ఇంటి సభ్యుల నిజస్వరూపాలు బయటపెట్టిన నాగార్జున.. బిగ్‌ బాస్‌ హౌజ్‌లో గాడిదలు, పాములు, ఊసరవెళ్లిలు వీరే !

First Published Sep 25, 2022, 11:34 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 6 రియాలిటీ షో 21వ రోజు కి చేరుకుంది. మూడు వారాలు పూర్తి చేసుకుంటోంది. ఆదివారం ఎపిసోడ్‌ ఇంటి సభ్యుల నిజస్వరూపాలు బయటపెట్టించారు హోస్ట్ నాగార్జున. 
 

బిగ్‌ బాస్‌ 6 తెలుగు షో మూడో వారం ఇంటి సభ్యుల మనస్థత్వాలు ఎలాంటివో చెప్పించే ప్రయత్నం చేశాడు నాగార్జున. ఇందులో ఇంటి సభ్యులకు టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో మొదట `సుత్తిదెబ్బ` పేరుతో ఓ టాస్క్ ఇచ్చాడు. ఈ గేమ్‌ ప్రకారం ఇంటి సభ్యుల మనస్థత్వాలు చెప్పాల్సి ఉంటుంది. వారి చెప్పిన అభిప్రాయంతో హౌజ్‌లోని ఆడియెన్స్ సైతం తమ ఒపీనియన్‌ చెబుతారు. రెండూ మ్యాచ్‌ అయితేనే అది నిజంగా లేదంటే తప్పుగా పరిగణిస్తారు. దీంతో రివర్స్ చెప్పిన హౌజ్‌మేట్‌కే సుత్తితో దెబ్బ కొట్టాల్సి ఉంటుంది. 
 

ఇందులో గీతూకి నోటి దూల అనే ట్యాగ్‌ ఇచ్చారు. దీనికి ఆడియెన్స్ కూడా ఒప్పుకోవడం విశేషం. దీంతో ఇంట్లో గలాటా గీతూ నోటి దూల ఎక్కువ అనే విషయాన్ని నాగ్‌ సైతం తేల్చి చెప్పారు. ఆ తర్వాత శ్రీ సత్య కి హార్ట్ లేదని అంటారు. మరోవైపు యూజ్‌లెస్‌, బిట్టర్‌ పర్సన్‌ అనే ట్యాగ్‌లకు ఇనయ ఎంపిక కావడం విశేషం. మిగిలినవన్నీ తప్పుగా తేలిపోయాయి. 

ఇందులో మరో టాస్క్ ఇచ్చాడు నాగార్జున. కొన్ని జంతువుల ట్యాగ్‌ లు పెట్టి, వాటిలో ఎవరికి ఏది సెట్‌ అవుతుందో వారికి వేయాల్సి ఉంటుంది. వీటిలో పాము, గాడిద, ఊసరవెల్లి, ఏనుగు, సింహం వంటి జంతువుల ట్యాగులున్నాయి. వీటితో ఇంటి సభ్యుల అసలు స్వరూపాన్ని బయటపెట్టించారు. ఇందులో రేవంత్‌కి గాడిద ట్యాగ్‌ వేశాడు చంటి. గాడిదలా పనిచేస్తాడని, కానీ వెనకా ముందు ఆలోచించడని చెప్పాడు. అలాగే కీర్తికి గాడిత ట్యాగ్‌లను ఆరోహి, శ్రీ సత్య ఇచ్చారు. వీరితోపాటు అర్జున్‌కి రాజ్‌, సుదీపకి, అర్జున్‌ గాడిద ట్యాగ్‌లిచ్చారు. 

మరోవైపు ఆరోహి, ఇనయ, శ్రీసత్యలకు పాము ట్యాగ్ లు వచ్చాయి. ఆరోహికి రేవంత్‌, ఇనయకి శ్రీహాన్‌, శ్రీ సత్యకి ఆదిరెడ్డి పాము ట్యాగులిచ్చారు. వీరి మంచి వారుగా ఉంటారని, టైమ్‌ వచ్చినప్పుడు కాటు వేస్తారని తెలిపారు. గీతూ, ఇనయ, శ్రీహాన్‌, నేహాలకు ఊసరవెల్లి ట్యాగ్లు పడ్డాయి. గీతూకి నేహా, నేహాకి గీతూ, ఇనయకి కీర్తి, శ్రీహాన్‌కి ఇనయ ఊసరవెళ్లి ట్యాగ్‌లను ఇచ్చారు. ముందు ఒకలా ఉండి, తర్వాత మరోలా మారిపోతారని తెలిపారు.

వీరితోపాటు గీతూ, చంటి, రేవంత్‌లకు సింహం ట్యాగ్‌లు దక్కాయి. గీతూకి సూర్య, చంటికి ఫైమా, రేవంత్‌కి వసంతి సింహం ట్యాగ్‌లిచ్చారు. ఏనుగు ట్యాగులు ఆదిరెడ్డి, మరీనా, బాలాదిత్యలకు దక్కాయి. ఆదిరెడ్డికి బాలాదిత్య, మరీనాకి సుదీప, బాలాదిత్యకి మరీనా ఈ ట్యాగులిచ్చి ప్రశంసలు కురిపించారు. 
 

దీంతోపాటు మరో టాస్క్ ఇచ్చాడు నాగార్జున. గార్డెన్‌లో ఉన్న ఓ ఫోటోని చూసి అది ఎవరిదో హవభావాలతో చెప్పాల్సింది ఉంటుంది. దాన్నీ ఆ టీమ్‌ వాళ్లు గ్రహించి పేరు గెస్‌ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఏ, బీ టీములుగా హౌజ్‌ మేట్స్ ని విభజించారు. ఏ లో రేవంత్‌, శ్రీసత్య, సూర్య, చంటి, కీర్తి, ఇనయ, వసంతి, ఆది రెడ్డిలుండగా, బీ గ్రూప్‌లో సుదీప, బాలాదిత్య, రాజ్‌, ఆరోహి, మరీనా, నేహా, ఫైమా, అర్జున్‌, గీతూ ఉన్నారు. వీరిలో బీ గ్రూప్‌ మూడు చెప్పి విన్నర్‌గా నిలిచింది. అందులో రెండు కరెక్ట్ గా చెప్పిన బాలాదిత్యకి వీక్‌ బెస్ట్ కంటెస్టెంట్‌ గిఫ్ట్ లభించింది.
 

click me!