`లో దాని కథేంటి?.. శంకర్‌ అలా వాడేశాడా?

 మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ నటిస్తున్న `గేమ్‌ ఛేంజర్‌` మూవీ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. ఈ మూవీ నుంచి కొత్త అప్‌డేట్లు రావడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. రేపు చరణ్‌ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి `జరగండి` అనే పాటని విడుదల చేయబోతున్నారు. `మగధీర` సినిమా రీ రిలీజ్‌ ఉండగా, ఆ మూవీతోపాటు `జరగండి` పాటని విడుదల చేయబోతున్నారట. అలాగే ఇందులోని రామ్‌చరణ్‌ పాత్రకి సంబంధించిన మరో ఫస్ట్ లుక్‌ కూడా రాబోతున్నట్టు తెలుస్తుంది. 

27

ఇదిలా ఉంటే తాజాగా `జరగండి` సాంగ్‌కి సంబంధించిన కొత్త పోస్టర్‌ విడుదల చేశారు. వెనకాల కలర్‌ఫుల్‌గా ఇళ్లు కనిపిస్తున్నాయి. విజువల్‌ వండర్‌లా ఉంది. రామ్‌చరణ్‌ జాతర లాంటి సందడి మధ్య నడుస్తూ వస్తున్నాడు. వాయిలెట్‌ కలర్‌ డ్రెస్‌ ధరించారు. మెడలో చైన్‌ ఉంది. కొంత క్లాస్‌, మరికొంత మాస్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు రామ్‌ చరణ్‌. అయితే చేతిలో ఓ పుస్తకం ఉంది. అదేంటనేది ఆసక్తికరంగా మారింది. 
 

37

రామ్‌ చరణ్‌ చేతిలో ఉన్న పుస్తకం పేరు `ప్రేమ లేఖలు`, అది చలం రాసిన పుస్తకం కావడం విశేషం. మరి ఆ పుస్తకం రామ్‌ చరణ్‌ చేతిలో ఎందుకు ఉంది? దానికి `గేమ్‌ ఛేంజర్‌`కి లింకేంటనేది ఆరా తీస్తున్నారు ఫ్యాన్స్. చలం రాసిన ఈ పుస్తకం ప్రేమ కథలకు సంబంధించింది. ప్రేమికుడు తన ముందే ఉన్నట్టు, ప్రేమికుడికి తన మనసులో మాటలు చెబుతున్నట్టుగా ఊహించుకుంటూ రాసే ప్రేమ లేఖలే ఈ పుస్తకం. హృదయాన్ని హత్తుకునేలా ఉంటుంది. ప్రేమ లేఖల్లోనూ డెప్త్ ని, అసలా అమ్మాయిలు ప్రేమ లేఖలు ఎలా రాయలి అనే అంశాల సమాహారంగా దీన్ని చలం రాశారు. 
 

47

ఈ `ప్రేమ లేఖలు` పుస్తకం సినిమాకి సంబంధం ఏంటనేది చూస్తే, హీరోయిన్‌తో లవ్‌ ట్రాక్‌ సమయంలోనే ఆయన ఈ పుస్తకాన్ని ఉపయోగించినట్టు తెలుస్తుంది. `జరగండి` అనే పాట హీరోయిన్‌తో చరణ్‌ తన ప్రేమని వ్యక్తం చేసే సందర్భంలోనే వస్తుందని తెలుస్తుంది. అందుకే ఈ పుస్తకాన్ని శంకర్‌ ఉపయోగించాడా అనే సందేహం కలుగుతుంది. అయితే `గేమ్‌ ఛేంజర్‌` పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ అందులో లవ్‌ స్టోరీకి ఇంత స్కోప్‌ ఉందా అనేది అనుమానంగా, ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మరి దాన్ని ఎలా ఉపయోగించారనేది మాత్రం నిమా చూస్తే గానీ తెలియదు.

57

`గేమ్‌ ఛేంజర్‌` కథకి సంబంధించిన ఓ లీకేజీ చాలా రోజులుగా వినిపిస్తుంది. ఇందులో చరణ్‌ రెండు పాత్రల్లో కనిపించబోతున్నారు. అప్పన్నగా, రామ్‌ నందన్‌గా కనిపిస్తారట. అప్పన్న ప్రజల కోసం ఓ పార్టీని స్థాపించిన వ్యక్తి, తన మంచితనంతో పార్టీని ముందుకు తీసుకెళ్తుండగా, తన పార్టనర్‌ అయిన శ్రీకాంత్‌ దొంగ దెబ్బ తీసి ఆ పార్టీని తనవశం చేసుకుంటాడని, తన కొడుకు ఎస్‌ జే సూర్య దాన్ని లీడ్‌ చేస్తుంటాడని, అతనికి తమ్ముడు నవీన్‌ చంద్ర అరాచకాలకు పాల్పడుతుంటాడని తెలుస్తుంది.

67

ఐఏఎస్‌ అయిన రామ్‌ నందన్‌కి తర్వాత ఈ విషయాలు తెలుస్తాయి. దీంతో ప్రత్యర్థులను అంతం చేసి వారి నుంచి పార్టీని ఎలా స్వాధీనం చేసుకున్నాడు, సమాజంలోని చెడుని ఎలా అంతం చేశాడనేది ఈ చిత్ర కథగా ఉంటుందని తెలుస్తుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.

77

ఇక శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రామ్‌ చరణ్‌తోపాటు శ్రీకాంత్‌, ఎస్‌ జేసూర్య, నవీన్‌ చంద్ర, సునీల్‌, జయరాం, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది. దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ మూవీని ఈ ఏడాది చివర్లో విడుదల చేయబోతున్నట్టు సమాచారం. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories