శ్రీదేవి ముందు బొమ్మలా ఉండిపోయా.. స్ట్రగులింగ్‌ డేస్‌ బయటపెట్టిన నాగార్జున.. ఓపెన్‌గా నిజాలు వెల్లడి

Published : Aug 18, 2025, 04:39 PM IST

ఇటీవల `కూలీ` సినిమాలో నెగటివ్‌ రోల్‌ చేసి మెప్పించిన నాగార్జున తాజాగా తన బిగినింగ్‌ కెరీర్‌ గురించి ఓపెన్‌ అయ్యారు. తాను ఎంత స్ట్రగుల్‌ అయ్యాడో వెల్లడించారు నాగ్‌. 

PREV
15
`కూలీ`లో విలన్‌గా అదరగొట్టిన నాగార్జున

నాగార్జున ఇటీవల `కూలీ` సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. రజనీకాంత్‌ హీరోగా నటించిన ఈ చిత్రంలో నాగ్‌ విలన్‌ గా నటించారు. ఆయన కెరీర్‌లో మొదటిసారి విలన్‌గా చేసిన మూవీ ఇది. కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తూ నటించిన ఈ చిత్రానికి లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా గత గురువారం విడుదలైంది. మిశ్రమ స్పందన రాబట్టుకుంది. అయితే కలెక్షన్ల పరంగా ఈ వీకెండ్‌లో ఫర్వాలేదనిపించుకుంది.

DID YOU KNOW ?
నాగార్జున ఫస్ట్ బ్రేక్‌
హీరోగా పరిచయం అయిన తర్వాత తనకు హీరోగా మొదటి బ్రేక్‌ ఇచ్చిన మూవీ `మజ్ను` అని తెలిపారు నాగార్జున.
25
కెరీర్‌ ప్రారంభంలోని స్ట్రగుల్స్ పంచుకున్న నాగార్జున

తాజాగా నాగార్జున ఓపెన్‌ అయ్యారు.  జగపతిబాబు హోస్ట్ గా మారి చేస్తోన్న `జయమ్ము నిశ్చయమ్మురా` అనే టాక్‌ షోలో నాగ్ పాల్గొన్నారు. చాలా విషయాలను ఓపెన్‌గా పంచుకున్నారు. ఇందులో తన కెరీర్‌ బిగినింగ్‌ డేస్ స్ట్రగుల్స్ పంచుకున్నారు. తన తొలి సినిమా `విక్రమ్‌` నాన్న ఏఎన్నార్‌ చెప్పడం వల్ల చేశానని తెలిపారు. ఆ మూవీ ఏంటో తనకు అర్థం కాలేదని, వాళ్లు చెప్పినట్టు చేశానని, ఏం జరుగుతుందో కూడా అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నట్టు తెలిపారు. అక్కినేని కొడుకు నటించిన మూవీ అని, బాగానే చూశారు, రిజల్ట్ ఫర్వాలేదనిపించుకుందని చెప్పారు

35
శ్రీదేవి మూవీలో బొమ్మలా ఉండిపోయాను

ఇలా సుమారు ఏడు సినిమాల వరకు ఏం చేస్తున్నానో తెలియకుండానే చేసినట్టు తెలిపారు నాగార్జున. ఏదో చేయమంటే చేస్తున్నా‌ను కానీ ఒక్కటి కూడా నచ్చడం లేదు. మధ్యలో నాన్నగారితో `కలెక్టర్‌ గారి అబ్బాయి` చేశాను, దాసరిగారితో `మజ్ను` చేశాను. `మజ్ను` మూవీ మంచి బ్రేక్‌ ఇచ్చింది. ఇతనిలో నటుడు ఉన్నాడని అనుకునేలా చేసింది. ఆ తర్వాత బిగ్‌ బ్రేక్‌ అంటే `ఆఖరి పోరాటం`. కానీ ఆ మూవీ క్రెడిట్ అంతా రాఘవేంద్రరావు, శ్రీదేవిలకే దక్కిందని తెలిపారు నాగార్జున. ఆ మూవీలో ఏదో బొమ్మలా ఉండిపోయానంతే. అక్కడి వరకు నేను చేసేవే నాకు నచ్చడం లేదని చెప్పారు.

45
గీతాంజలి కోసం మణిరత్నం వెంటపడ్డాను

నాగార్జున ఇంకా తన జర్నీని పంచుకుంటూ, `ఆఖరి పోరాటం` తర్వాత నుంచి నాకు నచ్చింది చేయాలని నిర్ణయించుకుని మణిరత్నం వెనకాల పడ్డాను. మణిరత్నం తీసిన `మౌనరాగం` మూవీ చూశాను, అందులో ఆయన సెన్సిబులిటీని నాకు దగ్గరగా ఉంటాయనిపించింది. ఎలాగైనా సినిమా చేయాలనుకుని, ఆయన మద్రాస్‌లో పోయెస్‌ గార్డెన్‌లో ఉండేవారు. రోజు ఉదయాన్నే ఆయన ఇంటి ముందు నిలబడే వాడిని, కొద్దిసేపు తనతోపాటు నడవనిచ్చేవారు. ఆ తర్వాత ఆయన టెన్నీస్‌కి వెళ్లిపోయేవారు. అలా కొన్ని రోజులపాటు ఆయన వెంటపడటం వల్ల `గీతాంజలి` చేశారు. అది తనకు బిగ్‌ బ్రేక్‌ ఇచ్చింది. సంతృప్తినిచ్చింది.

55
`హలో బ్రదర్‌` నుంచి కంప్లీట్‌గా ఓపెన్‌ అయ్యాను

`గీతాంజలి` మూవీ చేస్తున్న సమయంలోనే ఆర్జీవీ వచ్చాడు. మరో మంచి డైరెక్టర్‌ తగిలాడనిపించింది. `శివ` చేశాం. అది ఒక చరిత్ర సృష్టించింది. `గీతాంజలి`, `శివ` సినిమాలు పెద్ద హిట్‌ అయిన తర్వాత మళ్లీ స్ట్రగుల్‌ కావాల్సి వచ్చింది. ఏకంగా ఆరు సినిమాలు ఆడలేదు. అందులో కాస్త ఆడిన మూవీ `నిర్ణయం`. ఇందులో నేను ఓపెన్‌ అయ్యాను. ఎందుకంటే ఇందులో కామెడీ చేయాలి. పేరొస్తుందని చేశాను. ఆ తర్వాత మరికాస్త ఓపెన్‌ అయ్యింది `ప్రెసిడెంటు గారి పెళ్లాం`. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం పూర్తి మాస్‌, కమర్షియల్‌గా ఉంటుంది. బాగా ఆడింది. ఇందులో మొదటిసారి విగ్గు పెట్టుకున్నా. అనంతరం ఈవీవీ సత్యనారాయణతో `హలో బ్రదర్‌` చేశాను. మొదటి సారి డబుల్‌ యాక్షన్‌ చేశాను. ఈ సినిమా నుంచే కంప్లీట్‌గా ఓపెన్‌ అయిపోయాను` అని తెలిపారు నాగార్జున. మొత్తంగా తనలో నటుడు ఉన్నాడని నిరూపించిన మూవీ `హలో బ్రదర్‌` అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం నాగార్జున  కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories