నవ్వు వెనక కన్నీళ్లు.. అన్నీ తానైనా నాన్న చనిపోవడంతో ఒంటరైన జబర్దస్త్ కమెడియన్‌.. స్టేజ్‌పై కన్నీరు మున్నీరు..

Published : Sep 25, 2022, 08:35 PM ISTUpdated : Sep 25, 2022, 09:28 PM IST

`జబర్దస్త్` కామెడీ షో ఎంతో మందికి లైఫ్‌ ఇచ్చింది. టాలెంట్ ఉన్న వాళ్లు కమెడియన్లుగా గుర్తింపు తెచ్చుకుని నవ్విస్తున్నారు. వారిలో చాలా మంది హాస్యనటుల నవ్వులు వెనకాల అంతులేని కన్నీటి గాథ ఉండటం గమనార్హం.   

PREV
16
నవ్వు వెనక కన్నీళ్లు.. అన్నీ తానైనా నాన్న చనిపోవడంతో ఒంటరైన జబర్దస్త్ కమెడియన్‌.. స్టేజ్‌పై కన్నీరు మున్నీరు..

ఇటీవల కాలంలో `జబర్దస్త్`లో పాపులర్‌ అయిన కమెడియన్‌ ప్రవీణ్‌. తనదైన పంచ్‌లతో ఆద్యంతం నవ్వులు పూయిస్తుంటా. స్పాంటీనియస్‌ జోకులతో కామెడీని పండిస్తూ ఆకట్టుకుంటున్నారు. రాకింగ్‌ రాకేష్‌-సుజాతల టీమ్‌లో ఉంటూ వారిద్దరపై సెటైర్లు పేలుస్తూ మరింతగా ఆకట్టుకుంటున్నారు. అంతే కాదు జడ్జ్ గా వ్యవహరిస్తున్న నటి ఇంద్రజకి ఇష్టమైన కమెడియన్‌గా మారడం విశేషం. ఆమె అతన్ని ఓ కొడుకులా భావిస్తుంటుంది. 
 

26

తనదైన పంచ్‌లు, సెటైర్లతో `జబర్దస్త్`లో నవ్వులు పూయిస్తున్న ప్రవీణ్‌ నవ్వు వెనకాల అంతులేని కన్నీళ్లున్నాయి. ఎవరూ లేని ఒంటరితనం ఉంది. అమ్మా నాన్న లేని అనాథలా మారిన బాధ ఉంది. అవన్నీ ఒక్కసారిగా బయట పడ్డాయి. `జబర్దస్త్` హౌజ్‌ మొత్తం కన్నీటి పర్యంతమయ్యింది. గుండెబరువెక్కించింది. అందరి చేత అయ్యో పాపం అనిపిస్తుంది. 

36

తాజాగా `ఎక్స్ ట్రా జబర్దస్త్` ప్రోమో విడుదలైంది. సెప్టెంబర్‌ 30(శుక్రవారం)న ప్రసారం కానున్న ఈ షోకి సంబంధించిన ప్రోమో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుంది. ఇందులో అందరు కామెడీ స్కిట్లు అదరగొట్టాయి. చివర్లో ప్రవీణ్‌ తన కన్నీటి గాథని బయటపెట్టాడు. 
 

46

చాలా రోజుల క్రితమే తన అమ్మ చనిపోయిందట. దీంతో నాన్నే అన్నీ తానయ్యాడట. కానీ ఇప్పుడు ఆయన కూడా లేడని, దీంతో ఒంటరై పోయానని తెలిపి కన్నీళ్లు పెట్టుకున్నారు ప్రవీణ్‌. `దేవుడు మా అమ్మని తీసుకెళ్లిపోయాక.. ఇచ్చింది మా నాన్నని ఒక్కడినే. ఏ బాధ వచ్చినా మా నాన్నకి ఒక్కడికే చెప్పుకునే వాడిని. ఈ రోజు ఆయన కూడా లేకుండా పోయిండు` అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు ప్రవీణ్‌. 
 

56

`ఎంత రాత్రైనా ఫోన్‌ చేసి నాన్న తిన్నవారా? అని మాట్లాడిన తర్వాతనే పడుకునే వాడు` అంటూ బోరున విలపించాడు. దీంతో అక్కడే ఉన్న యాంకర్‌ రష్మి, ఇతర కమెడియన్లు సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు. మరోవైపు ఇంద్రజ, మనోలు కూడా ఎమోషనల్‌ అయిపోయారు. దీంతో ప్రవీణ్‌కి ధైర్యాన్ని నింపింది ఇంద్రజ. మేం అందరం ఉన్నాం నాన్న బాధ పడకు అంటూ ప్రవీణ్‌ని దగ్గర తీసుకుని హత్తుకుని భరోసా ఇచ్చింది. ప్రస్తుతం ఈ ప్రోమో ఆద్యంతం కట్టిపడేస్తుంది. 
 

66

మరోవైపు అభిమానులు సైతం ప్రవీణ్‌కి సపోర్ట్ గా నిలుస్తుంది. మీకు మేము ఉన్న ప్రవీణ్‌ బాధపడకు అని, ప్రవీణ్‌ మాటలు వినగానే కన్నీళ్లు ఆగడం లేదని, ఆ నవ్వు వెనకాల ఇంతటి విషాదం ఉందా?, లోపల ఇంత బాధ పెట్టుకుని ఎలా నవ్వించగలుగుతున్నారు మీరు గ్రేట్‌ అంటూ ప్రశంసలు కురిపించడంతో పాటు ఆయనకు అండగా నిలుస్తున్నారు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories