సడెన్ గా నిశ్చితార్థం చేసుకున్న రాహుల్ సిప్లిగంజ్.. కాబోయే భార్య ఎవరంటే, వైరల్ ఫొటోస్

Published : Aug 18, 2025, 04:35 PM IST

రాహుల్ సిప్లిగంజ్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తాజాగా రాహుల్ సిప్లిగంజ్ నిశ్చితార్థం చేసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. 

PREV
15
ఆస్కార్ వేదికపై రాహుల్ సిప్లిగంజ్ 

నాటు నాటు సాంగ్ తో ఆస్కార్ వేదికపై సందడి చేశాడు రాహుల్ సిప్లిగంజ్. రాహుల్ సిప్లిగంజ్ పాడిన నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డుని కైవసం చేసుకుంది. అదే విధంగా రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ విజేతగా కూడా నిలిచారు. టాలీవుడ్ లో రాహుల్ సిప్లిగంజ్ ప్రముఖ సింగర్ గా కొనసాగుతున్నారు. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా సడెన్ గా రాహుల్ సిప్లిగంజ్ వ్యక్తిగత జీవితంలో కొత్త అడుగు వేశారు. ఆదివారం, ఆగస్టు 17న ఆయన హరిణ్యా రెడ్డి తో నిశ్చితార్థం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రుల సమక్షంలో జరిగిన ఈ వేడుక సింపుల్ గా సాగింది. 

25
రాహుల్ సిప్లిగంజ్ నిశ్చితార్థం

సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. రాహుల్ సిప్లిగంజ్ అధికారికంగా ఎలాంటి ఫోటోలు పంచుకోకపోయినా, లీకైన చిత్రాలు అభిమానుల్లో సంతోషాన్ని నింపుతున్నాయి. ఆ ఫోటోల్లో రాహుల్ లావెండర్ షెర్వానీ ధరించి రాయల్ లుక్ తో మెరిశారు. హరిణ్యా రెడ్డి ఆరెంజ్ లెహంగా ధరించి అందంగా మెరిసింది. రాహుల్ సిప్లిగంజ్, హరిణ్యా రెడ్డి చూడ ముచ్చటగా ఉన్నారు. 

35
అభిమానుల నుంచి శుభాకాంక్షలు 

ఈ నిశ్చితార్థ వార్త వెలుగులోకి రాగానే అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు. అధికారిక ఫోటోలు త్వరలోనే విడుదలవుతాయని, అలాగే వివాహ వివరాలు త్వరలో వెల్లడవుతాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.

45
సింగర్ గా పాపులర్ అయిన రాహుల్ సిప్లిగంజ్ 

రాహుల్ సిప్లిగంజ్ సంగీత ప్రయాణం ఓ సాధారణ స్థాయి నుండి ప్రారంభమై, గ్లోబల్ లెవెల్ కి చేరడం విశేషం. మ్యూజిక్ వీడియోలతో కెరీర్ ఆరంభించిన ఆయన, తర్వాత ప్లేబ్యాక్ సింగర్ గా ఎదిగి, నాటు నాటు ద్వారా ప్రపంచాన్ని ఆకట్టుకున్నారు. 2023లో ఆస్కార్ గెలుచుకున్న ఈ పాట ఆయన కెరీర్ కి మైలురాయిగా నిలిచింది.

55
రాహుల్ సిప్లిగంజ్ కి తెలంగాణ ప్రభుత్వం నజరానా 

సడెన్ గా నిశ్చితార్థం చేసుకున్న రాహుల్, హరిణ్యా రెడ్డి త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. హరిణ్యా రెడ్డి బ్యాగ్రౌండ్ గురించి ఎలాంటి వివరాలు బయటకి రాలేదు. ఆమె ఇండస్ట్రీకి చెందిన అమ్మాయా కాదా అనే చర్చ అభిమానుల్లో జరుగుతోంది. రాహుల్ సిప్లిగంజ్ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నుంచి రూ. కోటి నజరానా అందుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ కి ఈ బహుమతి అందించారు. 

Read more Photos on
click me!

Recommended Stories