
Nagarjuna-ANR: ఏఎన్నార్(అక్కినేని నాగేశ్వరరావు) తెలుగు సినిమా పరిశ్రమకి రెండు కళ్లలో ఓ కన్నుగా వెలిగారు. తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌లో అభివృద్ధి కావడానికి ప్రధాన కారకులు. లెజెండరీ నటుడు. ప్రేమ కథలకు కేరాఫ్. తెలుగు చిత్ర పరిశ్రమకు డాన్సులు పరిచయం చేసిన నటుడు.
తన సినిమాలతో ఎన్నో అద్భుతాలు చేసిన వ్యక్తి. చిత్ర పరిశ్రమకి ఎంతో సేవ చేశారు. ఆయనకు సంబంధించిన చివరి రోజులు తలచుకుని కన్నీళ్లు పెట్టించారు నాగార్జున. ఆ కథేంటో చూద్దాం.
ఏఎన్నార్ క్యాన్సర్‌తో మరణించిన విషయం తెలిసిందే. చాలా రోజులు క్యాన్సర్‌తో పోరాడి ఆయన 2014 జనవరి 22న తుదిశ్వాస విడిచారు. ఆయన నటించిన చివరి చిత్రం `మనం`. అక్కినేని కుటుంబానికే కాదు, తెలుగు ఆడియెన్స్ కి కూడా ఈ మూవీ చాలా స్పెషల్.
ఎందుకంటే ఇందులో అక్కినేని హీరోలు కలిసి నటించారు. ఏఎన్నార్, నాగార్జున, నాగచైతన్య, అఖిల్ కనిపించారు. అలాగే సమంత కూడా హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. అక్కినేని ఫ్యామిలీలో ఈ మూవీ ఎవర్‌గ్రీన్ అని చెప్పాలి.
అక్కినేని నాగేశ్వరరావు `మనం` సినిమా షూటింగ్‌లో ఉన్నప్పుడే ఆయనకు క్యాన్సర్ ఆపరేషన్ జరిగింది. ఆయనకు పొట్ట క్యాన్సర్ వచ్చింది. `మనం` షూటింగ్ జరుగుతున్నప్పుడు సడెన్‌గా పడిపోయాడట. ఆసుపత్రికి తీసుకెళ్లగా, పొట్టలో ట్యూమర్‌ని గుర్తించారు, రెండేళ్లుగా అది పెరుగుతుందట.
ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. తెల్లవారు జామున మూడు గంటలకు ఆపరేషన్ చేశారట. నాగార్జునకి ఏం చేయాలో అర్థం కాలేదు, దీంతో ఆ బాధ భరించలేక పంజాగుట్టలోనే సాయిబాబు టెంపుల్ లో కూర్చున్నాడట. ఆ రాత్రి మొత్తం అక్కడే ఉన్నాడట నాగార్జున.
read more: Bigg Boss Telugu 9: గత సీజన్ దెబ్బకి కీలక మార్పులు, ఈ సారి వారికే ప్రయారిటీ ?
తెల్లవారు జామున ఆరు గంటలకు తనకు ఫోన్ వచ్చిందట. సేఫ్‌గా ఉన్నాడు, ఆపరేషన్ కంప్లీట్ అయ్యిందని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆ రోజు సాయంత్రం ఏఎన్నార్ కళ్లు తెరిచారు. నాగ్‌తో మాట్లాడారు. ఏమైందని చెప్పగా, అంతా ఓకే నాన్న, ఆపరేషన్ చేసి క్యాన్సర్ తీసేశారు అని చెప్పాడట.
నీ కళ్లు అబద్దం చెబుతున్నాయని అడగా, చాలా వరకు తీసేశారు, కానీ కొంత క్యాన్సర్ ఉంది, దానిపై ఫైట్ చేయాల్సి ఉంది అని చెప్పాడట నాగ్. వెంటనే దానికి ఏఎన్నార్ రియాక్ట్ అవుతూ, అయితే నేను సినిమా కంప్లీట్ చేయోచ్చు కదా అన్నాడట. ఆ మాటలకు నాగ్ కన్నీళ్లు ఆగలేదట.
ఆ తర్వాత కోలుకుని షూటింగ్‌లోకి వచ్చారట. ఆ సమయంలో లాస్ట్ సీన్ చిత్రీకరించారట. అదే కారులో నుంచి తొంగిచూసే సీన్. ఆ ఎవర్ గ్రీన్ సీన్ ఆ తర్వాతనే చిత్రీకరించామని, అందులో ఆయన నవ్వుతూ ఇచ్చిన లుక్ ఎవర్ గ్రీన్ అని, అది చూస్తే ఇప్పటికీ ఆయన బతికే ఉన్నారనిపిస్తుందని చెబుతూ ఎమోషనల్ అయ్యారు నాగ్.
ప్రదీప్‌తో `కొంచెం టచ్ లో ఉంటే చెబుతా`షోలో ఈ విషయాన్ని నాగ్ వెల్లడించారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. ఏఎన్నార్ ఆ ఆపరేషన్ తర్వాత కొన్ని రోజులకే చనిపోయారు. `మనం` రిలీజ్ కాకముందే ఆయన తుదిశ్వాస విడిచారు. ఇక నాగార్జున ప్రస్తుతం `కుబేరా`, `కూలీ` చిత్రాలు చేస్తున్నారు. సోలో హీరోగా ఇంకా మరే సినిమాని ప్రకటించలేదు.
also read: చిరంజీవి తండ్రి చివరగా చూసిన సినిమా ఎవరిదో తెలుసా? నానమ్మలో ఉన్న కొంటెతనం బయటపెట్టిన రామ్ చరణ్